samara shankharavam
-
నేడే శంఖారావం
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సమర శంఖారావం పూరించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు సాయికిరణ్ యాదవ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించేందుకు పార్టీ కేడర్‌ను కేసీఆర్ సమాయత్తం చేయనున్నారు. ఈ బహిరంగ సభకు మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేసే బాధ్యతలను నగర మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు అప్పజెప్పారు. సభ నేపథ్యంలో గులాబీ జెండాలు, స్వాగత తోరణాలతో సిటీ గులాబీ వనమైంది. ఎల్బీ స్టేడియంలోనూ భారీగా ఏర్పాట్లు చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో మంచి ఊపుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనే అదే విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మహానగరంలోని మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ బహిరంగ సభతో ప్రచార హోరును పెంచనుంది. పార్టీకి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థులు కొత్తవారు కావడంతో ప్రచారపర్వాన్ని సీనియర్ల భుజాలపై వేశారు. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌కు పార్టీ శ్రేణులకు ఈ బహిరంగ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళికలు, పూర్తిచేసిన పథకాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించనున్నారు. గులాబీ బాస్ సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటుందని, తమ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆ పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నేడు ట్రాఫిక్ మళ్లింపు.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీసు విభాగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు వచ్చే జన సందోహం కోసం సభ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల మళ్లింపు ఇలా.. ♦ ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు. ♦ అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు. ♦ బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా పంపిస్తారు. ♦ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ♦ కింగ్‌కోఠి భారతీయ విద్యాభవన్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తాజ్‌మహల్ హోటల్ మీదుగా పంపిస్తారు. ♦ లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు పంపిస్తారు. ♦ సభకు వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించారు. పరిస్థితిని సమీక్షించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్ఎస్ కార్యకర్తల సభ, ఆదివారం బీజేపీ బహిరంగ సభ ఉన్నందున ఆయా సభలకు ప్రముఖుల హాజరు, రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్ కుమార్ గురువారం సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో అధిక సిబ్బందిని మోహరించడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు లేకుండా చూడాలని ఆదేశించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఇలా.. ఎల్బీస్టేడియంలో నేడు జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి భారీగా వాహనాల్లో రానుండటంతో సాఫీ ట్రాఫిక్ నిర్వహణ కోసం చర్యలు చేపట్టారు. ♦ శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి ఎల్బీ స్టేడియం వచ్చే వాహనదారులు అరాంఘర్, ఎన్పీఏ, బహూదూర్‌పురా, సిటీ కాలేజ్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా రావాలి. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, అత్తాపూర్, మెహదీపట్నం, లక్డీకాపూల్ నుంచి ఎల్బీ స్టేడియం చేరుకోవచ్చు. అయితే భారీ వాహనాలకు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పై అనుమతి లేదు. ఫ్లైఓవర్ కింది నుంచి రావాలి. ♦ తాండారు, వికారాబాద్, చేవెళ్ల నుంచి వచ్చే వాహనాలు లంగర్‌హౌస్, మెహదీపట్నం, లక్డీకాపూల్ మీదుగా చేరుకోవాలి. ♦ శంకర్పల్లి నుంచి వచ్చే వాహనదారులు మోఖిలా, నార్సింగి, మెహదీపట్నం, లక్డీకాపూల్ నుంచి స్టేడియానికి చేరుకోవాలి. ♦ మేడ్చల్, అల్వాల్, పేట్‌బషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు బోయిన్పల్లి, బేగంపేట, రాజ్‌భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ నుంచి స్టేడియానికి చేరుకోవాలి. ♦ శామీర్‌పేట, అల్వాల్ నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ బస్టాండ్, బేగంపేట, రాజ్‌భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ నుంచి స్టేడియానికి చేరుకోవాలి. ♦ దుండిగల్, జీడిమెట్ల, బాలానగర్ నుంచి వచ్చే వాహనదారులు ఫతేనగర్, బేగంపేట, రాజ్‌భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలి. -
‘ముగ్గురు కలిసి హోదాను హత్య చేశారు’
-
లగడపాటి సర్వే దొంగ సర్వే
-
నవరత్నాలతో ప్రతి మనిషి జీవితంలో వెలుగు
-
కాకినాడ : సమర శంఖారావం సభలో అశేషజనవాహిని
-
‘ముగ్గురు కలిసి హోదాను హత్య చేశారు’
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత పార్టీ శ్రేణుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి నడిగట్ల చింతలరావు అనే నాయకుడు ‘అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి అన్యాయం చేసాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఈ మోసాలను ఎలా ఎదుర్కొవాలి’ అని వైఎస్ జగన్‌ను అడిగారు. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్పండి. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు విన్నాం... ఆ తర్వాత చేసిన మోసం చూశాం. మళ్లీ ఎన్నికల వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఒక ప్రత్యేక హోదా అంశాన్నే తీసుకుంటే.. ఎన్నికల ముందు ప్రతేక హోదాపై ఉదరగొట్టిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు అడగలేదు. ఇప్పుడు ఎన్నికలచ్చేసరికి మళ్లీ ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. మనం వద్దనుకున్నా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తీరని అన్యాయం చేసింది. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చలేదు. అలా చేర్చుంటే కోర్టు ద్వారానైనా మనం హోదాను సాధించేవాళ్ళం. ఇచ్చే అవకాశం ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించండి. పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రజలకు చెప్పండి. చంద్రబాబుకు ఓటేయ్యండి, బీజేపీకి ఓటేయ్యండని చెప్పిన పవన్ కల్యాణ్.. నాలుగేళ్లు వాళ్లతో కలిసి ప్రయాణించి.. మళ్లీ ఎన్నికలచ్చే సరికి కారణాలు చెబుతారు. చంపేటప్పుడు వీళ్లు ముగ్గురు భాగస్వామ్యులు. ఒకరు కత్తి ఇచ్చారు. ఒకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మరోకరు కత్తి తీసుకుని ఆ వ్యక్తిని పొడిచారు. ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదాను హత్య చేశారు. వాళ్లను నమ్మి నమ్మి మోసపోయాం. ఇకా ఎవరినీ నమ్మవద్దని చెప్పండి. 25కు 25 ఎంపీ సీట్లు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో గట్టిగా చుద్దామ’ని తెలిపారు. -
చంద్రబాబు సైబర్ క్రిమినల్: వైఎస్ జగన్
-
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం
-
డేటా చోరీ.. టీడీపీని రద్దు చేయాలి: వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమరశంఖారావం భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన డేటా చోరీ కేసులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఒక సైబర్ క్రిమినల్ అని వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు అని వైఎస్ జగన్ నిలదీశారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్ తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఓట్ల తొలగింపులోనూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. దొంగ ఓట్లను చేర్పిస్తూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతి గ్రామంలోనూ వివరించాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
‘ఆ క్షణం కోసం యావత్ ఏపీ ఎదురుచూస్తోంది’
-
ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్
-
‘ఆ క్షణం కోసం యావత్ ఏపీ ఎదురుచూస్తోంది’
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీ రాజకీయాలకు రాజధాని వంటి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ జగ్గంపేట సమన్వయకర్త జ్యోతుల చంటిబాబు అన్నారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ సమరశంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగానే వైఎస్ జగన్ తొలుత కాకినాడులో సభ నిర్వహించడం తమ జిల్లా అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తమ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని, జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించితీరుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం మాట తప్పకుండా పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. హోదా వస్తే కార్మికులకు ఉపాధి దొరుకుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని చంటిబాబు వివరించారు. ఏపీ అభివృద్ధి జరిగే విధంగా తమ నాయకుడి నిర్ణయాలు ఉంటాయిని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పే విధంగా భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని యావత్ ఏపీ రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని వైఎస్సార్సీపీ ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ అన్నారు. తమ పార్టీకి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరిని వైఎస్ జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు మనందరికీ దిశానిర్ధేశం చేయడానికి వైఎస్ జగన్ ఇక్కడి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లడానికి నవరత్నాలు పథకంతో మనకు ప్రజా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. -
ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాకినాడలో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన సమర శంఖారావ సభకు హాజరైన అశేష జనసముహాన్ని ఉద్దేశించి జననేత వైఎస్ జగన్ ప్రసంగించారు. సమర శంఖారావం వేదికపై నుంచి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. రేపు వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు తొమ్మిదేళ్లుగా మీరందరూ నాకు అండగా నిలిచారు అధికార పార్టీ మిమ్మల్ని ఎంతగా బాధపెట్టిందో నాకు తెలుసు మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలింది అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తాం దోపిడీకి పాల్పడ్డ టీడీపీకి శాంతియుతంగా సమాధి కట్టాలి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం రావాలి వైఎస్సార్సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారు. టీడీపీ అవినీతి పాలనపై, మేనిఫెస్టోలో ఇచ్చిన 600 మోసపూరిత హామీలపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలి టీడీపీ ప్రభుత్వం ఇసుక నుంచి గుడి భూముల వరకు దేన్నీ వదలలేదు. చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతే చోటుచేసుకుంది. చంద్రబాబు రాక్షస పాలనపై గ్రామాల్లో చర్చ జరగాలి ఎల్లో మీడియాతో, లగడపాటి సర్వేలతో జాగ్రత్త పోలవరం ప్రాజెక్టు పనులు పునాది గోడలు దాటి ముందుకు కదల్లేదు. అమరావతి నిర్మాణంలో పిచ్చిమొక్కలు తప్ప ఏం కనబడటం లేదు. పర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక పెట్టలేదు.. అంతా తాత్కాలికమే. చంద్రబాబు ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన వ్యక్తులను సలహాదారుడిగా పెట్టుకుంటారు. ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు. చంద్రబాబుకు కొన్ని పత్రికలు, ఛానల్స్ వత్తాసు పలుకుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం అంటూ లగడపాటి చెప్పారు. లగడపాటి దొంగ సర్వేలపై, ఎల్లో మీడియా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు ప్రతి వ్యవస్థను నాశనం చేశారు ఇంటెలిజెన్స్ అధికారులు చంద్రబాబుకు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు సైబర్ క్రిమినల్.. ఐటీ గ్రిడ్స్ డేటా చోరిపై విస్తృతంగా చర్చ జరగాలి ప్రజల డేటాను ప్రైవేటు సంస్థలు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు? ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలి ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు రెండ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఓట్ల తొలగింపులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఓటు భద్రంగా ఉందో తెలసుకోవాలి.. ప్రతి ఒక్కరు ఓటు భద్రంగా ఉందో లేదో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలి. ఓటర్ ఐడీ కార్డు మీద ఎపిక్ నంబర్‌ను 1950కు ఎస్ఎంఎస్ చేస్తే మీ ఓటు ఉందో లేదో తెలుస్తుంది. ఓటు లేని వాళ్లు ఫామ్-6 పూర్తి చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఇందుకోసం ఎమ్మార్వో ఆఫీస్, బుత్ లెవల్ అధికారిని గాని కలవాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమికి మనకు ఓట్ల తేడా కేవలం 5 లక్షలే. అందుకే ప్రతి ఓటు కీలకమే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చేయని మోసం ఉండదు. ఈ నెల రోజుల్లో మనం చాలా సినిమాలు చూస్తాం. చంద్రబాబు చెప్పని అబ్బద్దం, చేయని మోసం, వేయని డ్రామా ఉండదు.. ఇవన్నీ మనకు ఎల్లో మీడియాలో కన్పిస్తాయి. మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా. న్యాయం కోసం పోరాడితే కేసులు పెడుతున్నారు.. ఫామ్-7 అంటే దొంగ ఓటుపై ఇచ్చే ఒక దరఖాస్తు. అలాంటి ఫామ్-7 మనవాళ్లు పెడితే బాబు అండ్ టీమ్ రివర్స్ అయింది. న్యాయం కోసం పోరాడితే కేసులు పెడుతున్నారు. నిజంగా ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? పేదవాడికి వైఎస్ జగన్ భరోసా.. చదువుకు, పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా. మీ పిల్లల చదువుకోసం.. ఎన్ని లక్షల ఖర్చైనా నేను చదివిస్తా. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటే.. ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తాం. చిన్న పిల్లలను స్కూలుకి పంపిన తల్లులకు ఏడాది 15వేల రూపాయలు అందజేస్తాం. వైఎస్సార్ చేయూత కింద ప్రతి అక్కకు నాలుగు దఫాలుగా 75వేల రూపాయాలు. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు నాలుగు దఫాల్లో మాఫీ రైతు భరోసా కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతుకు రూ.12,500 పింఛన్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు పెంచుతాం. వచ్చేది రాజన్న రాజ్యమని చెప్పండి.. నవరత్నాలతో ప్రతి మనిషి జీవితంలో వెలుగు చూస్తాం. మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్పండి. వచ్చేది రాజన్న రాజ్యమని.. వచ్చేవి అన్నీ మంచి రోజులని చెప్పండి. సీ-విజిల్ యాప్‌తో టీడీపీ అక్రమాలకు చెక్ చెప్పండి... ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సీ-విజల్ యాప్ ఉంటుంది. అందరు తమ తమ ఫోన్లలో సీ విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టీడీపీ నేతలు ఎక్కడైనా అన్యాయం చేసినట్టుగా కనిపిస్తే.. ఈ యాప్ ద్వారా రికార్డ్ చేసి ఎన్నికల అధికారులకు పంపండి. టీడీపీ అక్రమాలను అడ్డుకుని ప్రజల్లో చైతన్యం నింపండి. టీడీపీ అక్రమాలపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. -
పూర్ణకుంభంతో వైఎస్ జగన్‌కు స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం రాజమహేంద్రవరం చేరుకున్నారు. కాకినాడలో వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు. పూర్ణకుంభంతో శివరామసుబ్రహ్మణ్యం ఇంటి వద్ద వైఎస్ జగన్‌కు అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. వారందరినీ చిరునవ్వుతో జననేత పలకరించి ముందుకు సాగారు. వైఎస్సార్సీపీలోకి శివరామసుబ్రహ్మణ్యం ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ‘తూర్పు’... మార్పునకు నాంది -
కాకినాడ వేదికగా సమర శంఖారావం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు నుంచే మార్పునకు నాంది పలుకుతున్నారు. సమర శంఖారావం వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించి కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక్కడి నుంచే సమరశంఖం పూరించనున్నారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సమర శంఖారావం జరిగే వేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఊహకందని విధంగా ఎన్నికల తేదీ ఖరారైంది. పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. ఇంకేముంది సమర శంఖారావం వేదికగా విజయ ఢంకా మోగించనున్నారు. తూర్పు మార్పుకు నాంది అని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో తమకో మంచి సంకేతమని, పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే వేదికగా కాకినాడ నిలవడం శుభ పరిణామమని వైఎస్సార్సీపీ నేతలు ఉత్సాహపడుతున్నారు. జిల్లాలో అత్యధిక నియోజకవర్గాలు ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, వైఎస్సార్సీపీ విజయానికి ఇక్కడ నాంది పలుకుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 40 లక్షలకుపైగా ఓటర్లు, 19 నియోజకవర్గాలున్న జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్త శ్రేణులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులతో జరిగే సమావేశంలో ఎన్నికల సమరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచార సంగ్రామంలో మొదటి సభగా కాకినాడ కానుండటంతో జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను తలశిల రఘురాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కర్రి వెంకటరమణ, పార్టీ నాయకులు కర్రి పాపారాయుడు తదితరులు పర్యవేక్షించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా శ్రేణులు తరలివస్తుండటంతో కాకినాడలో రాజకీయ సందడి కనిపిస్తోంది. -
‘తూర్పు’... మార్పునకు నాంది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రణరంగానికి తెరలేచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో సమావేశం కానున్నారు. కాకినాడలో నేడు జరగనున్న వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని ఎన్నికల విశ్లేషకులు భావిస్తారు. ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా దిగ్విజయమేనని గోదావరి ప్రజల నమ్మకం. ఎన్నికల సమర శంఖారావం సభకు కాకినాడ వేదిక కావడం శుభసంకేతమని వైఎస్సార్సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం కాకినాడలో సోమవారం జరగనున్న వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. 40 లక్షలకు పైగా ఓటర్లు, 19 నియోజకవర్గాలున్న అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో సమావేశమై, వారిని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. విశేషం ఏమిటంటే తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఏర్పాటును ప్రకటించారు. తాజాగా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచార సంగ్రామంలో పార్టీ తలపెట్టిన మొదటి కార్యక్రమం కావడంతో జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు కాకినాడలో సమర శంఖారావం సభ ప్రాంగణంలో ఏర్పాట్లను ఆదివారం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, సమన్వయకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణు, దవులూరి దొరబాబు, అనంత ఉదయభాస్కర్ తదితరులు పరిశీలించారు. సమర శంఖారావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరగనుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని సర్పవరం జువెల్ మెడోస్ అపార్ట్మెంట్ వద్ద మధ్యాహ్నం 2.00 గంటలకు జరిగే సమర శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ముఖాముఖీ నిర్వహిస్తారని చెప్పారు. సమర శంఖారావం సభకు భారీ ఏర్పాట్లు చేసినట్టు రఘురామ్ వెల్లడించారు. -
11న కాకినాడలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం
తూర్పుగోదావరి, దానవాయిపేట, (రాజమహేంద్రవరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 11వ తేదీ న (సోమవారం) కాకినాడలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరంలోని హోటల్ రివర్‌బేలో ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ, రాజమహేంద్రవరం, పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్ పలు నియోజవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో సోమవారం కాకినాడలో నిర్వహించనున్న సమర శంఖారావం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సర్వేల పేరుతో సేకరించి ప్రైవేటు సంస్థకు అప్పగించారన్నారు. పౌరుల ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఒక ప్రయివేట్ సంస్ధ అయిన ఐటీ గ్రిడ్ వద్ద లభించడం ప్రజల వ్యక్తిగత వివరాల చోరీయే అవుతుందని ధ్వజమెత్తారు. డేటా చౌర్యం బయటపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌కు భయం మొదలయిందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు దీన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని, సిట్ ఏర్పాటుతో టీడీపీ వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ రాష్ట్ర ప్రోగాం కో అర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ మార్గాని భరత్, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, దవులూరి దొరబాబు, ఆకుల వీర్రాజు, పొన్నాడ సతీష్, జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రీజినల్ పోలింగ్ బూత్‌ల కన్వీనర్ బి.వి.ఆర్ చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి సబెళ్ళ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో సభా ప్రాంగణ ప్రాంతాన్ని పరిశీలించారు. -
నెల్లూరు : సమర శంఖారావం సభలో అశేషజనవాహిని
-
ఆ సంఘటన నన్ను కలచి వేసింది : వైఎస్ జగన్
-
ప్రజల వ్యక్తిగత డేటా చంద్రబాబు తన బినామీ కంపెనీలకు ఇచ్చారు
-
ఆ సంఘటన నన్ను కలచి వేసింది : వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా... ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకే వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. నాలుగున్నరేళ్లుగా బీజేపీతో అంటకాగిన బాబు ఏనాడు హోదా ఊసెత్తలేదని.. ఇప్పుడు మాత్రం నల్లచొక్కాలు వేసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా హోదా కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని పేరొన్నారు. హోదా అంశంలో మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను, పూటకో మాట మార్చే చంద్రబాబును నమ్మవద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఓట్లు తొలగిస్తూ నాటకాలు ఆడుతున్న టీడీపీ మోసాలు అరికట్టేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీవిజిల్ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. మంగళవారం నాటి సమర శంఖారావం సభకు నెల్లూరు జిల్లాలోని 10 నియోజక వర్గాల ప్రజలు, బూత్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ క్రమంలో జూలూరుపేట నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ప్రశ్నకు బదులుగా...దుగ్గరాజపట్నం పోర్టు కచ్చితంగా నిర్మిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామ సెక్రటేరియట్ ద్వారానే సుమారు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అవినీతికి తావు లేకుండా ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆ సంఘటన నన్ను కలచివేసింది.. నెల్లూరులో సాగిన పాదయాత్రలో భాగంగా మరచిపోలేని సంఘటన ఏదైనా ఉందా అని ఉదయగిరికి చెందిన సుబ్బారెడ్డి ప్రశ్నించగా... ‘పాదయాత్ర చేస్తున్నపుడు ఒక సంఘటన నన్ను కలచివేసింది. ఒక పెద్దాయన, పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ఆ అన్న పేరు గోపాల్ అనుకుంటా. వారి గుడిసెలో ఒక ఫొటోకు దండవేసి ఉంది. ఈ విషయం గురించి గోపాలన్న చెబుతూ... ‘అన్నా ఫ్లెక్సీలో దండవేసి ఉన్న వ్యక్తి నా కొడుకు. మంచి మార్కులు వచ్చేవి. అందుకే ఇంజనీరింగ్‌లో చేర్పించాలని ఆశపడ్డా. మమ్మల్ని పైకి తీసుకువస్తాడనుకున్నా. అయితే ఆ చదువుకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చయ్యేవి. ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా 30 నుంచి 35 వేలు మాత్రమే వచ్చేవి. రెండో ఏడాది అవి కూడా రాలేదు. దీంతో తన చదువు కోసం నేను అప్పులు చేయడం తట్టుకోలేక... నా కొడుకు కాలేజీకి వెళ్లి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అది నేను మరచిపోలేని సంఘటన. ఆరోజు నా కళ్లలో నీళ్లు వచ్చాయి’ అని వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. వారందరికీ హామీ ఇస్తున్నా.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించిన వైఎస్ జగన్... ‘గోపాల్ అన్నకు హామీ ఇచ్చినట్లుగా పేదరికం పోవాలంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. అందుకోసం ఫీజు రీయింబర్స్‌మెంటుకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా నేను చదివిస్తా. హాస్టల్లో ఉండే ప్రతీ పిల్లాడికి మెస్ చార్జీలకు సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. చిన్న పిల్లలను స్కూలుకు పంపిన తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయల సాయం చేస్తాం. అప్పులు చేయకుండానే తమ పిల్లలు చదువుకునే పరిస్థితి తీసుకువస్తా అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఓ దొంగ.. మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు : వైఎస్ జగన్
-
ఓ దొంగ.. మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు : వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు : ఏపీ ప్రజల సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన ఓ నేరగాడు, దొంగ, నారాసురుడు అనే రాక్షసుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ సమరశంఖారావం సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు స్వప్రయోజనాల కోసం మన సమాచారాన్ని అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో 20 లక్షల దొంగ ఓట్లు ఉంటే.. ఒక్క మన రాష్ట్రంలో 39 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా చంద్రబాబుకు చెందిన ప్రైవేటు కంపెనీల దగ్గర దొరుకుతోంది. ప్రభుత్వం దగ్గర ఉండే ఆధార్ డేటా ఇదే తరహాలో చోరికి గురైంది. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన ఎన్నికల డేటా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే తప్పు ఎవరిది. ప్రజల సున్నితమైన డేటా చోరీ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే మనల్ని, మన కార్యకర్తల్ని దూషిస్తారు. ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబు.. సరైన ఓట్లు చేర్పించమని అర్జీ పెడితే మనం వ్యవస్థలను నాశనం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తారు. మా సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి పరిస్థితులు నారా లోకేష్‌కు మాత్రం ఎదురుకావు’ అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో మంగళవారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన సమర శంఖారావ సభకు 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సభకు హాజరైన వైఎస్ జగన్ మొదట సభా ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశేషజనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అధికారంలోకి రాగానే కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా అందరినీ ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. అధికార పార్టీ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. అప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా వైఎస్ జగన్ ప్రసంగం కొనసాగిస్తూ... ‘చంద్రబాబు నిర్వాకం వల్ల మీ బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఆధార్ నంబర్లు ప్రైవేటు ఐటీ కంపెనీలైన బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ చేతుల్లో ఉన్నాయి. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను తయారు చేసింది కూడా ఈ కంపెనీలే. వీరి వద్దకు ప్రజల వ్యక్తిగత డేటా ఎలా వెళ్లింది. ఇవి రెండూ చంద్రబాబు బినామీ కంపెనీలు. ఇలాంటి నేరం సాధారణ వ్యక్తి చేసి ఉంటే అతడిని దొంగ అంటాం. కానీ మన ఖర్మ ఏంటంటే డేటా దొంగిలించిన వ్యక్తిని మనం సీఎం అంటున్నాం. ఆయన కొడుకును ఐటీ మంత్రి అంటున్నాం’ అని ఎద్దేవా చేశారు. టీడీపీ సేవామిత్ర యాప్‌నకు ఆధార్, ఫొటో లిస్టు, బ్యాంకు అకౌంట్లు అనుసంధానం చేసి తమకు అనుకూలంగా లేని ఓట్లను టీడీపీ తొలగిస్తోంది. డేటా ఎలా బయటకు వెళ్లిందని ప్రశిస్తే బాబు వాటికి సమాధానం చెప్పట్లేదు. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా, హైదరాబాద్ నేనే నిర్మించా అని పొంతన లేకుండా మాట్లాడతారు. తనకు తెలియని డేటానా అంటూ చిందులు వేస్తారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినపుడు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే తరహాలో తప్పించుకోవాలని చూస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఆంధ్రా కంపెనీలపై.. తెలంగాణ పోలీసుల దాడులు ఏంటని పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు’ అని మండిపడ్డారు. నారాసుర పాలన చూస్తున్నాం.. ‘టీడీపీకి మద్దతు పలకని ప్రజలకు రేషన్ కట్ చేస్తున్నారు. పెన్షన్ తొలగిస్తున్నారు. పేదవాళ్లు కట్టుకున్న ఇళ్లకు కూడా డబ్బు ఇవ్వడం లేదు. వెట్‌ల్యాండ్ పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతగా అధికార దాహం ఉన్న చంద్రబాబు భవిష్యత్తులో ఓటు వేయలేదని మనుషులను చంపేయడం, గ్రామాలను తగలబెట్టడం కూడా చేస్తారేమో. ప్రస్తుతం రాష్ట్రంలో నారాసుర పరిపాలన చూస్తున్నాం’ అని వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టారు. రోజుకో కొత్త సినిమా... ఫ్లాపు సినిమాలు తీసే చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తుంటే ఓటమి భయంతో సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే... ‘గుంటూరు సభలో తాము పెన్షన్ రెండింతలు చేస్తామని హామీ ఇస్తే.. ఎన్నికల ముందు పెన్షన్ పెంచినట్టు సినిమా చూపిస్తున్నారన్నారు. ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని.. ఆటోలకు, ట్యాక్సీలకు ఏడాదికి పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం. అయితే ఇప్పుడే మేల్కొన్న చంద్రబాబు.. నిస్సిగ్గుగా మా పథకాలు కాపీ కొట్టారు. ఆటో డ్రైవర్ల కాకీ చొక్కా లాక్కొని ఫొటోలకు ఫోజులిచ్చారు. 2013లో బీసీ డిక్లరేషన్‌లో ఒక్క నిర్ణయం కూడా అమలు చేయని చంద్రబాబు... ఎన్నికల కోసమే రాజమండ్రిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు’ అని వైఎస్ జగన్ విమర్శించారు. బుల్లెట్ ట్రైన్ ఏమయ్యింది బాబు...? చంద్రబాబు తన మొదటి సినిమాలో భాగంగా... ‘2014 ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ధరల స్థిరీకరణ, కేజీ నుంచి పీజీ వరకు మన పిల్లలకు ఉచిత విద్య అన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం.. లేకపోతే నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా ఏపీపీఎస్సీసీ నోటిఫికేషన్లు.. ఉద్యోగాలన్నీ భర్తీ, ప్రతి ఇంటికి రూ. 2 కే 20 లీటర్లు మంచినీరు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు..15 ఏళ్ళు కావాలి. వాల్మీకి, కురువులను ఎస్టీలుగా... రజకులను ఎస్సీలుగా... గాండ్లను ఎస్సీలుగా.. మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేరుస్తా. మూడేళ్ళలోనే పోలవరం పూర్తి చేస్తా. ఆపదలో మహిళలకు 5 నిమిషాల్లో సాయం. ఆంధ్ర రాష్ట్రానికి బులెట్ ట్రైన్ తెస్తా’ అని హామీలు ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా తన మ్యానిఫెస్టోలోని ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా.. మట్టి, ఇసుక, బొగ్గు, భూములు, గుడి భూములు, కరెంటు కొనుగోళ్ళు.. అంటూ ఎక్కడికక్కడ దోచేశారని మండిపడ్డారు. -
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగే వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకి వైఎస్ జగన్ బయలుదేరారు. సమర శంఖారావ సభకు ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో సభ జరిగే ఎస్వీజీఎస్ మైదానం వద్దకు జగన్ చేరుకోనున్నారు. -
ప్రజలు ఏమాత్రం టీడీపీని నమ్మరు