బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్‌లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు.
అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్‌ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు.
"సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు.
అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment