టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్దిమాన్ సాహా- జర్నలిస్ట్ మధ్య వివాదంతో మేల్కొన్న బీసీసీఐ.. టీమిండియా కాంట్రాక్ట్ ఆటగాళ్లు మీడియాతో నేరుగా సంప్రదింపులు జరిపే అంశానికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో లంకతో ప్రారంభంకానున్న సిరీస్ నుంచే కొత్త గైడ్‌లైన్స్‌ను ఆచరణలోకి తీసుకురావాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.
బీసీసీఐ ప్రతిపాదిస్తున్న కొత్త మీడియా గైడ్ లైన్స్:
- బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లతో మీడియా నేరుగా మాట్లాడకూడదు.
- బీసీసీఐ మీడియా మేనేజర్ ద్వారానే ఆటగాళ్లు-మీడియా మధ్య సమాచారం బదిలీ జరగాలి.
- పబ్లిక్ ఫంక్షన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఆటగాళ్లు మీడియాతో మాట్లాడే వెసులుబాటు యధాతథంగా కొనసాగనుంది.
- బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే ఆటగాడిపై నిషేధం లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.
- బీసీసీఐ మీడియా మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్ల ఇంటర్వ్యూలు, బైట్స్ తీసుకునే జర్నలిస్టులను ఏడాది పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది.
- అండర్-19 క్రికెటర్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
కాగా, ఇంటర్వ్యూ కోసం ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరించినట్లు టీమిండియా సీనియర్ వికెట్‌కీపర్ సాహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూండా ఉండేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మీడియాకు కొత్త గైడ్‌లైన్స్ విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
చదవండి: Wriddhiman Saha: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు.. రంగంలోకి బీసీసీఐ!
Comments
Please login to add a commentAdd a comment