PC: IPL Twitter
ఐపీఎల్-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు ముగియగా.. ప్లే ఆఫ్స్‌కు ఆయా జట్లు సిద్దమవుతున్నాయి. ఇక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం(మే24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
అదే విధంగా మే25న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే కోల్‌కతా వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌కు,ఫైనల్‌కు బీసీసీఐ కొత్త నిబంధనలను రూపొందించింది.
ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగించి, నిర్ణీత సమయంలో ఆట సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేలుస్తారు. ఒక వేళ సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. కాగా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 కోసం ఎటువంటి రిజర్వ్ డేను బీసీసీఐ కేటాయించలేదు. అయితే ఫైనల్‌కు మాత్రం రిజర్వ్ డేను కేటాయించారు. ఒక వేళ మే29న ఫైనల్‌కు ఎటువంటి అంతరాయం కలిగినా.. మ్యాచ్‌ను తిరిగి మే 30న నిర్వహించనున్నారు.
►క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులతో పాటు అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు రెండు గంటల రిజర్వు టైమ్‌ని కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
►ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైతే రెండు గంటల వరకు నిర్ణీత 20 ఓవర్లలో ఎటువంటి కుదింపు ఉండదు.
►అదే విధంగా మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం కలిగితే ఇన్నింగ్స్ బ్రేక్ 20 నిమిషాలను 10 నిమిషాలకు కుదిస్తారు.
►వర్షం వల్ల మ్యాచ్ కటాఫ్ టైం దాటిపోతే.. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు అయిదేసి ఓవర్ల చొప్పున ఇడే ఆవకాశం ఉంటుంది. ప్లేఆఫ్స్‌లో కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్ జరగడానికి రాత్రి 11.56 వరకు అవకాశం ఉంటుంది. కాగా ఐదు ఓవర్ల మ్యాచ్‌కు ఎటువంటి టైమ్‌అవుట్‌లు ఉండవు.
►ఒకవేళ ఫైనల్లో ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ సమయం తెల్లవారుజామున 12:26 నిమిషాలు.
క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 వర్షం కారణంగా రద్దు అయితే?
►ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో అదనపు సమయం ముగిసేలోగా కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ని కూడా నిర్వహించడానికి సాధ్యం కాకపోతే.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు.
►ఈ మ్యాచ్‌లకు సూపర్ ఓవర్ కటాఫ్ టైమ్ ఉదయం 12:50 నిమిషాలు.
►సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాని తరుణంలో లీగ్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.
► ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేనుందున.. ఈ మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్ పూర్తి అయ్యాక.. రెండో ఇన్నింగ్స్ మధ్యలో వరుణుడు అంతరాయం కలిగిస్తే.. డక్‌వర్త్-లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తారు.
ఫైనల్ రూల్స్
►ఒకవేళ ఫైనల్ మ్యాచ్ మే 29న ప్రారంభమై మధ్యలో ఆగిపోతే, రిజర్వ్ డే రోజున మిగతా మ్యాచ్‌ను నిర్వహిస్తారు.
►ఫైనల్‌లో టాస్ వేసిన తర్వాత ఆట సాధ్యం కాని పక్షంలో, రిజర్వ్ రోజున జట్లకు మళ్లీ తాజాగా టాస్ ఉంటుంది.
►ఫైనల్‌కు అంతరాయం కలిగినప్పుడు 3గంటల 20నిమిషాలతో పాటు అదనంగా రెండు గంటల సమయం ఉంటుంది.
►ఇక ఫైనల్ రోజు గానీ రిజర్వ్ ఫైన్ డే రోజు గానీ సూపర్ ఓవర్ జరగడానికి ఉదయం1.20 వరకు అవకాశం ఉంటుంది.
► కాగా రిజర్వ్‌డే రోజునైనా కనీసం ఐదు ఓవర్లు ఆటకూడా ఆటసాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు
చదవండి: IPL 2022: తుఫాను దాటికి ఈడెన్ గార్డెన్స్ కుదేలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లేమో అక్కడే!
Kalbaisakhi in #Kolkata look at #EdenGarden…. pic.twitter.com/mw7IuDVRe2
— Kamalika Sengupta (@KamalikaSengupt) May 21, 2022
Comments
Please login to add a commentAdd a comment