పూర్ణకుంభంతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం | YS Jagan Reached Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రి చేరుకున్న వైఎస్‌ జగన్‌

Published Mon, Mar 11 2019 1:36 PM | Last Updated on Mon, Mar 11 2019 5:20 PM

 YS Jagan Reached Rajahmundry - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‍కాసేపటి క్రితం రాజమహేంద్రవరం చేరుకున్నారు. కాకినాడలో వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్‌ నుంచి విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు.

అక్కడి నుంచి నగరంలోని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు. పూర్ణకుంభంతో శివరామసుబ్రహ్మణ్యం ఇంటి వద్ద వైఎస్ జగన్‌కు అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. వారందరినీ చిరునవ్వుతో జననేత పలకరించి ముందుకు సాగారు.

వైఎస్సార్‌సీపీలోకి శివరామసుబ్రహ్మణ్యం
ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వనించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చదవండి: ‘తూర్పు’... మార్పునకు నాంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement