Online Course
-
పుట్టినరోజు నాడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ పడిలో అడుగుపెట్టాడు. 'దాదా' అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ క్రికెట్ ఆడిన రోజుల్లో ఏం చేసినా సంచలనమే. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చిన గంగూలీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడు. అంతకముందు 2002లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ వన్డే సిరీస్‌ను గెలిచిన సందర్భంలో లార్డ్స్ బాల్కనీ నుంచి షర్ట్ విప్పి గిరగిరా తిప్పడం ఒక్క దాదాకే చెల్లింది. కాగా గంగూలీ తన పుట్టినరోజు నాడే ఒక కీలక ప్రకటన చేశాడు. ‘సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్లైన్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు. ''దాదాపు 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్, పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో నా 51 పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా. నేను నేర్చుకున్న అంశాలను మీ కోసం తీసుకొస్తున్నా. 'సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్' అనే యాప్ ద్వారా మొదటిసారి నాయకత్వంపై ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తున్నా. దీనికోసం కృషి చేసిన క్లాస్‌ప్లస్ (ఎడ్టెక్ స్టార్టప్)కు ధన్యవాదాలు. నేను, క్లాస్‌ప్లస్ కలిసి ఆన్లైన్ కోర్సును మీకు అందించడానికి వస్తున్నాం'' అని తెలిపాడు. ఇక గంగూలీ పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు మాజీ క్రికెటర్లు సహా ఈతరం క్రికెటర్లు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 16+ years of international cricket and countless matches later… on this 51st bday, I sum up my learnings for you. They are now yours! Announcing “Sourav Ganguly Masterclass”, an app that has my first-ever online course on leadership - https://t.co/fX0dM4NVTb Thanks to… pic.twitter.com/Dek5fBzBM5 — Sourav Ganguly (@SGanguly99) July 8, 2023 -
లక్షాధికారుల్ని చేస్తున్న చాట్‌జీపీటీ.. ఎలా అంటారా?
చాట్‌జీపీటీ! సాంకేతిక రంగంలో సరికొత్త సంచలనం. మనుషుల చేసే ఉద్యోగాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జీపీటీ టూల్స్ చేస్తుండడంతో ఏ నలుగురు ఒకచోట చేరినా దీని గురించే చర్చ. అందుకే టెక్నాలజీ రంగంతో పాటు సామాన్యుల్లో సైతం చాట్‌జీపీటీపై ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో చాట్‌జీపీటీ డిమాండ్‌ను పలువురు క్యాష్ చేసుకుంటున్నారు. నెలల వ్యవధిలో లక్షలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. వారిలో యూఎస్‌కు చెందిన 23 ఏళ్ల లాన్స్ జంక్ ఒకరు. లాన్స్ (Lance Junck) చాట్‌జీపీటీ వినియోగించి కేవలం మూడు నెలల్లో రూ.28 లక్షల సంపాదించాడు. ఎలా అంటారా? ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. దాన్ని ఎలా వినియోగించాలో తెలియని వాళ్లు ఆన్లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. లాన్స్ చాట్‌జీపీటీపై మూడునెలల వీడియో కోర్స్ తయారు చేసి ఉడెమీ(Udemy) ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టాడు. అలా పెట్టాడో లేదో..ఆ కోర్స్ నేర్చుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువ మంది డబ్బులు చెల్లించి కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఏడు గంటల కంటే ఎక్కువ నిడివితో ఉన్న ఈ రికార్డ్ వీడియో కోర్స్ ఖరీదు రూ.3199గా ఉంది. ఇందులో బిగినర్స్ కోసం 50 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోల్ని రికార్డ్ చేసేందుకు సుమారు 3వారాల సమయం పట్టిందని లాన్స్ తెలిపాడు. కోర్సు నేర్చుకుంటున్న వారి వయసు 20 నుంచి 50 మధ్య ఉండగా.. భారత్, కెనడా, జపాన్ వంటి దేశాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. చాట్‌జీపీటీ అందుబాటులో లేని మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుండి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని చెప్పారు. ఈ కోర్స్ కొనుగోలు చేయడం ద్వారా తాను మూడు నెలల్లో రూ.28లక్షల సంపాదించినట్లు చెప్పాడు. -
అలా పీహెచ్‌డీలు చేస్తే చెల్లవు: యూజీసీ హెచ్చరిక
ఢిల్లీ: పీహెచ్డీ కోర్సుల విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా శుక్రవారం ఒక జాయింట్ అడ్వైజరీ రిలీజ్ చేశాయి. విదేశీ విద్యాసంస్థల సహకారంతో ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎడ్టెక్) కంపెనీలు నిర్వహిస్తున్న పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చెల్లవని ప్రకటించింది. ఆన్లైన్ పీహెచ్డీ కోర్సులకు ఎలాంటి గుర్తింపు ఉండబోదని పేర్కొంటూ.. ఈ మేరకు ఓ పబ్లిక్ నోటీసును జారీ చేసింది కంట్రోలర్స్ ఆఫ్ హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. తమ మార్గదర్శకాల ప్రకారం.. ఎడ్టెక్ కంపెనీలు నిర్వహించే ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌కు గుర్తింపు ఉండబోదని స్పష్టం చేసింది. యూజీసీ రెగ్యులేషన్ 2016 ప్రకారం ప్రామాణికాలు పాటించాల్సిందేనని, అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ కూడా యూజీసీ మార్గదర్శకాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. UGC advises Students and public, at large, not to be misled by advertisements for online Ph.D programmes offered by EduTech Companies in collaboration with Foreign Educational Institutes. For more details please see the attached public notice. @PMOIndia pic.twitter.com/RlP33Ziv7B — UGC INDIA (@ugc_india) October 28, 2022 విదేశీ యూనివర్సిటీల సహకారంతో.. ఆన్లైన్ పీహెచ్డీ అంటూ వచ్చే ప్రకటనలపట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటికి ఆకర్షితులు కావొద్దంటూ విద్యార్థులకు సూచించింది ఆ నోట్. పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకునేముందు యూజీసీ రెగ్యులేషన్ 2016లోబడి ఉందో క లేదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించింది. ఈ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్న పలు ఉదంతాలు ఇటీవల తెరపైకి రావడంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు యూజీసీ, ఏఐసీటీఈ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మీ స్మార్ట్ ఫోన్ రిపేర్‌కు ఇస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి -
ఓటీటీలో ప్రిప్‌ఇన్‌స్టా ప్రైమ్
ఎడ్టెక్ సేవలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఎడ్‌టెక్‌లో తనదైన ముద్ర వేసిన ప్రిప్‌ఇన్‌స్టా తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా సేవలు అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రిప్‌ఇన్‌స్టా ప్రైమ్ పేరుతో సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రొఫెనల్స్‌కు అనువుగా ఉండేలా సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌తో 150 రకాల కోర్సులు ప్రిప్‌ఇన్‌స్టా అందివ్వనుంది. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీలతో పాటు సీ, సీ ప్లస్ వంటికోడింగ్ కోర్సులు, పైథాన్, డీఎస్ఏ వంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులు ఇక్కడ లభిస్తున్నాయి. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ విషయానికి వస్తే మూడు నెలలకు రూ.2499 నుంచి రూ.6499 వరకు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రిప్ ఇన్‌స్టాకు 15 లక్షల మంది చందాదారులు ఉన్నారు. ఇక్కడ 150కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఇకపై ఆన్లైన్లో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు
చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా డేటా సైన్స్‌కు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుతోంది. 2026 నాటికి ఈ రంగంలో దాదాపు 11.5 మిలియన్ల ఉద్యోగాలు లభ్యమవుతాయని అంచన. దానిని దృష్టిలో పెట్టుకొని డేటాసైన్స్‌లో ఆన్లైన్ ద్వారా సమగ్రమైన ఒక డిగ్రీని అందించే కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో మొదటిసారి ప్రోగ్రామింగ్ అండ్ డేటాసైన్స్‌లో ఆన్లైన్ బీఎస్సీకోర్సును మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేష్ పొక్రియల్ నిశాంక్ ప్రారంభించారు. ఈ ఆన్లైన్ కోర్సును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటీ, మద్రాస్) అందిస్తోంది. 12వ తరగతి పాస్ అయ్యి, 10వ తరగతిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. (ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1) ఈ కోర్సును మూడు స్టేజ్లలో అందించనున్నారు. ఫౌండేషన్ ప్రోగ్రాం, డిప్లమా ప్రోగ్రాం, డిగ్రీ ప్రోగ్రాం. అయితే ఏ స్టేజ్‌లో కావాలన్నా కోర్సును మధ్యలో ఆపేయవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను కూడా ఐఐటీ మద్రాస్ నుంచి పొందవచ్చు. (తాగునీటి శుద్ధికి జనుము + రాగి!) ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అఫ్లికేషన్ ఫీజు రూ. 3000 ఉంటుంది. వారికి నాలుగు వారాల పాటు మ్యాథ్స్, ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్‌లో కోర్సు ఉంటుంది. వీరికి ఆన్లైన్లో విద్యాబోధన అందిస్తారు. వీరు ఆన్లైన్లో ఎసైన్మెంట్స్, నాలుగో వారం చివరిలో క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో 50శాతం పైగా ఉత్తీర్ణత సాధించిన వారిని ఈ ఫౌండేషన్ కోర్సుకు అర్హులుగా ఎంపిక చేస్తారు. (ప్రపంచం భారత్ వైపు చూస్తోంది!) -
జూన్ నుంచి ఐఎస్బీలో కొత్త కోర్సుకు శ్రీకారం
♦ ‘హ్యపీనెస్’పై ఆరు వారాల ఆన్లైన్ కోర్సు ♦ ఐఎస్బీ,కోర్సెరా సంయుక్తంగా నిర్వహణ హైదరాబాద్: ఇప్పటి వరకు వ్యాపార, నిర్వహణ అంశాలతో కూడిన కోర్సులను అందించిన గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వినూత్న కోర్సుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ‘ఏ లైఫ్ ఆఫ్ హ్యాపినెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్’ పేరిట ఆరు వారాల పాటు ఆన్లైన్ ద్వారా కోర్సును ఐఎస్బీ హైదరాబాద్, మొహలీ రెండు కేంద్రాలలో అందుబాటులో ఉంచుతారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆన్లైన్ కోర్సులను విస్త్రృత స్థాయిలో అందిస్తున్న కోర్సెరా సంస్థతో ఈ ఆన్లైన్ కోర్సు అందించేందుకు ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంది. సానుకూల మనస్తత్వ ధోరణిని ఆధారంగా చేసుకొని శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఈ కోర్సుకు శ్రీకారం చుట్టారు. ఐఎస్బీలో జూన్ 15, 2015 నుంచి ఈ కోర్సు మొదలవుతుంది. ప్రస్తుతం 70 దేశాలలో అమలు చేస్తున్న ఈ కోర్సులో ఇప్పటికే 20 వేల మంది విద్యార్థులు చేరారని ఐఎస్బీ అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ యాక్సెస్ కలిగిన ఎవరికైనా ఉచితంగా ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులు ఈ కోర్సును పూర్తి చేస్తే తమ విధులను ఆనందమైన ఆలోచనా విధానాలతో మరింత మెరుగ్గా చేసుకోవడానికి, సంస్థ మనుగడ మరింతగా ఇనుమడింప చేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐఎస్బీ అధికారులు తెలిపారు. ఈ కోర్సును ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్, ఐఎస్బీ విజిటింగ్ ప్రొఫెసర్ రాజ్ రఘునాథన్ భోదిస్తారు.