ఇషాన్‌ కిషన్‌కు బీసీసీఐ బంపరాఫర్‌.. కానీ 'నో' చెప్పేశాడుగా!? | Ishan Kishan declined chance to make India comeback in England Test series: Report | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇషాన్‌ కిషన్‌కు బీసీసీఐ బంపరాఫర్‌.. కానీ 'నో' చెప్పేశాడుగా!?

Published Sat, Mar 2 2024 8:21 PM | Last Updated on Sat, Mar 2 2024 9:19 PM

Ishan Kishan declined chance to make India comeback in England Test series: Reports - Sakshi

ఇషాన్‌ కిషన్‌

భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇదే విషయం భారత క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

రంజీల్లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్‌ నుంచి తప్పించేముందు బీసీసీఐ పెద్దలు వారిద్దరితో మాట్లాడి వుంటే బాగుండేదని పలువరు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు  జట్టును ప్రకటించేముందు ఇషాన్‌ కిషన్‌ను బీసీసీఐ సెలక్టర్లు సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్‌ టెస్టు తర్వాత జట్టుతో కలవాలని సెలక్టర్లు ఇషాన్‌ను ఆదేశించినట్లు సమాచారం. కానీ కిషన్‌ మాత్రం తన ఇంకా సిద్దంగా లేనని, మరి కొంత సమయం తనకు కావాలని సెలక్టర్లకు చెప్పినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ పేర్కొంది.

అతడు నో చెప్పడంతోనే ధ్రువ్‌ జురెల్‌ను మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ కొనసాగించినట్లు వినికిడి. అయితే బీసీసీఐ నో చెప్పిన కిషన్‌.. ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ కోసం మాత్రం బరోడాకు వెళ్లినట్లు కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ​కాగా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కిషన్‌.. మానసికంగా అలిసిపోయానని సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన విషయం విధితమే,
చదవండి: IPL 2024: సన్ రైజర్స్‌ సంచలన నిర్ణయం.. మార్‌క్రమ్‌కు బిగ్‌ షాక్‌! కొత్త కెప్టెన్‌ అతడే?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement