
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వర్యంలో బుధవారం జరిగే ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో తటస్థులు పాల్గొననున్నారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. తిరుపతి రూరల్ మండలం తనపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని పీఎల్‌ఆర్ గార్డెన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొంది.
అనంతరం తిరుపతి వేదికగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ‘సమర శంఖారావ సదస్సు’కు మీడియా మిత్రులందరూ తప్పక హాజరుకావాలని మీడియా సెల్ మనవి చేసింది. తిరుపతిలోని యోగానంద్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమర శంఖారావ సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చిత్తూరు జిల్లా బూత్ కన్వీనర్లతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. (వైఎస్ జగన్ నేతృత్వంలో సమర శంఖారావం సభ)
Comments
Please login to add a commentAdd a comment