
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఈసారి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వినికిడి.
అదేవిధంగా ఏ కేటగిరీలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను A+ కేటగిరీకి బీసీసీఐ ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20లకు విడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే A+ కేటగిరీలో కొనసాగాలంటే మూడు ఫార్మాట్‌లో ఆడాల్సిందే.
రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రుతురాజ్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడికి వచ్చిన అవకాశాలను కూడా గైక్వాడ్ సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. గతేడాది అతడు భారత్ తరపున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు.
చివరగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున రుతురాజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా గైక్వాడ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు భారత్ తరపున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. కాగా గైక్వాడ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?
ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.