సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ చండీఘడ్‌పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
పదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్ లాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ప్రదిప్త ప్రమాణిక్ 30, వ్రిత్తిక్ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ బవా 2, నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భగ్మేందర్ లాథర్ తలో వికెట్ తీశారు.
160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్‌ను దెబ్బకొట్టాడు.
కనిష్క్ సేథ్ 2, షాబాజ్ అహ్మద్, షమీ తలో వికెట్ పడగొట్టారు. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో రాజ్ బవా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ యాదవ్ (27), మనన్ వోహ్రా (23), నిఖిల్ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
కాగా, డిసెంబర్ 11న జరిగే క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment