భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇవాళ (జులై 8) 52వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డు గురించి తెలుసుకుందాం.
క్రికెట్ చరిత్రలో వివిధ ఫార్మాట్లలో ఇప్పటిదాకా పదుల సంఖ్యలో ఐసీసీ టోర్నీలు జరగగా.. ఓ రికార్డు నేటికీ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిటే ఉంది. అదేంటంటే.. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు.
1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గంగూలీ భారత కెప్టెన్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆరు సెంచరీలు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో కెప్టెన్‌గా (ఐసీసీ టోర్నీల్లో) ఎవరూ ఇన్ని సెంచరీలు చేయలేదు. గంగూలీ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 5 సెంచరీ చేశాడు.
పాంటింగ్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో కేన్ విలియమ్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2), సనత్ జయసూర్య (2) ఉన్నారు.
కాగా, 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ.. 38 సెంచరీలు, 107 అర్ద సెంచరీల సాయంతో 18000 పైచిలుకు పరుగులు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగానూ పని చేశాడు. తన హయాంలో గంగూలీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని ముద్దుగా అందరూ దాదా (బెంగాలీలో అన్న అని అర్దం) అని పిలుస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment