BCCI contracts
-
BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్‌లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్‌కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్‌లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్‌గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్‌లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్‌లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్. -
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఈసారి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వినికిడి.అదేవిధంగా ఏ కేటగిరీలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను A+ కేటగిరీకి బీసీసీఐ ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20లకు విడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే A+ కేటగిరీలో కొనసాగాలంటే మూడు ఫార్మాట్లో ఆడాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రుతురాజ్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడికి వచ్చిన అవకాశాలను కూడా గైక్వాడ్ సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతేడాది అతడు భారత్ తరపున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. చివరగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున రుతురాజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా గైక్వాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు భారత్ తరపున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. కాగా గైక్వాడ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
Champions Trophy 2025: శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ లభించనుందని తెలుస్తుంది. శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ గతేడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్దరించలేదు. గత మార్చిలో శ్రేయస్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేజార్చుకున్నాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. రీఎంట్రీలో శ్రేయస్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు ఆడి 79.92 స్ట్రయిక్‌రేట్‌తో 195 పరుగులు చేశాడు. శ్రేయస్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ఫైనల్‌కు చేరింది.ఈ టోర్నీలో శ్రేయస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొదటి బ్యాటింగ్‌తో పాటు ఛేదనలోనూ సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన (17 బంతుల్లో 15) శ్రేయస్.. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (67 బంతుల్లో 56) మెరిశాడు. చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మరో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ (45) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల తర్వాత శ్రేయస్‌కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది. దీంతో బీసీసీఐ శ్రేయస్‌కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది. బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి కొత్తగా వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్ తుది సమరానికి అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 9వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ (2019-2021) తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. కానీ 'నో' చెప్పేశాడుగా!?
భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇదే విషయం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రంజీల్లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ నుంచి తప్పించేముందు బీసీసీఐ పెద్దలు వారిద్దరితో మాట్లాడి వుంటే బాగుండేదని పలువరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు జట్టును ప్రకటించేముందు ఇషాన్ కిషన్‌ను బీసీసీఐ సెలక్టర్లు సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ టెస్టు తర్వాత జట్టుతో కలవాలని సెలక్టర్లు ఇషాన్‌ను ఆదేశించినట్లు సమాచారం. కానీ కిషన్ మాత్రం తన ఇంకా సిద్దంగా లేనని, మరి కొంత సమయం తనకు కావాలని సెలక్టర్లకు చెప్పినట్లు ప్రముఖ క్రీడా వెబ్సైట్ పేర్కొంది. అతడు నో చెప్పడంతోనే ధ్రువ్ జురెల్‌ను మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొనసాగించినట్లు వినికిడి. అయితే బీసీసీఐ నో చెప్పిన కిషన్.. ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం మాత్రం బరోడాకు వెళ్లినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కిషన్.. మానసికంగా అలిసిపోయానని సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన విషయం విధితమే, చదవండి: IPL 2024: సన్ రైజర్స్ సంచలన నిర్ణయం.. మార్క్రమ్కు బిగ్ షాక్! కొత్త కెప్టెన్ అతడే? -
శ్రేయస్ అయ్యర్‌పై అగార్కర్ సీరియస్!?
టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. అందుకు కారణం వారిద్దరిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల నుంచి తప్పించడమే. 2024-25 ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో శ్రేయస్, ఇషాన్ పేర్లు లేవు. దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కిషన్.. మానసిక సమస్యల కారణం చెప్పి ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌కు వచ్చిన కిషన్.. హార్దిక్ పాండ్యాతో కలిసి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం కిషాన్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే రంజీల్లో ఆడాల్సిందే అని సృష్టం చేశాడు. కానీ బోర్డు, ద్రవిడ్ మాటలను కిషన్ పెడచెవిన పెట్టాడు. మరోవైపు అయ్యర్‌ది కూడా ఇదే తీరు. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు అయ్యర్‌ను ఫామ్ లేమి కారణంగా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో రంజీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ శ్రేయస్‌ను కోరింది. కానీ అయ్యర్ మాత్రం వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని చెప్పేశాడు. అయితే అంతకముందు రోజే అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని ఏన్సీఏ సర్టిఫికేట్‌ను మంజారు చేసింది. దీంతో అయ్యర్ కావాలానే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. బీసీసీఐ కూడా ఇదే విషయంపై సీరియస్ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయడానికి మరో కారణం కూడా ఉందంట. వెన్ను నొప్పి సాకు చెప్పి అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రీ ఐపీఎల్ ట్రైనింగ్‌లో పాల్గొనున్నట్లు సమచారం. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ అయ్యర్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ బీసీసీఐకి సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అయ్యర్ ప్రస్తుతం తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు. చదవండి: IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్! -
'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్‌లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు. అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్‌ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?
శ్రేయస్ అయ్యర్.. గత కొంత కాలంగా టీమిండియా మిడిలార్డర్లో నిలకడకు పెట్టింది పేరు. మూడు ఫార్మాట్లలో మిడిలార్డర్లో విరాట్ కోహ్లి తర్వాత అంతటి సత్తా ఉన్న ఆటగాడిగా అయ్యర్ పేరొందాడు. వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో అయ్యర్ ది కీలక పాత్ర. వరల్డ్‌కప్ హిస్టరీలోనే సింగిల్ ఎడిషన్‌లో 500పైగా పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడు అయ్యరే. 2022 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా ఈ ముంబైకర్ కొనసాగుతున్నాడు. అటువంటి అయ్యర్ ఇప్పుడు ఏకంగా ఎందుకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది? భారత క్రికెట్ బోర్డు సరైన నిర్ణయం తీసుకుందా? అన్న ప్రశ్నలు సగటు అభిమానిలో రేకెత్తుతున్నాయి. అదేనా అయ్యర్ చేసిన తప్పు? స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్ భాగమయ్యాడు. అయితే తొలి రెండు టెస్టుల్లోనూ ఈ ముంబైకర్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. అనంతరం ఆఖరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అనూహ్యంగా శ్రేయస్‌కు చోటు దక్కలేదు. అయితే అతడి వెన్ను గాయం తిరగబెట్టిందని అందుకే సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. అయ్యర్ కూడా వైజాగ్ టెస్టు అనంతరం నేరుగా బెంగళూరులోని ఏన్సీఏకు వెళ్లిపోయాడు. కానీ ఫామ్ లేమి కారణంగానే అయ్యర్‌ను పక్కన పెట్టారని తర్వాత బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ టీండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్స్‌లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు. అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్ ఫిట్నెస్గా ఉన్నట్లు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్దమైందని పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఈ వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలోనే అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయడం గమనార్హం. బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందా? అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేడ్-బిలో ఉన్న ఆటగాడిని ఒక్కసారిగా తప్పించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడనంత మాత్రానా గతేడాదిగా భారత జట్టుతో ఉంటూ.. ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆటగాడి పట్ల బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అతడికి పన్మిషెంట్ ఇవ్వాలనకుంటే గ్రేడ్-సి డిమోషన్ చేయవలసిందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు తరపున అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్‌ల వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మరి కొంత మంది అయ్యర్ 100 శాతం ఫిట్నెస్గా లేడని అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా అయ్యర్‌తో పాటు మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం..!? -
తెలుగమ్మాయిలకు జాక్ పాట్...బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు
-
బంపర్ ఆఫర్ కొట్టిన సంజూ శాంసన్
టీమిండియాలో సమీకరణలు, ఇతరత్రా కారణాల చేత సరైన అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయిన టాలెంటెడ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఎట్టకేలకు ఓ విషయంలో న్యాయం చేసింది. జట్టుకు ఎంపికైనా రకరకాల కారణాల చేత తుది జట్టులో అడే అవకాశాలను కోల్పోతున్న సంజూకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి తగిన గుర్తింపునిచ్చింది. సంజూకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. గ్రేడ్ సి కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో చోటు కల్పించింది. ఈ ఒప్పందం మేరకు సంజూకు రూ. కోటి వార్షిక వేతనం లభించనుంది. సంజూతో పాటు దీపక్ హుడా, కేఎస్ భరత్, అర్షదీప్ సింగ్‌లకు బీసీసీఐ తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వీరిని కూడా బీసీసీఐ గ్రేడ్ సి కేటగిరిలో చేర్చింది. వీరికి కూడా ఏటా కోటి రూపాయల వేతనం లభించనుంది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో చాలా మార్పులు చేసిన బీసీసీఐ.. ఏ గ్రేడ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను ఏ ప్లస్ (7 కోట్లు) గ్రేడ్‌కు ప్రమోట్ చేయగా.. వరుస వైఫల్యాల బాట పట్టిన కేఎల్ రాహుల్‌ను ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌కు డిమోట్ చేసింది. ఇటీవల ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్‌ను బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోట్ చేసిన బీసీసీఐ.. వెటరన్ ఆటగాళ్లు ఆజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లను పూర్తిగా కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించింది. ఆశ్చర్యకరంగా ఏ ఫార్మాట్లో కూడా అవకాశాలు దక్కని మరో వెటరన్ ప్లేయర్ శిఖర్ ధవన్ బీసీసీఐతో సి గ్రేడ్ కాంట్రక్ట్‌ను నిలబెట్టుకున్నాడు. కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్. -
హార్ధిక్, గబ్బర్లకు భారీ షాక్.. రహానే, పుజారాలకు డిమోషన్
BCCI Contracts: 2021-22 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు చుక్కెదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌ను నిలబెట్టుకోగా.. టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మలు తమ ‘ఎ’ గ్రేడ్‌ను కోల్పోయి ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గాయాల కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డేలు మాత్రమే పరిమితమైన శిఖర్ ధవన్లు ఏకంగా ‘ఎ’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు దిగజారగా.. మయాంక్ అగర్వాల్, సాహాలు ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు పడిపోయారు. ఇప్పటివరకు ‘సి’ గ్రేడ్‌లో ఉన్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ‘బి’ గ్రేడ్ దక్కగా.. కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు ఏకంగా కాంట్రక్ట్నే కోల్పోయారు. బీసీసీఐ ఈ ఏడాదికి గాను 27 మందితో సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకోగా.. రోహిత్, కోహ్లి, బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌లో.. అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీలు ‘ఎ’ గ్రేడ్‌లో.. పుజారా, రహానే, అక్షర్, శార్ధూల్, శ్రేయస్, సిరాజ్, ఇషాంత్‌లు ‘బి’ గ్రేడ్‌లో.. ధవన్, ఉమేశ్, భువనేశ్వర్, హార్ధిక్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, విహారి, చహల్, సూర్యకుమార్ యాదవ్, సాహా, మయాంక్‌లు ‘సి’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో 'ఎ ప్లస్' కేటగిరీలో ఉన్నవాళ్లకు ఏటా రూ.7 కోట్లు, ‘ఎ’ కేటగిరీ ప్లేయర్లకు రూ.5 కోట్లు, ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, ‘సి’ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు రూ.1కోటి పారితోషికంగా లభించనుంది. చదవండి: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు -
సిరాజ్‌కు ప్రమోషన్.. ఇకపై ఎంత జీతం అంటే!
ముంబై: భారత స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా బీసీసీఐ కొత్తగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో కూడా ‘ఎ’ ప్లస్’ గ్రేడ్‌లోనే కొనసాగనున్నారు. వీరికి బోర్డు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న టెస్టు స్పెషలిస్ట్‌లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మల స్థాయి తగ్గిస్తూ బోర్డు ‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు)లోకి మార్చింది. ఈ ముగ్గురు టెస్టు జట్టులో స్థానం కోల్పోయారు. గాయాలతో వరుసగా మ్యాచ్‌లకు దూరమవుతున్న హార్దిక్ పాండ్యా, వన్డేలకే పరిమితమైన శిఖర్ ధావన్‌లను కూడా ‘ఎ’ నుంచి తప్పించి ‘సి’లో (రూ. 1 కోటి) పడేశారు. దాంతో ‘ఎ’ గ్రేడ్‌లో (రూ. 5 కోట్లు) ఐదుగురు ఆటగాళ్లు అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీ మాతమ్రే మిగిలారు. మయాంక్, సాహాలను కూడా ‘బి’ నుంచి ‘సి’కి మార్చారు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడంతో పాటు పరిమిత ఓవర్ల జట్లలో కూడా చోటు దక్కించుకున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్ లభించింది. ఇప్పటి వరకు ‘సి’లో ఉన్న అతడిని గ్రేడ్ ‘బి’లోకి తీసుకున్నారు. హనుమ విహారి ‘సి’లోనే కొనసాగనున్నాడు. 27 మందితో రూపొందించిన ఈ కాంట్రాక్ట్ జాబితానుంచి కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలను పూర్తిగా తప్పించారు. మరోవైపు మహిళా క్రికెటర్లలో హర్మన్, స్మృతి, పూనమ్ యాదవ్ ఉన్న గ్రూప్ ‘ఎ’ (రూ.50 లక్షలు)లోకి దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లను తీసుకొని ప్రమోషన్ ఇచ్చారు. జెమీమా ‘బి’ నుంచి ‘సి’ (రూ. 10 లక్షలు)లోకి పడిపోయింది. మిథాలీ, జులన్ గ్రూప్ ‘బి’ (రూ. 30 లక్షలు)లో కొనసాగనున్నారు. చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే.. -
ఆటగాళ్లు నేరుగా మీడియాతో మాట్లాడకూడదు.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!
టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్దిమాన్ సాహా- జర్నలిస్ట్ మధ్య వివాదంతో మేల్కొన్న బీసీసీఐ.. టీమిండియా కాంట్రాక్ట్ ఆటగాళ్లు మీడియాతో నేరుగా సంప్రదింపులు జరిపే అంశానికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో లంకతో ప్రారంభంకానున్న సిరీస్ నుంచే కొత్త గైడ్‌లైన్స్‌ను ఆచరణలోకి తీసుకురావాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. బీసీసీఐ ప్రతిపాదిస్తున్న కొత్త మీడియా గైడ్ లైన్స్: బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లతో మీడియా నేరుగా మాట్లాడకూడదు. బీసీసీఐ మీడియా మేనేజర్ ద్వారానే ఆటగాళ్లు-మీడియా మధ్య సమాచారం బదిలీ జరగాలి. పబ్లిక్ ఫంక్షన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఆటగాళ్లు మీడియాతో మాట్లాడే వెసులుబాటు యధాతథంగా కొనసాగనుంది. బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే ఆటగాడిపై నిషేధం లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. బీసీసీఐ మీడియా మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్ల ఇంటర్వ్యూలు, బైట్స్ తీసుకునే జర్నలిస్టులను ఏడాది పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. అండర్-19 క్రికెటర్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. కాగా, ఇంటర్వ్యూ కోసం ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరించినట్లు టీమిండియా సీనియర్ వికెట్‌కీపర్ సాహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూండా ఉండేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మీడియాకు కొత్త గైడ్‌లైన్స్ విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చదవండి: Wriddhiman Saha: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ! -
‘సారీ బ్రదర్.. ఆ విషయంపై మాట్లాడను’
టీమిండియా సీనియర్ క్రికెటర్, జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఎంఎస్ ధోనికి వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో బీసీసీఐ అవకాశం కల్పించని విషయం తెలిసిందే. దీంతో ధోని కెరీర్ ముగిసిందని ఓ వర్గం సింపుల్‌గా పేర్కొంటుండగా.. మరో వర్గం మాత్రం బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తోంది. మూడు ఐసీసీ టోర్నీలను అందించిన ఓ దిగ్గజ సారథికి ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాలని పలువురు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఓ సమావేశానికి హాజరైన దాదాను ధోని విషయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ విషయంపై సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు. చివరికి ఈ అంశంపై తాను మాట్లాడను అంటూ స్పష్టం చేశాడు. దీంతో ధోనిని సాగనంపడానికి బ్యాకెండ్‌లో బాగానే వర్క్ జరిగనట్టుందని క్రీడా విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్లో ధోని ప్రదర్శన ఆధారంగానే టీమిండియా తరుపున ఆడతాడా లేదా అనే తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఇక టీమిండియాలోకి రావడానికి ధోనికి ఐపీఎల్ ఓ సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను హర్భజన్ కొట్టిపారేశాడు. ఐపీఎల్లో ధోని అద్భుతంగా ఆడటం పక్కా అని ఎందుకంటే తాను ఆగే ప్రతీ మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయాలనుకుంటాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. అయితే ఐపీఎల్లో ఆడినంత మాత్రాన టీమిండియాలో చోటు దక్కుతుందనే నమ్మకం లేదన్నాడు. చదవండి: ధోని చివరి మ్యాచ్ ఆడేశాడా? ‘నో’ కాంట్రాక్ట్ ‘లో’ కాంట్రాక్ట్ -
ధోని చివరి మ్యాచ్ ఆడేశాడా?
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి.. బెస్ట్ ఫినిషర్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.. మైదానంలో లైట్ కంటే వేగంగా కదులుతూ ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పిన యోధుడు.. ఎంతో మంది యువ క్రికెటర్ల మార్గం చూపిన మార్గదర్శకుడు.. కూల్‌గా ఉంటూ వ్యూహాలు రచించడంలో క్రికెట్లో అపర చాణక్యుడు.. టీమిండియా భవిష్యత్‌లో ప్రస్తుత లంక పరిస్థితి రాకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అపర మేధావి.. అతడే జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోని. సీన్ కట్ చేస్తే టీమిండియా క్రికెట్లో మకుంటం లేని మహారాజుగా ఎదిగిన ధోనికి తాజాగా ప్రకటించిన బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ధోని శకం ముగిసినట్టేనని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ అనంతరం నుంచి ధోని మళ్లీ మైదానంలో దిగలేదు. అలా అని రిటైర్మెంట్ ప్రకటించలేదు. దీంతో ధోని భవిష్యత్‌పై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే పొమ్మనలేక పొగపెట్టినట్లు కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించి ధోనిని సాగనంపేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుందని ముక్తకంఠంతో అందరూ పేర్కొంటున్నారు. అయితే ఇదే అభిప్రాయాన్ని క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తం చేశాడు. ‘బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితా చూశాక ధోని చివరి మ్యాచ్ ఆడేశాడా అనే అనుమానం కలిగింది. ప్రపంచకప్ తర్వాత ధోని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. టీమిండియా తరుపున ఆడలేదు. అంతేకాకుండా టీమిండియా సెలక్షన్స్‌కు అందుబాటులో లేడు. ఇక ఐపీఎల్లో ధోని నుంచి మనం అద్భుతమైన ఆటను తప్పకుండా చూస్తాం. ఎందుకంటే అతడు అడే ప్రతీ మ్యాచ్‌లో ఆటగాడిగా వంద శాతం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. అయితే ఐపీఎల్లో ధోని అద్భుతంగా ఆడినా అతడు టీమిండియా తరుపున ఆడతాడనే నమ్మకం లేదు. నాకు తెలిసి వన్డే ప్రపంచకప్ అతడి చివరి టోర్నీ. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచే బహుశా అతడి చివరి మ్యాచ్’ అంటూ హర్భజన్ పేర్కొన్నాడు. ఇక తన కెరీర్ గురించి కూడా హర్భజన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా కెరీర్ 2000లోనే ముగియాలి. కానీ సౌరవ్ గంగూలీ ఇచ్చిన ధైర్యం, సపోర్ట్‌తోనే నేను టీమిండియాకు సుదీర్ఘంగా సేవలందించగలిగాను. నా మీద నాకంటే గంగూలీకే ఎక్కువ నమ్మకం ఉండేది. అందుకే ప్రోత్సహించాడు. లేకుంటే నా స్నేహితుల మాదిరి విదేశాల్లో స్థిరపడిపోయేవాడిని. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌తో తన తలరాత మారిపోయింది’ అని హర్భజన్ వివరించాడు. -
అందుకే ఏ ప్లస్ దక్కిందేమో: శిఖర్ ధావన్
సాక్షి, స్పోర్ట్స్: ‘స్వదేశంలో పులి.. విదేశాల్లో పిల్లి..’ ఇలాంటి అపవాదును మూటగట్టుకున్న భారత స్టార్ ఆటగాళ్లలో శిఖర్ ధావన్ కూడా ఒకరు. కానీ ఇది ఒకప్పటి మాట. మొన్నటి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ధావన్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనే తనకు బాగా కలిసొచ్చిందని చెబుతున్నాడు. ఇటీవల బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో తనను ఏ ప్లస్ జాబితాలో చేర్చడంపై ధావన్ తొలిసారి స్పందించాడు. ‘‘విదేశీ పిచ్‌లపై పరుగులు చేయడంలో నేను కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అయితే అదంతా గతం. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 లో చక్కటి ప్రదర్శన ఇచ్చాను. ఎలాగైనా సరే రాణించాలన్న పట్టుదలే నన్నునడిపించింది. బహుశా ఆ సిరీస్ వల్లే నాకు ఏ ప్లస్ కాంట్రాక్టు దక్కిఉంటుంది. ఏదేమైనా అలా జరగడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. త్వరలో జరుగనున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ రాణిస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు పటిష్టంగా ఉంది. సీనియర్లు, జూనియర్లతో టీమ్ సమతుల్యంగా ఉంది’’ అని చెప్పాడు ఈ డాషింగ్ ఓపెనర్. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్లో ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్న సంగతి విదితమే. -
భారత క్రికెట్లో 'డబుల్ ధమాకా'
► ఆటగాళ్ల వార్షిక ఫీజులు రెట్టింపు ► పుజారా, విజయ్, జడేజాలకు ప్రమోషన్ ►సురేశ్ రైనాకు దక్కని చోటు ►బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌ల ప్రకటన న్యూఢిల్లీ: భారత టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లలో ప్రమోషన్ లభించింది. గతంలో గ్రేడ్ ‘బి’లో ఉన్న పుజారాతో పాటు మురళీ విజయ్‌ని కూడా గ్రేడ్ ‘ఎ’లోకి చేరుస్తూ బోర్డు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. వరల్డ్ నంబర్‌వన్ బౌలర్‌గా ఎదిగిన రవీంద్ర జడేజా కూడా ‘సి’ గ్రేడ్ నుంచి నేరుగా ‘ఎ’కు ప్రమోట్ కావడం విశేషం. ఈ అగ్రశ్రేణి జాబితాలో ఇప్పటి వరకు ధోని, కోహ్లి, అశ్విన్, రహానే మాత్రమే ఉండగా ఇప్పుడు పుజారా, విజయ్, జడేజా చేరికతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం ఇందులో ఉన్నవారికి ఏడాదికి రూ. 2 కోట్లు వార్షిక ఫీజుగా లభిస్తాయి. గతంలో ఈ జాబితాలో ఉన్నవారికి రూ. కోటి దక్కేవి. గ్రేడ్ ‘బి’లో 9 మంది ఆటగాళ్లు, గ్రేడ్ ‘సి’లో 16 మంది ఆటగాళ్లు ఉన్నారు. ‘బి’, ‘సి’ గ్రేడ్ల మొత్తాలను కూడా గత ఏడాదికంటే రెట్టింపు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగినప్పుడు లభించే మ్యాచ్ ఫీజుకు ఈ కాంట్రాక్ట్ మొత్తం అదనం. అక్టోబర్ 1, 2016 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. అయితే గత ఏడాది కాంట్రాక్ట్‌లు ప్రకటించిన సమయంలో భారత మహిళా జట్టు క్రీడాకారిణులను పరిగణనలోకి తీసుకుంటూ రెండు గ్రేడ్లుగా విభజించారు. ఈసారి వారి గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఆటగాళ్ల విజ్ఞప్తితో... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్రికెటర్ల కాంట్రాక్ట్ మొత్తం కూడా పెంచాలంటూ గత అక్టోబర్‌లో విజ్ఞప్తులు వచ్చాయి. కెప్టెన్ కోహ్లి అప్పటి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో కేవలం టెస్టులకు ప్రాధాన్యత పెంచేందుకు టెస్టు మ్యాచ్ ఫీజును రెట్టింపు చేసేందుకు మాత్రం ఠాకూర్ అంగీకరించారు. ఇతర అంశాలపై ఇంకా స్పష్టత రాకుండానే ఠాకూర్ నిష్క్రమించారు. ఇటీవలే బెంగళూరు టెస్టు తర్వాత కూడా కోహ్లి ఇదే అంశాన్ని ప్రత్యేకంగా సీఓఏ దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్‌లతో చర్చించిన అనంతరం సీఓఏ బృందం కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. రైనాకు నిరాశ... బీసీసీఐ 32 మందితో ప్రకటించిన జాబితాలో సురేశ్ రైనాకు చోటు దక్కకపోవడమే అనూహ్యం. గత ఏడాది అతను గ్రేడ్ ‘బి’లో ఉన్నాడు. వన్డే జట్టులో స్థానం లేకపోయినా... భారత టి20 జట్టు సభ్యుడిగా ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌లన్నీ కూడా తాజా ఒప్పందాలు అమలు చేయబోతున్న తేదీ తర్వాత ఆడినవే. రైనాకు దిగువ గ్రేడ్‌కు కూడా పంపించకుండా పూర్తిగా కాంట్రాక్ట్ నుంచే తప్పించడం ఆశ్చర్యకర పరిణామం. ఇక అంబటి తిరుపతి రాయుడు, శిఖర్ ధావన్ గ్రేడ్ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయారు. గత ఏడాది జాబితాలో లేని యువరాజ్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ సారి గ్రేడ్ ‘బి’లో స్థానం లభించింది. భారత్ తరఫున 3 టి20లు ఆడిన మన్దీప్ సింగ్, ఒకే ఒక టి20 ఆడిన రిషభ్ పంత్‌లకు తొలిసారి చోటు దక్కగా... భారత్ తరఫున ఇంకా అరంగేట్రం చేయని శార్దుల్ ఠాకూర్‌కు కాంట్రాక్ట్ దక్కడం మరో విశేషం. టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా రెట్టింపయ్యాయి. ఇకపై ఒక టెస్టు మ్యాచ్ ఆడితే ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు లభిస్తాయి. టెస్టుల్లో రిజర్వ్ ఆటగాడికి రూ. 7 లక్షలు దక్కుతాయి. ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు, ఒక్కో టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందజేస్తారు. కొత్త కాంట్రాక్ట్‌ల జాబితా గ్రేడ్ ‘ఎ’ (రూ. 2 కోట్లు): విరాట్ కోహ్లి, ధోని, అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా. గ్రేడ్ ‘బి’ (రూ. 1 కోటి): రోహిత్ శర్మ, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్ (ప్రమోషన్), వృద్ధిమాన్ సాహా (ప్రమోషన్). గ్రేడ్ ‘సి’ (రూ. 50 లక్షలు): శిఖర్ ధావన్ (దిగువకు), అంబటి తిరుపతి రాయుడు (దిగువకు), అమిత్ మిశ్రా, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్దీప్ సింగ్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, రిషభ్ పంత్ (వీరిలో మిశ్రా, అక్షర్, ధావల్ గత ఏడాది కూడా ‘సి’లోనే ఉండగా మిగతా 11 మందికి తొలిసారి కాంట్రాక్ట్ లభించింది) స్థానం కోల్పోయినవారు: సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, వరుణ్ ఆరోన్, కరణ్ శర్మ, శ్రీనాథ్ అరవింద్.