సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబే పెద్ద అనకొండ అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జోత్యుల చంటిబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నా ఆస్తులపై చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అని చంటిబాబు దుయ్యబట్టారు.
‘‘టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో బాబుకే తెలియడం లేదు. చంద్రబాబును నమ్మి చాలామంది నాశనమైపోయారు. బాబును నమ్మి బొడ్డు భాస్కర రామారావు కృంగిపోయి చనిపోయారు. జ్యోతుల నెహ్రూను జగ్గంపేట నుంచి నిలబెట్టే దమ్ముందా?’’ అంటూ చంద్రబాబుపై చంటిబాబు మండిపడ్డారు.
చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం
Comments
Please login to add a commentAdd a comment