'చహల్‌ విషయంలో తప్పు చేస్తున్నారు'.. గంగూలీ హెచ్చరిక | Ganguly Says-Yuzvendra Chahal Crucial-Role-India World Cup Team 2023 | Sakshi
Sakshi News home page

'చహల్‌ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక

Published Mon, Jul 3 2023 5:27 PM | Last Updated on Mon, Jul 3 2023 5:35 PM

Ganguly Says-Yuzvendra Chahal Crucial-Role-India World Cup Team 2023 - Sakshi

టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ టెస్టుల్లో పెద్దగా మెరవనప్పటికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్లు తీయగల సమర్థుడు. కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి స్వదేశంలో ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించాడు. అయితే ఈ మధ్యన అతన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా ఉపఖండపు పిచ్‌లు  స్పిన్నర్లకు స్వర్గధామం. అశ్విన్‌ లాంటి టాప్‌క్లాస్‌ స్పిన్నర్‌ టెస్టుల్లో మాత్రమే ప్రభావం చూపించగలడు.

వన్డేలు ఆడినప్పటికి పెద్దగా మెరిసింది లేదు. మరో నాలుగు నెలల్లో భారత్‌ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది. 2011 తర్వాత పుష్కర కాలానికి టీమిండియా మెగా సమరానికి ఆతిథ్యం ఇస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి రోహిత్‌ సేన కచ్చితంగా కప్‌ కొట్టి ధోని సేన మ్యాజిక్‌ను పునరావృతం చేస్తారని అంతా ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ బాధ్యతలు ఎవరు నడిపస్తారనేది ఆసక్తిగా మారింది. చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లతో పాటు అక్షర్‌ పటేల్‌లు ఉన్నప్పటికి రెగ్యులర్‌ స్పిన్నర్లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కుతుంది. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. వన్డే వరల్డ్‌కప్‌కు యజ్వేంద్ర చహల్‌ను ఆడించడం ఉత్తమమని.. అతను ప్రభావం చూపే అవకాశం ఉంటుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

గంగూలీ మాట్లాడుతూ.. ''వన్డే వరల్డ్ కప్‌లో యజ్వేంద్ర చాహాల్ కచ్ఛితంగా ఆడాలి. టీమిండియాకి జడేజా ఉన్నాడు. అతనితో పాటు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అయితే రవిభష్ణోయ్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ లాంటి స్పెషలిస్టు స్పిన్నర్లే... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు..

యజ్వేంద్ర చహాల్‌ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడించకపోవడం చాలా పెద్ద తప్పు. అతన్ని ఆడించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై స్పిన్నర్లు కీ రోల్ పోషించారు.. 2011 వన్డే వరల్డ్ కప్‌లో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ చురకలు

బెయిర్‌ స్టో ఔట్‌ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement