స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.
టీమిండియా తరపున అవకాశం వచ్చినప్పుడల్లా ఆకట్టుకున్న రుతురాజ్‌కు చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అతడి అభిమానులు భారత సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు అంటూ తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు.
రుతురాజ్ గైక్వాడ్ టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. జింబాబ్వే పర్యటనలో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏ స్ధానంలో నైనా బ్యాటింగ్ చేస్తే సత్తా రుతుకు ఉంది. అటువంటి ఆటగాడి ఎందుకు పక్కన పెడుతున్నారు. నిజంగా సిగ్గు చేటు అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
భీకర ఫామ్‌లో రుతు..
రుతురాజ్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరపున కూడా తాను ఏంటో నిరూపించుకున్నాడు. భారత్ తరఫున 23 టీ20లు ఆడిన రుతురాజ్ 39.56 యావరేజ్ 633 రన్స్ చేశాడు. అటువైపు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ రుతురాజ్ తన ప్రదర్శనలతో అకట్టుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా గైక్వాడ్ దమ్ములేపాడు.
ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే తరపున 14 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ ఏకంగా 583 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ సత్తాచాటాడు. ఆ తర్వాత అతడికి వరుసగా శ్రీలంక, బంగ్లాతో సిరీస్‌లకు సెలక్టర్లు చోటు ఇవ్వలేదు. బంగ్లాతో టీ20లకు ఓపెర్లు జైశ్వాల్, గిల్‌కు విశ్రాంతి ఇచ్చినప్పటికి.. రుతురాజ్ వైపు మాత్రం సెలక్టర్లు మొగ్గు చూపలేదు. ఇక ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
బంగ్లాతో టీ20లకు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా .
Comments
Please login to add a commentAdd a comment