ఐపీఎల్-2022లో భాగమైన పిచ్ క్యూరేటర్‌లు,గ్రౌండ్స్‌మెన్‌లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటిచింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన ఆరు వేదికలలో పనిచేసిన క్యూరేటర్‌లు, గ్రౌండ్స్‌మెన్‌లకు రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటెరీ జై షా తెలిపారు. కాగా ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోడీ స్టేడియాల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించబడినందున.. ఒక్కో స్టేడియానికి రూ. 12.5 లక్షలు కేటాయించారు. మరో వైపు లీగ్ మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చిన నాలుగు వేదికల క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌లకు రూ. 25 లక్షలు అందజేయనున్నారు.
లీగ్ దశలో మ్యాచ్‌లు అన్నీ మహరాష్ట్రలోనే జరిగాయి. బ్రబౌర్న్,వాంఖడే, డివై పాటిల్ స్టేడియం, ఎంసీఎ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరిగాయి. ఒక్కో స్టేడియానికి రూ. 25 లక్షలు రివార్డుగా అందనుంది. "ఐపీఎల్-2022లో అద్భుతమైన మ్యాచ్‌లు అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌లకు రూ. 1.25 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో 6 వేదికలలో పనిచేసిన మా క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ తెర వెనుక రియల్ హీరోలు" అని జై షా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటన్స్ నిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు
Comments
Please login to add a commentAdd a comment