టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్నాడు. కౌంటీ క్రికెట్‌లో చహల్ చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు ముందు డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు) మెరిశాడు.
అంతకుముందు ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ చహల్ చెలరేగాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చహల్ రాకతో నార్తంప్టన్‌షైర్ ఫేట్ మారిపోయింది.
ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. చహల్ నార్తంప్టన్‌షైర్ తరఫున ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతున్నాడు. కాగా, చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.
మ్యాచ్ విషయానికొస్తే.. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 మ్యాచ్‌ల్లో భాగంగా లీసస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. చహల్‌తో పాటు రాబ్ కియోగ్ (3/20), జాక్ వైట్ (2/16), సాండర్‌సన్ (1/32) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది.
లీసెస్టర్ ఇన్నింగ్స్‌లో బుడింగర్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హిల్ (32), రెహాన్ అహ్మద్ (30) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు లీసెస్టర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment