టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. అందుకు కారణం వారిద్దరిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల నుంచి తప్పించడమే. 2024-25 ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో శ్రేయస్, ఇషాన్ పేర్లు లేవు. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది.
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కిషన్.. మానసిక సమస్యల కారణం చెప్పి ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌కు వచ్చిన కిషన్.. హార్దిక్ పాండ్యాతో కలిసి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సిద్దమయ్యాడు.
ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం కిషాన్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే రంజీల్లో ఆడాల్సిందే అని సృష్టం చేశాడు. కానీ బోర్డు, ద్రవిడ్ మాటలను కిషన్ పెడచెవిన పెట్టాడు. మరోవైపు అయ్యర్‌ది కూడా ఇదే తీరు. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు అయ్యర్‌ను ఫామ్ లేమి కారణంగా సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
ఈ క్రమంలో రంజీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ శ్రేయస్‌ను కోరింది. కానీ అయ్యర్ మాత్రం వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని చెప్పేశాడు. అయితే అంతకముందు రోజే అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని ఏన్సీఏ సర్టిఫికేట్‌ను మంజారు చేసింది. దీంతో అయ్యర్ కావాలానే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. బీసీసీఐ కూడా ఇదే విషయంపై సీరియస్ అయినట్లు వార్తలు వినిపించాయి.
అయితే అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయడానికి మరో కారణం కూడా ఉందంట. వెన్ను నొప్పి సాకు చెప్పి అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రీ ఐపీఎల్ ట్రైనింగ్‌లో పాల్గొనున్నట్లు సమచారం. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ అయ్యర్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ బీసీసీఐకి సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అయ్యర్ ప్రస్తుతం తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు.
చదవండి: IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment