Media representatives
-
మీడియా ప్రతినిధులపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
-
హీరోయిన్ తమన్నా బౌన్సర్ల దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ బ్యూటీ తమన్నా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. కొందరు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా.. మీడియా ప్రతినిధులతో బౌన్సర్లు వాగ్వావాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్మీట్లో ఈ సంఘటన జరిగింది. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: Tamannaah Bubbly Bouncer: కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా..) హీరోయిన తమన్నా టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్'. ఈ సినిమాలో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23న విడుదలవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఇది కామెడీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. -
ఆటగాళ్లు నేరుగా మీడియాతో మాట్లాడకూడదు.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!
టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్దిమాన్ సాహా- జర్నలిస్ట్ మధ్య వివాదంతో మేల్కొన్న బీసీసీఐ.. టీమిండియా కాంట్రాక్ట్ ఆటగాళ్లు మీడియాతో నేరుగా సంప్రదింపులు జరిపే అంశానికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో లంకతో ప్రారంభంకానున్న సిరీస్ నుంచే కొత్త గైడ్‌లైన్స్‌ను ఆచరణలోకి తీసుకురావాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. బీసీసీఐ ప్రతిపాదిస్తున్న కొత్త మీడియా గైడ్ లైన్స్: బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లతో మీడియా నేరుగా మాట్లాడకూడదు. బీసీసీఐ మీడియా మేనేజర్ ద్వారానే ఆటగాళ్లు-మీడియా మధ్య సమాచారం బదిలీ జరగాలి. పబ్లిక్ ఫంక్షన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఆటగాళ్లు మీడియాతో మాట్లాడే వెసులుబాటు యధాతథంగా కొనసాగనుంది. బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే ఆటగాడిపై నిషేధం లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. బీసీసీఐ మీడియా మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్ల ఇంటర్వ్యూలు, బైట్స్ తీసుకునే జర్నలిస్టులను ఏడాది పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. అండర్-19 క్రికెటర్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. కాగా, ఇంటర్వ్యూ కోసం ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరించినట్లు టీమిండియా సీనియర్ వికెట్‌కీపర్ సాహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూండా ఉండేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మీడియాకు కొత్త గైడ్‌లైన్స్ విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చదవండి: Wriddhiman Saha: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ! -
యూట్యూబ్ చానల్ ప్రతినిధుల నిర్వాకం
సాక్షి, భవానీపురం(విజయవాడ): ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్ చానల్స్‌లో పనిచేస్తున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది జర్నలిజం పట్ల నిబద్ధత కలిగి నిజాలను వెలికి తీస్తూ నిజాయతీగా వ్యవహరించే పాత్రికేయులకు తలవంపులుగా మారింది. సేకరించిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు శనివారం భవానీపురం బ్యాంక్ సెంటర్లోని సుధాకర్ మెడికల్ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము వన్ టీవీ న్యూస్ ప్రతినిధులమని, యాడ్ ఇవ్వాలని అడిగారు. తమది చిన్న మెడికల్ షాపని, యాడ్ ఇచ్చే పరిస్థితిలో లేమని, షాప్‌వారు తెలపడంతో తమకు టార్గెట్లు ఉంటాయని, కనీసం రూ.5వేల యాడ్ ఇవ్వాలని వారు అడిగారు. ఇవ్వలేమని, తమకు ఆ అవసరంకూడా లేదని నిర్వాహకులు తేల్చి చెబుతూ ఐడీ కార్డు చూపమని అడిగారు. ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే తన ఐడీ కార్డ్ బయటపెట్టారు. దానిపై మట్టా రవికుమార్, కంట్రిబ్యూటర్, మైలవరం అని ఉంది. రెండవ వ్యక్తి తన ఐడీకార్డు ఆఫీస్‌లో ఉందని చెప్పారు. తమకు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు తెలుసునని, వారితో చెప్పి మీపై ఏదో ఒక కేసు బనాయిస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి సంస్థకు చెందిన లోగో బయటకు తీసి హడావుడి చేశారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరి మెడికల్ షాపు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటంతో వారు నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై భవానీపురం ఇన్చార్జి సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వన్ టీవీ ప్రతినిధి ఐడీ కార్డు, కారు ∙ఇదే యూట్యూబ్ చానల్‌కు చెందిన పి.సురేష్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని గత ఏడాది సెప్టెంబర్ 13న విజయవాడ ఊర్మిళానగర్‌లో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న ఒక దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేసి రూ.1000 వసూలు చేశారు. దీనిపై ఆమె భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిటీ ఎస్ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించిన గుత్తుల ప్రశాంత్ అనే వ్యక్తి కారులో వస్తుండగా ఈ ఏడాది జూన్ 25న భవానీపురం పోలీసులు గొల్లపూడిలో పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను వీ వన్ చానల్ రిపోర్టర్నని ఐడీ కార్డ్ చూపించాడు. కారు నంబర్ ప్లేట్లుకూడా మార్చిన అతన్ని విడిపించేందుకు అప్పట్లో కొందరు పెద్దఎత్తున లాబీయింగ్ చేశారని వినికిడి. -
మీ గ్యాగ్ ఆర్డర్‌ను సవరించండి
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గలేటి మమత రాణి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక.. అమరావతి భూ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు వినాలని మమత రాణి తన అనుబంధ పిటిషన్లో కోర్టును కోరారు. ఆంక్షలతో పౌరుల హక్కులకు భంగం అధికరణ–19 ప్రకారం.. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అత్యంత పవిత్రమైన హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని మమత రాణి తన అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పవిత్ర హక్కులో మీడియా హక్కులు కూడా మిళతమై ఉన్నాయన్నారు. ఈ హక్కులను కాలరాసే విధంగా పూర్తిస్థాయి ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంవల్ల రాజ్యాంగంలోని అధికరణ–19(1) (ఏ) ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రకారం అపరిమితమైనది కాదని.. అధికరణ–19(2) కింద రాజ్యాంగం ఆ హక్కుపై కొన్ని పరిమితులు విధిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ కేసులో పూర్తిస్థాయి నిషిద్ధ ఉత్తర్వులు జారీచేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని.. న్యాయస్థానాలు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును పలు న్యాయస్థానాల తీర్పులు సమర్థించాయని వివరించారు. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా హక్కులు ఎంతో అవసరమని ఆమె తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులవల్ల తన హక్కులు ఎంతో ప్రభావితం అయ్యాయన్నారు. అందువల్ల ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలను వినాలని ఆమె కోర్టును కోరారు. అలాగే, ఈ ఏడాది జనవరి 10న ‘అనురాధా భాసిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మమత రాణి తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. పత్రికా స్వేచ్ఛపై జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఏం చెప్పిందంటే.. ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలి. స్వేచ్ఛాయుత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత పవిత్రమైన హక్కు. ఈ హక్కులను ప్రభుత్వాలతో సహా అందరూ గౌరవించాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ప్రాచుర్యం ఎంతగానో పెరిగింది. పత్రికలను అడ్డుకుంటే సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లే. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇంటర్నెట్ వినియోగం వంటి స్వేచ్ఛలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. రాజ్యాంగంలోని అధికరణ–19 ప్రకారం.. ప్రాథమిక హక్కుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఒకటి. దీని ద్వారా అతి ఎక్కువ మందికి తక్కువ కాలంలో సమాచారాన్ని చేరవేసే సౌలభ్యం ఉంది. దాన్ని మేం కాదనడంలేదు. వివిధ సాకులు, కారణాలు చూపి, ఆ సౌలభ్యాన్ని కాలరాయడానికి వీల్లేదు. పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వాలు కాపాడాలి. జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. -
రియాను దారుణంగా వేధిస్తున్నారు..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తికి సంబంధించి మీడియాలో రోజు ఏదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నటి స్వరా భాస్కర్ రియాకు మద్దతుగా నిలిచారు. మీడియా మంత్రగత్తెను వేటాడే విధంగా రియాను వేధిస్తుందని విమర్శించారు. ఉగ్రవాది కసబ్ విషయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్వరా ట్వీట్ చేశారు. ‘కసబ్ విషయంలో కూడా మీడియా ఇలా ప్రవర్తించలేదు. కానీ రియా చక్రవర్తి విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తిస్తోంది. ఆమెకు సంబంధించిన విషపూరిత కథనాలతో ప్రజలను రెచ్చగొడుతుంది. భారతీయ మీడియాతో పాటు ఇలాంటి విషపూరిత కథనాలను ప్రొత్సాహిస్తున్నందుకు మనం కూడా సిగ్గు పడాలి’ అంటూ స్వరా ట్వీట్ చేశారు. (చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’) I don’t think even #Kasab was subjected to the kind of witch-hunt on media.. & media trial that #RheaChakrobarty is being subjected to! Shame on Indian Media.. Shame on us for being a toxic voyueristic public consuming this poisonous hysteria.. #RheaDrugChat #SushantSinghRajput — Swara Bhasker (@ReallySwara) August 26, 2020 నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి తన కుమారిడికి విషం ఇచ్చి చంపేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి సీబీఐ సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్ధ్ పితానీని ప్రశ్నించింది. -
నేను చెప్పేవాటిని ప్రజలు అధ్యయనం చేయాలి
సాక్షి, అమరావతి: తాను చెప్పే విషయాలను ప్రజలు అధ్యయనం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. కరోనా వైరస్ వల్ల ప్రజల ముందుకు రాలేకపోతున్నానని తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. ► అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఏ జిల్లాకు ఏంచేశారో చెప్పాలి. మేం ఐదేళ్లలో 13 జిల్లాలను అభివృద్ధి చేశాం. రెండంకెల వృద్ధిని సాధించాం. ► రాయలసీమ అభివృద్ధికి మేం ముచ్చుమర్రి ప్రాజెక్టును మొదలు పెడితే దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో లేనిపోని గొడవలు పెట్టి ఏం సాధించారు? ► అమరావతిలో రూ.10 వేల కోట్లతో 139 భవనాలు కట్టాం. వాటిని వినియోగించకుండా వదిలేశారు. ► కరోనాపై జాగ్రత్తలు చెబితే నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు వైరస్ వ్యాప్తిలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఏపీ ఉండే పరిస్థితి వచ్చింది. కరోనాను నియంత్రించలేక చేతులెత్తేశారు. ► విజయవాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు? కరోనాపై నేను చెప్పినట్లు చేస్తే ఇంతమంది చనిపోయేవారు కాదు. ► సమైక్యరాష్ట్రంలో విజన్–2020తో ముందుకెళ్లి అభివృద్ధి చేశాను. రాష్ట్ర విభజన తర్వాత విజన్–2029ని తయారు చేశాం. అలాంటి నంబర్‌వన్ రాష్ట్రాన్ని నంబర్ లాస్ట్ రాష్ట్రంగా మార్చారు. ► అధికార వికేంద్రీకరణ అభివృద్ధికి దోహదం చేయదు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. ► కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే విశాఖపట్నం వెళ్లిపోతానని మాట్లాడతారా. అది తప్పుడు నిర్ణయం. కోర్టులో కేసులు ఉన్నాయి. అయినా లెక్కలేదు. ► సంక్షేమం కంటే పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. -
విలేకరులకు కరోనా టెస్టులు చేయండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మీడియా ప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబాలను ఆ దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ కోరారు. మీడియా రిపోర్టర్ మనోజ్ మృతి తీవ్రంగా కలచి వేసిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో నూ కరోనాపై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసే మీడియా ప్రతినిధులు కూడా కోవిడ్ వారియర్లేనని, వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్య లు చేపట్టాలన్నారు. నిన్న డాక్టర్లు, నేడు రిపోర్టర్లకు కరోనా సోకిందని, రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కరోనా కట్టడిపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఈనెల 9న తలపెట్టిన బీజే పీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరె న్స్ సమావేశం వాయిదా పడిందని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. -
కరోనా యోధులకు సైన్యం సలాం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యుద్ధ విమానాలను గాల్లోకి పంపడంతోపాటు (ఫ్లై– పాస్ట్స్) ఆసుపత్రులపై పూల జల్లు కురిపిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్(సీడీఎస్) బిపిన్ రావత్ చెప్పారు. ఆయన శుక్రవారం త్రివిధ దళాల అధిపతులు ఎం.ఎం.నరవణే, కరంబీర్‌సింగ్, ఆర్.కె.ఎస్.బదౌరియాతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే ఆయన తొలి మీడియా సమావేశం. కరోనాపై పోరాటం విషయంలో దేశమంతా ఒక్కటై నిలిచిందని జనరల్ రావత్ అన్నారు. మహమ్మారి బారినుంచి మనల్ని కాపాడేందుకు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు త్రివిధ దళాలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలపనున్నాయని చెప్పారు. అవి...మే 3వ తేదీన సాయంత్రం భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఫిక్స్డ్ వింగ్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలు ఫ్లై–పాస్ట్స్‌లో పాల్గొంటాయి. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు.. దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు ఇవి గాల్లో ఎగురుతాయి. నావికా దళం హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూలు చల్లుతాయి. యుద్ధనౌకలు ప్రత్యేక డ్రిల్లు నిర్వహిస్తాయి. సముద్ర తీరంలో యుద్ధ నౌకలను విద్యుత్ వెలుగులతో నింపేస్తారు. ప్రతి జిల్లాలో కొన్ని హాస్పిటళ్లలో సైన్యం ఆధ్వర్యంలో మౌంటెయిన్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది. (చదవండి: మేడే రోజు శ్రామిక్ రైళ్లు) -
మీడియా మిత్రులకు కేజ్రీవాల్ ‘గుడ్‌న్యూస్’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విస్తరిస్తున్న వేళ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ బుధవారం ఓ సానుకూల విషయం చెప్పారు. 529 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ట్విటర్లో తెలిపారు. వారంతా త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాక్షించారు. మీడియా ప్రతినిధుల పని ప్రాధాన్యం కలిగినదని, ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు చాలా అవసరమని కొనియాడారు. కాగా, కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం గతవారం మీడియా ప్రతినిధులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఇక మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియాలో పనిచేసే మీడియా ప్రతినిధులకు కోవిడ్ పరీక్షలు చేయాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. Am so happy to share only 3 out of 529 media persons tested have been detected positive. My best wishes to all of you. Your work is very important esp during a pandemic. Those who have been detected positive, I am praying for your speedy recovery — Arvind Kejriwal (@ArvindKejriwal) April 29, 2020 (చదవండి: కేంద్రం నిర్ణయం సరైనది కాదు : కేజ్రీవాల్) -
‘కరోనా’పై మీడియాకు మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 (కరోనా వైరస్)కు సంబంధించి వార్తా కథనాలపై పత్రికలు, టీవీ చానళ్ల అధిపతులు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, రిపోర్టర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. - రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్ విడుదల చేస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణనలోకి తీసుకోవాలి. - కరోనా వైరస్ కేసులు, వైరస్ వల్ల మరణాల విషయంలో అ«ధీకృత సమాచారం లేకుండా ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్‌తో మరణం అంటూ పలు వార్తా సంస్థలు, చానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. - అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. కరోన వైరస్ సోకి పాజిటివ్‌గా వచ్చిన కేసుల విషయంలో బాధితుల పేర్లు, చిరునామాలు ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. - వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయరాదు, ప్రచురించరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వెబ్సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెబ్సైట్లను పరిశీలించడం ద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని పొందవచ్చు. - మూఢ నమ్మకాలను వ్యాప్తి చేసేలా సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. ఈ మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. - కరోనా వైరస్ నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రసార మాధ్యమాల సహకారాన్ని కోరుతున్నాం. -
మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?
సాక్షి. బెంగళూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్క సారిగా అసమ్మతి తలెత్తడంతో పాటు శనివారం ఒక్క రోజే 10 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రావడం, దీనిపై శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్‌ను అడగడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నగరంలోని జయదేవ ఆస్పత్రిలో ఆయన బంధువు ఒకరిని పరామర్శించడానికి ఆస్పత్రికి వచ్చారు. దీంతో రాజీనామాలపై ఏమైనా మాట్లాడతారేమోనని మీడియా ప్రతినిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చదవండి: కన్నడ సంక్షోభం ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో ఆగ్రహానికి లోనైన స్పీకర్ మండిపడ్డారు. మీరు మనుషులా, ఎక్కడ ఏమి అడగాలో తెలియదా?, నా దగ్గరి బంధువు ఆస్పత్రిలో ఉంటే చూడటానికి వస్తే ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అని ఆగ్రహించారు. ఆస్పత్రిలో ఉన్న వారిని పరామర్శించడానికి వస్తే మీకూ వార్తలు కావాలా?, మీరు మనుషులా, కాదా అని వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు ఆవేదనకు లోనయ్యారు. ఇలా దూషించడం తగదని పలువురు వ్యాఖ్యానించారు. -
రేపు తిరుపతిలో ‘సమర శంఖారావ సదస్సు’
-
సమర శంఖారావ సదస్సు; మీడియా మిత్రులకు ఆహ్వానం
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వర్యంలో బుధవారం జరిగే ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో తటస్థులు పాల్గొననున్నారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. తిరుపతి రూరల్ మండలం తనపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని పీఎల్ఆర్ గార్డెన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొంది. అనంతరం తిరుపతి వేదికగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ‘సమర శంఖారావ సదస్సు’కు మీడియా మిత్రులందరూ తప్పక హాజరుకావాలని మీడియా సెల్ మనవి చేసింది. తిరుపతిలోని యోగానంద్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమర శంఖారావ సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చిత్తూరు జిల్లా బూత్ కన్వీనర్లతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. (వైఎస్ జగన్ నేతృత్వంలో సమర శంఖారావం సభ) -
కోదాడ బరిలో హాస్య నటుడు వేణుమాధవ్..!
సాక్షి, కోదాడ అర్బన్: సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. కాగా వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణం. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఆవిర్భాం తర్వాత ఆయన పార్టీ సభలో పాల్గొని తన మిమిక్రి ద్వారా ప్రచాన కార్యక్రమాన్ని చేట్టారు. తదనంతరం ఆయనకు సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో హాస్యనటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిందే. ఆయన మిత్రబృందం కూడా రాజకీయాల్లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవాకార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను స్వయంగా వేయనున్నట్లు తెలిపారు. -
మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతల దాడి
-
మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతల దాడి
- మంత్రి అఖిలప్రియ సమక్షంలో ముష్టిఘాతాలు - నలుగురు పాత్రికేయులకు గాయాలు - మంత్రి క్షమాపణ చెప్పాలంటూ జర్నలిస్టుల ఆందోళన - డీజీపీకి ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ సంఘాలు సాక్షి, గుంటూరు: మంత్రి అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్న కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు వచ్చిన వీడియో జర్నలిస్టులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటుచేసుకుంది. దాడిలో నలుగురు వీడియో జర్నలిస్టులకు గాయాలయ్యాయి. మంత్రి అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కళ్లెదుటే దాడి జరుగుతున్నా నిలువరించలేకపోయారు. గుంటూరు నగరంలోని డొంకరోడ్డు నాలుగవ లైనులో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డిలు వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయాలంటూ మీడియా ప్రతినిధులకు టీడీపీ ప్రచార కార్యదర్శి చిట్టిబాబు సమాచారం పంపారు. మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని కెమెరాలతో చిత్రీకరిస్తున్న సమయంలో టీడీపీ నేతలు తోపులాటకు దిగారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మీడియా ప్రతినిధులకు హుకుం జారీ చేశారు. ‘మిమ్మల్ని ఎవరు పిలిచార్రా..?’ అంటూ పత్రికలో రాయలేని భాషలో దుర్భాషలాడుతూ ముష్టిఘాతాలకు దిగడంతో జర్నలిస్టులంతా నిర్ఘాంతపోయారు. దీంతో నలుగురు వీడియో జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దాడి ఘటనపై జర్నలిస్టులు మంత్రి అఖిల ప్రియ సమాధానం చెప్పాలంటూ నిలదీయగా మరోసారి రెచ్చిపోయిన టీడీపీ నేతలు వారిని దుర్భాషలాడుతూ నెట్టి వేశారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వీడియో జర్నలిస్టులు స్థానిక అరండల్‌పేట పోలీసుస్టేషన్‌కు వెళ్లగా సీఐ బందోబస్తులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. దాడిని జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. బాధ్యాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల కళ్లెదుటే జర్నలిస్టులపై దాడి జరుగుతుంటే నిలువరించక పోవడం దారుణం అని మండి పడ్డారు. గుంటూరు నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డీజీపీ సాంబశివరావును కలిసిన జర్నలిస్టు సంఘాల నేతలు దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ.. అర్బన్ ఎస్పీ విజయరావును ఆదేశించారు. సెప్టెంబరు 3వ తేదీన తన కార్యాలయానికి వచ్చి కలవాలని జర్నలిస్టు సంఘాల నేతలు, బాధిత వీడియో జర్నలిస్టులకు డీజీపీ సూచించారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ఎంపీ పాటిల్ దాడి
ఆందోళనకు దిగిన జర్నలిస్టులు... చివరకు క్షమాపణ చెప్పిన పాటిల్ జహీరాబాద్: ఆలయంలో ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ చేయిచేసుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయానికి మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు వస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫొటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు కవరేజీ కోసం శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. మంత్రి పర్యటన రద్దు కాగా, డిప్యూటీ స్పీకర్ ఆలయానికి వచ్చారు. గర్భగుడిలోకి పట్టువస్త్రాలు సమర్పించేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి వస్తున్న క్రమంలో ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు. అక్కడే ఉన్న ఎంపీ బీబీ పాటిల్ ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు. లోపలికి ఎందుకు వచ్చారు? పోలీసులెలా అనుమతించారు? అంటూ రుసరుస లాడారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌పై చేయిచేసుకున్నారు. ఆగ్రహించిన జర్నలిస్టు లు ఆందోళనకు దిగారు. స్పందించిన డిప్యూటీ స్పీకర్ సారీ చెప్పారు. బయలుదేరి వెళ్లేందుకు ఎంపీ వాహనంలో కూర్చోగా జర్నలిస్టులు ఆయన వాహనం ముందు బైఠాయించారు. ఎంపీ అనుచరుల ఓవర్‌యాక్షన్‌తో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పాటిల్.. క్షమాపణ చెప్పడంతో మీడియా ప్రతినిధులు శాంతించారు. -
మీడియా కొడుకులు 3 కెమెరాలే పెట్టారు!
నా వీడియోలు తీసినా పబ్లిష్ చేయడం లేదని దామోదర ఫైర్ తొగుట: ‘మీడియా నా.. కొడుకులు మూడు కెమెరాలతోనే వీడియోలు తీస్తున్నారు. నా ప్రోగ్రాంలో నేను మాట్లాడే వీడియోలు తీసి పబ్లిష్ చేయడం లేదు’ అని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులపై ఫైర్ అయ్యారు. బుధవారం మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితుల సమావేశానికి హాజరైన ఆయన మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా ప్రతి నిధులు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించిన దామోదర అనుచరులు పరుషపదజాలంతో దూషిస్తూ భౌతిక దాడులకు దిగారు. పలు కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పలువురు మీడియా ప్రతినిధులూ గాయపడ్డారు. మీడియా ప్రతినిధులు తొగుట పోలీస్ స్టేషన్లో దామోదరపై ఫిర్యాదు చేశారు. -
మీడియా ప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యంచేశారు. ఇంద్రకీలాద్రి కింద నుంచి వృద్ధులు, వికలాంగులను పైకి తీసుకొచ్చేందుకు దేవస్థానం లిఫ్టు ఏర్పాటు చేసింది. ఈ లిఫ్టు వద్ద తుని సీఐ ఒ.చెన్నకేశవరావుతో పాటు కొంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తూ పోలీసు కుటుంబాలు, వీఐపీల కుటుంబాలను తప్ప మిగిలిన వారిని లిఫ్ట్‌లోకి అనుమతించని విషయం తెలుసుకున్న ఒక మీడియా ప్రతినిధి కె.పూర్ణ, వీడియో జర్నలిస్టు రమేష్, మరో రిపోర్టర్ చైతన్య అక్కడకు వెళ్లారు. లిఫ్టులో వచ్చే, వెళ్లే వారిని వీడియో రికార్డింగ్ చేస్తుండటంతో పూర్ణాతో చెన్నకేశవరావు వాగ్వివాదానికి దిగారు. తాను చానల్ ప్రతినిధినని, ఐడెంటిటీ కార్డు చూపించినా కెమెరా, సెల్ఫోన్లను లాక్కున్నారు. ఫోన్లు ఇచ్చివేయాలని విలేకరులు గట్టిగా కోరడంతో దాడికిదిగి పూర్ణా మెడపై తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న పోలీసులు ఆ వెంటనే మీడియా ప్రతినిధులపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. చైతన్య తప్పించుకుని మీడియా పాయింట్ వద్ద ఉన్న మిగిలిన విలేకరులకు వద్దకు వచ్చి దాడి విషయం చెప్పాడు. విలేకరులు వెళ్లి పోలీసులను ప్రశ్నిం చగా, వీడియో తీయడం ఆపి, రికార్డయిన దృశ్యాలను తొలగించమంటే పట్టించుకోలేదని ఎదురు దాడికి దిగారు. పూర్ణాతో జరిగిన తోపులాటలో తన కాలికి గాయం అయిందంటూ చెన్నకేశవరావు బుకాయించడానికి ప్రయత్నిం చారు. అనంతరం విలేకరులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. కొద్దిసేపటికీ ఏసీపీ ఎ.వి.ఎన్.శివరామ్, డీసీపీ కాళీదాస్ రంగరావు వచ్చి చెన్నకేశవరావు వద్ద ఉన్న పూర్ణా, చైతన్య సెల్ఫోన్లను వారికి ఇప్పించారు. అయితే వివాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తొలగించారని పూర్ణా డీసీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ కాళిదాసు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మంత్రి రావెల ప్రెస్‌మీట్ బహిష్కరణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి రావెల కిషోర్‌బాబు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడబోగా విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆయనకు తీవ్ర నిరసన తెలిపి సమావేశాన్ని బహిష్కరించారు. సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి దాడి ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
ఫ్రంట్‌లో బొమ్మ పడాల్సిందే...!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య పత్రికలపై విపరీతమైన కోపం వస్తోందట. తనకు అనుకూలంగా పుంఖానుపుంఖాలుగా నిత్యం వార్తలు వండే పత్రికలపైనే ఆయనకు కోపమొచ్చిందట. అదేంటి అంత అనుకూలంగా ఏర్చికూర్చి వార్తలు వండివార్చుతున్నా... బాబుగారికి ఎందుకు కోపమొస్తుందని ఇష్టమైన మీడియా ప్రతినిధులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందట. తనకు అనుకూలంగా వార్తలు రాస్తున్న పత్రికలు తన కుమారుడి విషయంలో అంత ప్రాధాన్యత ఇవ్వక పోవటమే ఆయన కోపానికి కారణమని తేలింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కార్యక్రమాలను పత్రికలు హైలైట్ చేయడం లేదని బాబు ఆగ్రహంతో ఉన్నారు. అదేంటి... బ్రహ్మాండంగా ప్రచారం కల్పిస్తున్నామే అని వాదిస్తున్న వారికి కూడా బాబుగారి నుంచి స్పష్టమైన సమాధానమే వచ్చిందట. తనకు ఇచ్చిన తరహాలోనే కుమారుడి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతతో మొదటి పేజీల్లో ఎందుకు ప్రచురించడంలేదని, లోపలి పేజీలకు పరిమితం చేస్తున్నారని, అదే బాబుగారి అసలు కోపానికి కారణమని సన్నిహితులు తేల్చారు. ఇంత చేస్తున్నా తన కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న విషయాన్ని పచ్చ పత్రికల పెద్దల ముందే అసంతృప్తిని వ్యక్తం చేశారట. రాబోయే కాలంలో కాబోయే నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని తాననుకుంటుంటే మీరు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా ప్రశ్నించారు కూడా. మీరు ముఖ్యమంత్రి కాబట్టి ప్రాధాన్యత ఇస్తున్నారని, మీ కుమారుడు కాదుకదా...! అని ఒక సన్నిహితుడు అన్న పాపానికి బాబుగారు ఇంతెత్తున లేచారు. ఏవేవో పనికిరాని వార్తలు ఫస్ట్ పేజీలో ప్రచురిస్తుంటారు. మా వాడి వార్తలు వేయరా...!! అంటూ క్లాస్ తీసుకోవడంతో పాటు చినబాబుగారి బాధ్యతంతా ఇప్పుడు ఆ పత్రికలపైన వేశారట...! -
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా అగచాట్లు
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనను నగరం నుంచి ప్రారంభించినా ఇక్కడ సమాచార వ్యవస్థ సరిగాలేదు. దాంతో మీడియా ప్రతినిధులు నానా అవస్తలు పడవలసి వస్తోంది. మూడురోజుల నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంలో వరుస సమీక్షలు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ఆ సమాచారం ఇక్కడి అధికారులకు, మీడియాకు తెలియజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బుధవారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఎడతెరిపిలేకుండా సమీక్షలు నిర్వహించారు. ఆ సమాచారం రాత్రి పొద్దుపోయేవరకు మీడియాకు విడుదల కాలేదు. ఆరాతీస్తే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సమాచార పౌర సంబంధాల శాఖను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కలిసి సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి, మార్పులు చేర్పులు చేసి హైదరాబాద్‌లో సీఎం పేషీకి పంపుతున్నారు. అక్కడ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తరువాత ఇక్కడ విడుదల చేస్తున్నారు. దాంతో పగటి పూట జరిగిన కార్యాక్రమాల వివరాలు కూడా మీడియాకు అందటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ క్యాంపు కార్యాలయం వద్ద నియమితులైన ఐ అండ్ పీఆర్ అధికారులను కూడా సీఎం చాంబర్లోకి అనుమతించటం లేదు. దాంతో లోపల జరుగుతున్న చర్చలు, సమావేశాల సారాంశం మీడియాకు ఎప్పటికప్పుడు అందటం లేదు. మీడియా ప్రతినిధులు సమాచారం కోసం గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాత్కాలిక మీడియా పాయింట్ ఏర్పాటుకు ఆదేశాలు కాగా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అత్యవసరంగా తాత్కాలిక మీడియాపాయింట్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్యాంపు కార్యాలయం సమీపంలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయటానికి గురువారం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం మీడియా ప్రతినిధులు షామియానాల కింద కూర్చుని, వర్షానికి తడుస్తూ సమాచారం కోసం వేచి ఉంటున్నారు. వారి కోసం తాత్కాలికంగా ఫైబర్ లేదా ప్లాస్టిక్‌తో వసతి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
పెళ్లా.. పదేళ్ల తర్వాత అడగండి...
పెళ్లి గురించి తనను ఇప్పుడప్పుడే అడగొద్దని, పదేళ్ల తర్వాత అడగండని అంటోంది బాలీవుడ్ భామ ఈషా గుప్తా. ఢిల్లీలో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమెను మీడియా ప్రతినిధులు పెళ్లెప్పుడని ప్రశ్నిస్తే, మరో పదేళ్లయ్యాక గానీ పెళ్లి విషయమై నిర్ణయం తీసుకోలేనని, తన కంటే ముందుగా తన అక్క నేహాకు పెళ్లి జరగాలని కోరుకుంటున్నానని చెప్పింది. దేశభక్తి సినిమా చేయాలని ఉంది... యువనటుడు అర్జున్ కపూర్ దేశభక్తి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. సాధారణంగా వినిపించే జాతీయగీతం ప్రజలను స్పందింపజేయడం అనిర్వచనీయంగా ఉంటుందని, త్వరలోనే ఒక దేశభక్తి సినిమా చేయాలనుకుంటున్నానని అతడు ‘ట్విట్టర్’ ద్వారా తన ఆసక్తిని బయటపెట్టాడు. భారతీయ ఆభరణాలంటే ఇష్టం... భారత్‌లో పుట్టి పెరగకపోయినా, తనకు భారతీయ ఆభరణాలంటేనే ఇష్టమని అంటోంది నర్గీస్ ఫక్రీ. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక ఫ్యాషన్ వీక్‌లో సంప్రదాయ భారతీయ ఆభరణాలతో ఆమె ర్యాంప్ వాక్ చేసింది. తాను చాలా తక్కువగా నగలు ధరిస్తానని, అయితే, భారతీయ ఆభరణాల డిజైన్లను ఎక్కువగా ఇష్టపడతానని నర్గీస్ ఫక్రీ చెబుతోంది. -
కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రచ్చ
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: పీఆర్పీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో పెత్తనం చెలాయిస్తున్న నేతలపై కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. వారి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి పేరిట నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత గొడవలను మరింత రగిల్చాయి. పీఆర్పీ నుంచి వచ్చిన నేతలు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న వారిపై పెత్తనం చేయడాన్ని ఇక సహించరాదని ఒక వర్గం నేతలు తీర్మానించారు. సోనియా జన్మదిన వేడుకలు చేస్తే జనం తిడతారని చెప్పిన నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిరంజీవి జన్మదిన వేడుకులు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. అసమ్మతి నేతల సమావేశం అసలు విషయం తెలియడంతో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను చూసి నిష్ర్కమించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తామంతా మద్దతుగా ఉన్నామని ప్రజలకు సంకేతాలు పంపే ఆలోచనతో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి సేవాపీఠం పేరుతో ‘ తెలుగుజాతి గుండె చప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్’అనే నినాదంతో మంత్రి గంటా, ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ముద్రించారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి బాలరాజు ఫొటోలు ఈ ఫ్లెక్సీల్లో ముద్రించలేదు. ‘సమైక్యాంధ్ర పార్టీలో ఆ ఇద్దరేరీ?’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనం చూసి కాంగ్రెస్‌లోని ఒక వర్గం మండిపోయింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు వారే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేస్తున్నట్లుగా, మిగిలిన వారు చేయనట్లుగా కలరింగ్ ఇచ్చుకోవమేంటని వారు మండిపడ్డారు. ప్రభుత్వ, పార్టీ పదవుల పంపిణీ వ్యవహారంలో కొంత కాలంగా నలుగుతున్న అసమ్మతిని ఈ సందర్భంగా వారు బహిర్గతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీలో ఎంతో కాలంగా ఉంటున్న పలువురు మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఒక హోటల్లో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావును కూడా సమావేశానికి ఆహ్వానించారు. అసమ్మతి మంటలు మరింత రగిలించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలియకుండా హాజరైన బెహరా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను చూశాక గానీ అసలు విషయం అర్థం కాలేదు. అసలు కథ ఏమిటో ఆలస్యంగా గ్రహించిన ఆయన ఆగమేఘాల మీద అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు ఫ్లెక్సీల వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుబ్బరామిరెడ్డే వీటిని ఏర్పాటు చేయించారని, కాంగ్రెస్ వ్యక్తిగా ఆయన ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించడాన్ని పీసీసీకి ఫిర్యాదు చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. నగర కాంగ్రెస్ మొత్తం పార్టీలు మారిన వారి చేతిలోకి వెళ్లిపోయిందని, తొలి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి అవమానాలు, నిరాదరణ ఎదురవుతున్నాయని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ద్రోణం రాజు సత్యనారాయణ, ద్రోణం రాజు శ్రీనివాస్‌ను ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టి పనిచేసిన ఒక నాయకుడు ఇతర పార్టీ నుంచి రావడంతోనే రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వడాన్ని నేతలు ఆక్షేపించారు. ఆ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాల్సి వస్తే నగరంలో ఎంతో మంది పార్టీ నేతలు ఉన్నారనే విషయం అధినాయకత్వం మరచి పోయిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాలను గట్టిగా ఎదుర్కోక పోతే మరింత నష్టపోతామని సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇక మీదట తామంతా కలసి ఒక గ్రూపుగా పనిచేయాలని నిర్ణయించారు. పార్టీలోని అంతర్గత గొడవలు, అందులోనూ ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్‌లోని ఒక వర్గం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి శుక్రవారం సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన దీక్షకు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నగర ఎస్సీ సెల్ చైర్మన్ కొల్లాబత్తుల వెంగళరావు నేతృత్వంలో జరిగిన అసమ్మతి సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల వెంకటరావు, పేర్ల విజయచందర్, కృష్ణ, గరికిన గౌరి, జి.వి.రమణి పార్టీ నాయకులు మూర్తి యాదవ్, విజయారెడ్డి, పెద్దాడ రమణ, సుధాకర్ తోపాటు మరికొంత మంది పాల్గొన్నారు.