ఇలా జరిగిందేం..?
తలపట్టుకున్న క్యాబ్
కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో సచిన్ ఆడే చివరి టెస్టు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)... మూడో రోజే మ్యాచ్ అయిపోవడంతో తలపట్టుకుంది. నాలుగు, ఐదు రోజుల్లో సచిన్ సన్మానానికి భారీ ఏర్పాట్లు చేశారు. నాలుగోరోజే మ్యాచ్ ముగిసినా తమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా ప్లాన్ చేశారు. సెలబ్రిటీలందరినీ నాలుగో రోజు మ్యాచ్‌కు ఆహ్వానించారు. 199 కిలోల గులాబీ పూలు చల్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మ్యాచ్ మూడో రోజే ముగిసింది.
సచిన్‌కు మమతా బెనర్జీ ‘చిత్రం’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తను గీసిన ఓ చెట్టు చిత్రాన్ని సచిన్‌కు బహూకరించారు. దీంతోపాటు సచిన్‌కు తలపాగాను అందించగా దాన్ని మాజీ కెప్టెన్ గంగూలీ అతడి తలకు అలంకరించాడు. మరోవైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా 199 బంగారు ఆకులతో కూడిన మర్రి చెట్టు విగ్రహాన్ని, టాస్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు నాణేన్ని సచిన్‌కు అందించారు.
బై... బై... ఈడెన్
Published Sat, Nov 9 2013 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement