
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన జ్యోతుల చంటిబాబు సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా టీడీపీ జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు ఉన్న జ్యోతుల చంటిబాబు కొంతకాలం క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. అంతేకాకుండా టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి అనంతరం జ్యోతుల నెహ్రు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే జ్యోతుల నెహ్రు పునరాగమనంపై అసంతృప్తిగా ఉండటమే కాకుండా, చంద్రబాబు అవలంభించిన వైఖరి, టీడీపీలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో ఆ పార్టీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు తన మద్దతుదారుల నిర్ణయం మేరకే వైఎస్‌ఆర్ సీపీలో చేరినట్లు జ్యోతుల చంటిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment