ఏపీ రాజకీయాలకు రాజధాని వంటి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ జగ్గంపేట సమన్వయకర్త జ్యోతుల చంటిబాబు అన్నారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగానే వైఎస్ జగన్ తొలుత కాకినాడులో సభ నిర్వహించడం తమ జిల్లా అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తమ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని, జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించితీరుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.