PC: BCCI/IPL.com
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసిన మధ్యప్రదేశ్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జాని(80) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్విక్ దేశాయ్917), మన్కడ్916) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ సింగ్, రాహుల్ బాథమ్, శుక్లా తలా వికెట్ సాధించారు.
అదరగొట్టిన అర్పిత్, అయ్యర్..
అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. మధ్యప్రదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ అర్పిత్ గౌడ్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరితో పాటు హర్‌ప్రీత్ సింగ్ భాటియా(9 బంతుల్లో 22) మెరుపు మెరిపించాడు.
సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్, అనుకుర్ పన్వార్, జాని తలా వికెట్ సాధించారు. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ప్రత్యర్ధి ఎవరో బెంగాల్, బరోడా మ్యాచ్‌తో తేలనుంది.
చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment