Jyothula Chanti Babu
-
జగ్గంపేట : నూతన వధువరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసానికి వెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. అంతకు ముందు ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు,ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. -
రేపు రాజమండ్రికి సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రాజమండ్రికి వెళ్లనున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు హెలికాప్టర్లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. స్థానిక నేతలతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు మంజీరా కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తర్వాత 4.25 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మాధవి లత, ఎస్పీ సతీష్ పరిశీలించారు. చదవండి: సీఎం జగన్ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు -
బాబూ.. మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?
జగ్గంపేట: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఉన్న ఆస్తులు, ఇప్పటి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సవాల్ చేశారు. చంద్రబాబునాయుడు జగ్గంపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. జగ్గంపేటలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై చేసిన అవినీతి ఆరోపణల్ని చంద్రబాబునాయుడు నిరూపించాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. రాజకీయ వ్యభిచారం చేసేవారు రాసిచ్చిన స్క్రిప్టు చదివేటప్పుడు చంద్రబాబు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. రూ.35 కోట్లు తీసుకుని పార్టీ ఫిరాయించిన వ్యక్తుల వల్లే జగ్గంపేటలో టీడీపీ నాశనమైందని పరోక్షంగా జ్యోతుల నెహ్రూను, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ను విమర్శించారు. చంద్రబాబుకు విలువలు లేవని, పార్టీని నమ్ముకున్నవారిని ముంచేసి సర్వనాశనం చేస్తారని, దానికి తానే నిదర్శనమని చెప్పారు. రెండుసార్లు టీడీపీ నుంచి పోటీచేసి ఆర్థికంగా నష్టపోయానన్నారు. విలువ, చిత్తశుద్ధిలేని రాజకీయాలను భరించలేక.. ఆత్మాభిమానం చంపుకోలేక 2017లో టీడీపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అన్నమాటకు కట్టుబడి విలువలతో కూడిన రాజకీయం చేయడం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లక్షణమని, సీఎం జగన్‌ది అదే లక్షణమని తెలిపారు. అందుకే ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మార్చే నైజం చంద్రబాబుదని విమర్శించారు. జిల్లాలో చాలామంది టీడీపీ నేతలు చంద్రబాబు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. చంద్రబాబును నమ్ముకుంటే నష్టపోతారని పేర్కొన్నారు. -
చంద్రబాబే పెద్ద అనకొండ: ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
-
చంద్రబాబుకు జ్యోతుల చంటిబాబు సవాల్
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబే పెద్ద అనకొండ అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జోత్యుల చంటిబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నా ఆస్తులపై చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అని చంటిబాబు దుయ్యబట్టారు. ‘‘టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో బాబుకే తెలియడం లేదు. చంద్రబాబును నమ్మి చాలామంది నాశనమైపోయారు. బాబును నమ్మి బొడ్డు భాస్కర రామారావు కృంగిపోయి చనిపోయారు. జ్యోతుల నెహ్రూను జగ్గంపేట నుంచి నిలబెట్టే దమ్ముందా?’’ అంటూ చంద్రబాబుపై చంటిబాబు మండిపడ్డారు. చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం -
చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయం: ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
-
వైఎస్సార్‌సీసీలోకి భారీగా చేరికలు
సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైఎస్సార్సీసీలో చేరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిస్తాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. విజయవాడలో 13 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు దొరికిందంటే అది స్పందన కార్యక్రమం వల్లనే అని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. -
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం
-
‘ఆ క్షణం కోసం యావత్ ఏపీ ఎదురుచూస్తోంది’
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీ రాజకీయాలకు రాజధాని వంటి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ జగ్గంపేట సమన్వయకర్త జ్యోతుల చంటిబాబు అన్నారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ సమరశంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగానే వైఎస్ జగన్ తొలుత కాకినాడులో సభ నిర్వహించడం తమ జిల్లా అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తమ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని, జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించితీరుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం మాట తప్పకుండా పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. హోదా వస్తే కార్మికులకు ఉపాధి దొరుకుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని చంటిబాబు వివరించారు. ఏపీ అభివృద్ధి జరిగే విధంగా తమ నాయకుడి నిర్ణయాలు ఉంటాయిని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పే విధంగా భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని యావత్ ఏపీ రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని వైఎస్సార్సీపీ ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ అన్నారు. తమ పార్టీకి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరిని వైఎస్ జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు మనందరికీ దిశానిర్ధేశం చేయడానికి వైఎస్ జగన్ ఇక్కడి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లడానికి నవరత్నాలు పథకంతో మనకు ప్రజా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. -
పార్టీ గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలి
-
వైఎస్ఆర్సీపీలో చేరిన జ్యోతుల చంటిబాబు
-
వైఎస్ఆర్ సీపీలోకి జ్యోతుల చంటిబాబు
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన జ్యోతుల చంటిబాబు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా టీడీపీ జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు ఉన్న జ్యోతుల చంటిబాబు కొంతకాలం క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. అంతేకాకుండా టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి అనంతరం జ్యోతుల నెహ్రు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే జ్యోతుల నెహ్రు పునరాగమనంపై అసంతృప్తిగా ఉండటమే కాకుండా, చంద్రబాబు అవలంభించిన వైఖరి, టీడీపీలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో ఆ పార్టీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు తన మద్దతుదారుల నిర్ణయం మేరకే వైఎస్ఆర్ సీపీలో చేరినట్లు జ్యోతుల చంటిబాబు తెలిపారు. -
టీడీపీకి జ్యోతుల గుడ్ బై
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తన మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. టీడీపీలోకి జ్యోతుల నెహ్రు పునరాగమనంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రు, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ పెత్తనం పెరగడంతో ఆయన పార్టీలో ఇమడలేకపోయారని వార్తలు వస్తున్నాయి. తన పట్ల పార్టీ అధినేత చంద్రబాబు అవలంభిస్తున్న వైఖరి, గత కొంతకాలంగా తనను పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తన తండ్రి చనిపోయినా టీడీపీ నేతలెవరూ కనీసం సానుభూతి తెలపకపోవడం ఆయనను ఆవేదనకు గురిచేసింది. పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పనులను సీఎం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభకు తనను ఆహ్వానించకపోవడంతో ఆయన కలత చెందినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో టీడీపీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం పట్ల చంద్రబాబు సర్కారు అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా కాపు నేతలు టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో తాజా పరిణామాలు అధికార పార్టీ నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయి. -
టీడీపీకి జ్యోతుల గుడ్ బై
-
‘దేశం’లో తోటాకు మంట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ మంత్రి తోట తెలుగుదేశం పార్టీలో చేరీ చేరగానే కాకినాడ పార్లమెంటు సీటు తనదేనంటూ పార్టీలో అన్నీ తానే అన్నట్టు ప్రకటించుకోవడం టీడీపీలో కొత్త చిచ్చురేపింది. అసలు తోట టీడీపీలోకి రావడంతోనే వివాదాలు మొదలయ్యాయని కేడర్ తలపట్టుకుంటోంది. తుది వరకు కాంగ్రెస్‌ను వీడేది లేదని ఇటీవలే ప్రగల్భాలు పలికిన తోట ఇంతలోనే ప్లేటు ఫిరాయించి మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో దౌత్యం నడిపించి, టీడీపీ పంచన చేరారు. ఆ పార్టీ తరఫున జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు కూడా ప్రచారమైంది. దీంతో.. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి పాలై, తిరిగి టిక్కెట్టుపై ఆశతో ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు వర్గీయులు కన్నెర్రజేశారు. ఈ నేపథ్యంలో చంటిబాబు 24 గంటల అల్టిమేటమ్ ఇవ్వడంతో దిగొచ్చిన చంద్రబాబు చర్చలకు పిలిచి, జగ్గంపేట టిక్కెట్టు మరెవరికీ ఇచ్చేది లేదని చంటిబాబుకు చెప్పారు. ఇక ఆ సమస్య సద్దుమణిగిందని పార్టీ నేతలంతా కుదుటపడుతున్న తరుణంలో తోట తెలుగుదేశం పార్టీలో కొత్త చిచ్చు రేపారు. టీడీపీని ముంచేస్తారా? కాకినాడ ఎంపీ సీటు తనదేనని జిల్లా ముఖ్య నేతల సమక్షంలోనే తోట ప్రకటించ డం పార్టీ జిల్లా నాయకత్వాన్ని అవమానించినట్టు కేడర్ భావిస్తోంది. ‘కేడర్ లెస్ లీడర్’గా మిగిలిన తోట అక్కడ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి ఇప్పుడు ఇక్కడ టీడీపీని కూడా నట్టేట ముంచేసే ఎత్తుగడలో ఉన్నట్టు కనిపిస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాకినాడ సీటు తనదేనని ప్రకటించుకోవడం ద్వారా తమను అవమానించినట్టు పార్టీ జిల్లా నాయకత్వం భావిస్తోంది. కాకినాడ పార్లమెంటు సీటుపై ఆశలు పెంచుకుని, గడచిన ఆరేడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వంను రేసు నుంచి తప్పించేందుకు మామా, అల్లుళ్లైన మెట్ల, తోట ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నరసింహానికి అంత సీన్ లేదు.. గతంలో తునిలో నిర్వహించిన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో విశ్వంను ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు నేతలకు పరిచయం చేశారు. అంతకంటే ముందు పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి అని ప్రకటించారు. పెద్దాపురం టిక్కెట్టు కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనే నిర్ణయంతో విశ్వం సీటు పెద్దాపురం నుంచి ఒకసారి పిఠాపురం అని, మరోసారి కాకినాడ రూరల్ అని..మార్చి, మార్చి ఇప్పుడు కాకినాడ ఎంపీ సీటుకు కూడా ఎసరు పెడుతున్నారని ఆయన అనుచరులు, కైట్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాకు దిగడంతో పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. నరసింహం టీడీపీలోకి రావడంతో ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి మానసిక స్థిమితం లేకుండా చేస్తున్నారని నేతలు ఆవేదన చెందుతున్నారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి మందాల గంగ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పతో.. ధర్నా చేస్తున్న విశ్వం అనుచరులను ఉద్దేశించి ఫోన్లో మాట్లాడించారు. ఈ విషయాలన్నీ తరచి చూస్తే కాకినాడ ఎంపీ సీటు తనదేనంటున్న తోటకు పార్టీలో తన సీటు తానే ప్రకటించుకునేంత సీన్ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు. పార్టీ అధిష్టానం కాకినాడ పార్లమెంటు సీటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఎవరికీ ప్రకటించలేదని రాజప్ప విశ్వం అనుచరులకు చెప్పడం పార్టీలో మరింత గందరగోళానికి దారితీసింది. అసలు తోటను పార్టీలోకి ఆహ్వానించడమెందుకు, ఆ కారణంగా పార్టీని ఎన్నటి నుంచో నమ్ముకున్న నేతల్లో అభద్రతను సృష్టించడం ఎందుకని.. అధినేత తీరుపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.