టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ పడిలో అడుగుపెట్టాడు. 'దాదా' అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ క్రికెట్ ఆడిన రోజుల్లో ఏం చేసినా సంచలనమే. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చిన గంగూలీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడు. అంతకముందు 2002లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ వన్డే సిరీస్‌ను గెలిచిన సందర్భంలో లార్డ్స్ బాల్కనీ నుంచి షర్ట్ విప్పి గిరగిరా తిప్పడం ఒక్క దాదాకే చెల్లింది. కాగా గంగూలీ తన పుట్టినరోజు నాడే ఒక కీలక ప్రకటన చేశాడు.
‘సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్‌లైన్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు. ''దాదాపు 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్, పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో నా 51 పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా. నేను నేర్చుకున్న అంశాలను మీ కోసం తీసుకొస్తున్నా.
'సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్' అనే యాప్ ద్వారా మొదటిసారి నాయకత్వంపై ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తున్నా. దీనికోసం కృషి చేసిన క్లాస్‌ప్లస్ (ఎడ్‌టెక్ స్టార్టప్)కు ధన్యవాదాలు. నేను, క్లాస్‌ప్లస్ కలిసి ఆన్‌లైన్ కోర్సును మీకు అందించడానికి వస్తున్నాం'' అని తెలిపాడు. ఇక గంగూలీ పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు మాజీ క్రికెటర్లు సహా ఈతరం క్రికెటర్లు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
16+ years of international cricket and countless matches later… on this 51st bday, I sum up my learnings for you. They are now yours!
— Sourav Ganguly (@SGanguly99) July 8, 2023
Announcing “Sourav Ganguly Masterclass”, an app that has my first-ever online course on leadership - https://t.co/fX0dM4NVTb
Thanks to… pic.twitter.com/Dek5fBzBM5
Comments
Please login to add a commentAdd a comment