రుతురాజ్ గైక్వాడ్‌కు బంప‌రాఫ‌ర్‌.. టీమిండియా ఓపెన‌ర్‌గా!? | Ruturaj Gaikwad, Snubbed For Bangladesh T20Is, Set For Australia Test Call Up | Sakshi
Sakshi News home page

AUS vs IND: రుతురాజ్ గైక్వాడ్‌కు బంప‌రాఫ‌ర్‌.. టీమిండియా ఓపెన‌ర్‌గా!?

Published Wed, Oct 2 2024 11:19 AM | Last Updated on Wed, Oct 2 2024 12:55 PM

Ruturaj Gaikwad, Snubbed For Bangladesh T20Is, Set For Australia Test Call Up

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు ద‌క్క‌క‌పోయిన సంగ‌తి తెలిసిందే. రెగ్యూల‌ర్ ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌, య‌శ‌స్వీ జైశ్వాల్‌కు విశ్రాంతి ఇచ్చిన‌ప్ప‌ట‌కి రుతురాజ్ వైపు మాత్రం సెల‌క్ట‌ర్లు మొగ్గు చూప‌లేదు.

దీంటో టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న‌ప్ప‌ట‌కి రుతుకు జ‌ట్టులో చోటు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్‌కు గైక్వాడ్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌క‌పోవ‌డం వెన‌క ఓ మాస్ట‌ర్ ప్లాన్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఆసీస్ టూర్‌కు రుతురాజ్‌..
రుతురాజ్ గైక్వాడ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. ఆసీస్ టెస్టు సిరీస్‌కు రుతురాజ్‌ను టీమిండియా బ్యాక‌ప్ ఓపెన‌ర్‌గా ఎంపిక చేయాల‌ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ భావిస్తోంది.  ఈ నేప‌థ్యంలోనే అత‌డిని బంగ్లాతో టీ20ల‌కు ఎంపిక  చేయ‌కుండా, ఇరానీ క‌ప్‌లో ఆడేందుకు సెల‌క్ట‌ర్లు అవకాశ‌మిచ్చిన‌ట్లు ఓ రిపోర్ట్ పేర్కొంటుంది.

ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు గైక్వాడ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఆసీస్ సిరీస్‌కు ముందు అత‌డిని వీలైన‌న్ని ఎక్కువ రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడ‌నమ‌ని సెల‌క్ట‌ర్లు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో మూడో ఓపెన‌ర్ కోసం ఎక్కువ మంది ఆట‌గాళ్లు లేరు. ఒక‌వేళ రోహిత్‌, జైశ్వాల్ గాయ‌ప‌డితో వారికి బ్యాక‌ప్‌గా రుతురాజ్ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాకు వెళ్ల‌నుంది.
చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement