సాక్షి, కాకినాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమరశంఖారావం భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన డేటా చోరీ కేసులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఒక సైబర్ క్రిమినల్ అని వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు అని వైఎస్ జగన్ నిలదీశారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చదవండి: ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్
తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఓట్ల తొలగింపులోనూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. దొంగ ఓట్లను చేర్పిస్తూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతి గ్రామంలోనూ వివరించాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment