flowers rain
-
Ayodhya Ram Mandir: వైభవోజ్వల ప్రాణప్రతిష్ట
సాక్షి, అయోధ్య: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూసిన అద్భుత, చరిత్రాత్మక ఘట్టం వైభవోపేతంగా, నిరి్వఘ్నంగా జరిగింది. అయోధ్య భవ్య మందిరంలో రామ్‌లల్లా సోమవారం మధ్యాహ్నం ప్రాణప్రతిష్ట జరుపుకున్నాడు. దివ్యమంగళ రూపంతో, మందస్మిత వదనంతో ఐదేళ్ల నీలమేఘ రాముడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ప్రత్యక్షంగా వేలాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో ఈ వేడుకను కనులారా తిలకించి ఆనంద పరవశులయ్యారు. బంగారు ధనస్సు, బాణంతోపాటు విలువైన స్వర్ణ వజ్రాభరణాలు, పూల దండలు, తులసి మాలలతో అద్భుతంగా అలంకరించిన మర్యాద పురుషోత్తముడి విగ్రహం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ప్రధాన యజమాని(కర్త) హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉత్సవాన్ని తన చేతుల మీదుగా నిర్వహించారు. అటంకాలేవీ లేకుండా అనుకున్న ముహూర్తానికే గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత నూతన భవ్య మందిరంపై సైనిక హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడంటూ ప్రధానమంత్రి మోదీ అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అయోధ్యలో జరిగిన రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు అయోధ్యలో ప్రాణప్రతిష్ట ఉత్సవాలు సోమవారం ఉదయమే మొదలయ్యాయి. అతిథులు, ప్రముఖులు ఉదయం నుంచే బారులు తీరారు. సంప్రదాయ సంగీత కళాకారులు రాముడి భక్తి గీతాలు ఆలపించారు. సంగీత వాయిద్యాలతో ఆహూతులకు ఆధ్యాతి్మక పరిమళాలు పంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి తొలుత అయోధ్య ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. పట్టు వ్రస్తాలు, పూజా ద్రవ్యాలతో మధ్యాహ్నం ఆలయం లోపలికి అడుగుపెట్టారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్‌తో కలిసి గర్భగుడి ఎదుట కొన్ని క్రతువులు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించారు. మోదీ వెంట భాగవత్‌తో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా, జైశ్రీరామ్ అనే నినాదాలు మార్మోగుతుండగా గర్భాలయం లోపల నరేంద్ర మోదీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకన్ల వ్యవధిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించారు. విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికనుంచి మోదీ ప్రసంగించారు. కుబేర తిల శివాలయంలో మోదీ పూజలు రామమందిరంలో ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధాని మోదీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకొని, పూజలు చేశారు. శివలింగానికి జలాభిõÙకం నిర్వహించారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రాచీన కుబేర తిల ఆలయాన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జటాయువు పక్షి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. బాధ్యతల నిర్వహణలో జటాయువు పట్టుదలను ఆయన గుర్తుచేసుకున్నారు. 11 రోజుల అనుష్ఠానం విరమించిన ప్రధాని మోదీ అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షను ముగించారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్గిరి మహారాజ్ ప్రధానికి చరణామృతం (ఉపచారాలకు వాడే పాలతో చేసిన తీపి పానీయం) ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన పాదాలకు ప్రధాని పాదాలకు సమస్కరించారు. ఉపవాస దీక్షను కొనసాగించిన మోదీ భక్తిని దేవ్గిరి ప్రశంసించారు. అనుష్ఠానం ఆసాంతం మోదీ కటిక నేలపై శయనిస్తూ కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు. రోజూ గంటా 11 నిమిషాల పాటు మంత్ర జపం, ధ్యానం చేశారు. రామాలయ కారి్మకులకు ఘనంగా సన్మానం అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన కారి్మకులను ప్రధాని మోదీ ఘనంగా సన్మానించారు. ప్రాణప్రతిష్ట అనంతరం కారి్మకులపై ఆయన కృతజ్ఞతాపూర్వకంగా పూలు చల్లారు. దాంతో ప్రాణప్రతిష్టకు హాజరైన వంద మందికి పైగా కార్మికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
ఊరేగింపు... మేళతాళాలు...
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్ గెలిపించిన కెప్టెన్ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే హౌజింగ్ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. భార్యతో పాటు రహానే తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకొని నడుస్తుండగా ఇరుగు పొరుగువారు, స్థానికులు అతనిపై అడుగడుగున పూలజల్లు కురిపించారు. అనంతరం రహానేతో కేక్ కట్ చేయించి వేడుక జరుపుకున్నారు. అంతకుముందు ముంబై క్రికెట్ సంఘం రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షాలను ఘనంగా సన్మానించింది. బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్ ఢిల్లీలో హర్షధ్వానాల మధ్య ఇంటికి చేరుకున్నారు. తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూరైన ‘చిన్నప్పంపట్టి’ గ్రామస్థులంతా రథంపై ఊరేగించి బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఊరంతా పాల్గొనడం విశేషం. ఓ నెట్ బౌలర్‌గా జట్టుతో పాటు వెళ్లిన ఈ తమిళ తంబి అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. కరోనా దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రహానే, రోహిత్, శార్దుల్, పృథ్వీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ కావాలని అధికారులు సూచించారు. -
కరోనా యోధులకు సైన్యం సలాం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యుద్ధ విమానాలను గాల్లోకి పంపడంతోపాటు (ఫ్లై– పాస్ట్స్) ఆసుపత్రులపై పూల జల్లు కురిపిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్(సీడీఎస్) బిపిన్ రావత్ చెప్పారు. ఆయన శుక్రవారం త్రివిధ దళాల అధిపతులు ఎం.ఎం.నరవణే, కరంబీర్‌సింగ్, ఆర్.కె.ఎస్.బదౌరియాతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే ఆయన తొలి మీడియా సమావేశం. కరోనాపై పోరాటం విషయంలో దేశమంతా ఒక్కటై నిలిచిందని జనరల్ రావత్ అన్నారు. మహమ్మారి బారినుంచి మనల్ని కాపాడేందుకు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు త్రివిధ దళాలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలపనున్నాయని చెప్పారు. అవి...మే 3వ తేదీన సాయంత్రం భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఫిక్స్డ్ వింగ్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలు ఫ్లై–పాస్ట్స్‌లో పాల్గొంటాయి. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు.. దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు ఇవి గాల్లో ఎగురుతాయి. నావికా దళం హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూలు చల్లుతాయి. యుద్ధనౌకలు ప్రత్యేక డ్రిల్లు నిర్వహిస్తాయి. సముద్ర తీరంలో యుద్ధ నౌకలను విద్యుత్ వెలుగులతో నింపేస్తారు. ప్రతి జిల్లాలో కొన్ని హాస్పిటళ్లలో సైన్యం ఆధ్వర్యంలో మౌంటెయిన్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది. (చదవండి: మేడే రోజు శ్రామిక్ రైళ్లు) -
మహా గణపతికి నేడూ పూలవర్షం
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిపై మంగళవారమూ పూలవర్షం కురవనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ మేరకు ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఛాపర్ ద్వారా ఐదుసార్లు తిరిగి, దాదాపు మూడు క్వింటాళ్ల గులాబీ పూలను విగ్రహంపై కురిపించేందుకు ప్రయత్నించారు. వాతావరణం, గాలి వీచే దిశ తదితర కారణాల వల్ల అవి అనుకున్న స్థాయిలో విగ్రహంపై పడలేదు. దీంతో మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్యలో నిమజ్జనానికి ముందు సాగర్ తీరంలో మరోసారి పూలవర్షం కురిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ మైకులో ప్రకటించింది. 11,116 కొబ్బరి కాయల మొక్కు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే 11,116 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నగర కన్వీనర్ చంద్రశేఖర్ (చందు) తన మొక్కు తీర్చుకున్నారు. వినాయక చవితి రోజు మొదటి కొబ్బరికాయను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా కొట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం చందు పది రోజుల పాటు రోజూ వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. చివరి రోజు సోమవారం కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి 1,116 కొబ్బరి కాయలను కొట్టి గణనాథుడి మొక్కు తీర్చుకున్నారు.