టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. ఇంటర్వ్యూ కోసం ఓ ప్రముఖ జర్నలిస్టు తనను బెదిరించినట్లు సాహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సాహానే స్వయంగా ట్విటర్‌లో స్క్రీన్‌షాట్ల రూపంలో బయటపెట్టాడు. సాహా ట్వీట్ అనంతరం మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్‌లు అతనికి మద్దతుగా నిలిచి.. ఆ జర్నలిస్ట్ పేరు బయటికి చెప్పాల్సిందన్నారు.
చదవండి: Saha-Journalist Row: ఆటగాళ్లు నేరుగా మీడియాతో మాట్లాడకూడదు.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!
కాగా సాహా ట్వీట్‌ను బీసీసీఐ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ విషయంలో సాహాను బీసీసీఐ వివరణ కోరనున్నట్లు బోర్డు ట్రెజరర్ అరుణ్ దుమాల్ పీటీఐతో తెలిపారు. ''సాహా చేసిన ట్వీట్ గురించి అతన్నే అడుగుదామనుకుంటున్నాం. అసలు అది నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సాహాకు నిజంగానే సదరు జర్నలిస్ట్ నుంచి బెదిరింపులు వచ్చాయా.. ట్వీట్ వెనుక బ్యాక్‌గ్రౌండ్ కాంటెస్ట్ ఏముందనేది తెలుసుకోవాలి. ఇంతకుమించి తాను ఏం చెప్పలేను. సాహాతో బీసీసీఐ సెక్రటరీ మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటారని'' చెప్పుకొచ్చాడు.
కాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కలేదు. భారత జట్టులోకి మున్ముందు ఎంపిక చేసే అవకాశం లేదని, రిటైర్మెంట్ గురించి ఆలోచించాలంటూ సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ఇటీవలే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ తనకు ఈ సమాచారం ఇచ్చాడంటూ సాహా బహిరంగపర్చాడు.
సాహా వ్యాఖ్యలపై ద్రవిడ్ స్పందించాడు. తాను చేసిన సూచనలో తప్పేమీ లేదని, సాహా దానిని బయటపెట్టడం పట్ల కూడా తాను బాధపడటం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ప్రధాన వికెట్ కీపర్‌గా పంత్ తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని, సాహాకు బదులుగా మరో యువ ఆటగాడిని రెండో కీపర్‌గా తీర్చి దిద్దాలనే ఉద్దేశం సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉందని అతను వివరించాడు.
After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX
— Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022
Comments
Please login to add a commentAdd a comment