
ఐపీఎల్-2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు అయ్యర్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన శ్రేయస్.. ధర్మశాలలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అదే విధంగా ఈ ఏడాది సీజన్‌లో కెప్టెన్‌గా అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేయస్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. తాజాగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అయ్యర్.. హెడ్ కోచ్ పాంటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పాంటింగ్ తనను అద్బుతమైన ఆటగాడిగా భావిస్తున్నాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
"రికీ(పాంటింగ్) అందరికి చాలా సపోర్ట్‌గా ఉంటాడు. అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. తొలిసారి అతడితో కలిసి పనిచేసినప్పుడే, నేను గొప్ప ఆటగాడిగా ఎదుగుతానని నాతో అన్నాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో నేను బాగా రాణించగలన్న నమ్మకం కలిగించాడు. పాంటింగ్ ప్రతీ ప్లేయర్‌కు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది.
ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం. ఈ ఏడాది సీజన్‌లో మెరుగ్గా రాణించేందకు ప్రయత్నిస్తాము. ఈ సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా భావించి ముందుకు వెళ్తాము. నెట్స్‌లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాము" అని అయ్యర్ పేర్కొన్నాడు. అదేవిధంగా పాంటింగ్ కూడా అయ్యర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు
"శ్రేయస్ మంచి కెప్టెనే కాదు.. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు కూడా. అతడు ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అన్న విషయం మనకు తెలుసు. అతడితో ఇంకా మేము ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే శ్రేయస్ మూడు రోజుల కిందటే క్యాంపులో చేరాడు.
కెప్టెన్‌గా తన పనిని అయ్యర్ ప్రారంభించాడు. మా తొలి మ్యాచ్‌కు అన్ని విధాల సిద్దంగా ఉంటామని" పాంటింగ్ వెల్లడించాడు. కాగా వీరిద్దరూ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కలిసి పనిచేశారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె!
Comments
Please login to add a commentAdd a comment