సమావేశంలో అడ్మిరల్ లాంబాతో మాట్లాడుతున్న జనరల్ రావత్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యుద్ధ విమానాలను గాల్లోకి పంపడంతోపాటు (ఫ్లై– పాస్ట్స్) ఆసుపత్రులపై పూల జల్లు కురిపిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్(సీడీఎస్) బిపిన్ రావత్ చెప్పారు. ఆయన శుక్రవారం త్రివిధ దళాల అధిపతులు ఎం.ఎం.నరవణే, కరంబీర్‌సింగ్, ఆర్.కె.ఎస్.బదౌరియాతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే ఆయన తొలి మీడియా సమావేశం. కరోనాపై పోరాటం విషయంలో దేశమంతా ఒక్కటై నిలిచిందని జనరల్ రావత్ అన్నారు.
మహమ్మారి బారినుంచి మనల్ని కాపాడేందుకు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు త్రివిధ దళాలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలపనున్నాయని చెప్పారు. అవి...మే 3వ తేదీన సాయంత్రం భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఫిక్స్‌డ్ వింగ్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలు ఫ్లై–పాస్ట్స్‌లో పాల్గొంటాయి. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు.. దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు ఇవి గాల్లో ఎగురుతాయి. నావికా దళం హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూలు చల్లుతాయి. యుద్ధనౌకలు ప్రత్యేక డ్రిల్లు నిర్వహిస్తాయి. సముద్ర తీరంలో యుద్ధ నౌకలను విద్యుత్ వెలుగులతో నింపేస్తారు. ప్రతి జిల్లాలో కొన్ని హాస్పిటళ్లలో సైన్యం ఆధ్వర్యంలో మౌంటెయిన్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది.
(చదవండి: మేడే రోజు శ్రామిక్ రైళ్లు)
Comments
Please login to add a commentAdd a comment