
మీడియా కొడుకులు 3 కెమెరాలే పెట్టారు!
నా వీడియోలు తీసినా పబ్లిష్ చేయడం లేదని దామోదర ఫైర్
తొగుట: ‘మీడియా నా.. కొడుకులు మూడు కెమెరాలతోనే వీడియోలు తీస్తున్నారు. నా ప్రోగ్రాంలో నేను మాట్లాడే వీడియోలు తీసి పబ్లిష్ చేయడం లేదు’ అని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులపై ఫైర్ అయ్యారు. బుధవారం మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితుల సమావేశానికి హాజరైన ఆయన మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మీడియా ప్రతి నిధులు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించిన దామోదర అనుచరులు పరుషపదజాలంతో దూషిస్తూ భౌతిక దాడులకు దిగారు. పలు కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పలువురు మీడియా ప్రతినిధులూ గాయపడ్డారు. మీడియా ప్రతినిధులు తొగుట పోలీస్ స్టేషన్‌లో దామోదరపై ఫిర్యాదు చేశారు.