![Sourav Ganguly Childhood Coach Ashok Mustafi Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/30/Ganguly.jpg.webp?itok=Rfb3LYhw)
కోల్‌కతా : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ(86) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన తన కూతురితో పాటు లండన్‌లో ఉండేవారు. ఆయన గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఏప్రిల్ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడంతో తుదిశ్వాస విడిచారని ముస్తఫీ కుటుంబ సభ్యులు తెలిపారు.
బెంగాల్‌కు క్రికెట్ పాఠాలు నేర్పే దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్లో అశోక్ ముస్తాఫీ ప్రముఖ కోచ్‌గా ఉండేవారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న 12మంది బెంగాల్ రంజీ క్రికెటర్లుగా ఎదిగారు. సౌరవ్ గంగూలీ చిన్నతనంలో తొలిసారిగా ముస్తాఫీ వద్దే క్రికెట్లో ఓనమాలు దిద్దాడు. దాదా స్నేహితుడు సంజయ్ దాస్ కూడా ఆయన వద్దే క్రికెట్ ప్రారంభించాడు. గత నెల ముస్తాఫీ ఆరోగ్యం క్షీణించగా.. వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను గంగూలీ, సంజయ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment