jaggampeta
-
సామాన్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సరిపోరా..?
డబ్బులతో పాలిటిక్స్ చేయనంటూ ఉపన్యాసాలిచ్చే జనసేనాని.. రూటు మార్చేశారు.. విలువలను తుంగలో తొక్కేసి డబ్బున్న వారికే టికెట్లు అంటూ తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నారు.. రాజకీయాల్లో రానున్న కాలంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనంటూ ఇటీవల భీమవరంలో నేతలతో జరిగిన సమావేశంలో తన వ్యాఖ్యలు పచ్చి నిజాలేనని నిరూపిస్తూ.. జనసేన జగ్గంపేట ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్రకు పవన్ పెద్దషాకే ఇచ్చారు. తన లాంటి సామాన్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి సరిపోరా అంటూ జనసేన జగ్గంపేట ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన సంయుక్తంగా పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి ప్రకటించారు. 2019 నుంచి జనసేనలో తిరుగుతూ నియోజకవర్గంలోని పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు టిక్కెట్టు కేటాయించపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. సామాన్యుడిగా పుట్టి రబ్బరు చెప్పులు వేసుకనే తాను ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడం తగదేమోనన్నారు. తనలా సామాన్యుడిగా పుట్టి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించే యువతకు తన జీవితం గుణపాఠం కావాలన్నారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదంటూ ఆయన ఆమరణ నిరాహార దీక్కుదిగారు. -
జగ్గంపేట నియోజకవర్గంలో మళ్లీ వైఎస్ఆర్సీపీదే గెలుపు: నరసింహం
-
రానున్న మూడు నెలలకాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తా: తోట నరసింహం
-
జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ
సాక్షి, కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల స్పష్టం చేయడంతో సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. దీంతో జ్యోతుల తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. జనసేన-టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. కాగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వెలుపల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. గత మంగళవారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగారు.. తాజాగా జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు -
జగ్గంపేట : నూతన వధువరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసానికి వెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. అంతకు ముందు ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు,ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. -
రేపు రాజమండ్రికి సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రాజమండ్రికి వెళ్లనున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు హెలికాప్టర్లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. స్థానిక నేతలతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు మంజీరా కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తర్వాత 4.25 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మాధవి లత, ఎస్పీ సతీష్ పరిశీలించారు. చదవండి: సీఎం జగన్ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు -
బాబూ.. రాష్ట్రంలో ఇల్లు కట్టుకోండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు జగ్గంపేటలో చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విభిన్న వర్గాల నుంచి ఒక్కొక్కరితో మాట్లాడించి వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే ప్రధాన అజెండా అని ఆ పార్టీ నాయకులు తొలుతే ప్రకటించారు. సమావేశంలో ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ వారి అభిప్రాయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో గోకవరం మండలం కృష్ణునిపాలెం మాజీ సర్పంచ్ ప్రశాంతకుమార్ హలోనిన్ (కన్నబాబు) వంతు వచ్చింది. మైకు చేత్తో పట్టుకుని ‘అయ్యా.. గౌరవ అధ్యక్షుల వారికి ఒక విన్నపం. ఇది నా ఒక్కడి విన్నపమే కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిదీ. ముఖ్యంగా మన కార్యకర్తలందరిదీ. మీరు ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే నివాసం ఉండాలి’ అని విన్నవించారు. దీంతో వేదికపై ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా బిత్తరపోయి అటూ ఇటూ చూశారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి చెవిలో ఏదో చెప్పారు. అనంతరం మరొకరు మాట్లాడాలంటూ ఆయన సూచించారు. -
బాబూ.. మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?
జగ్గంపేట: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఉన్న ఆస్తులు, ఇప్పటి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సవాల్ చేశారు. చంద్రబాబునాయుడు జగ్గంపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. జగ్గంపేటలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై చేసిన అవినీతి ఆరోపణల్ని చంద్రబాబునాయుడు నిరూపించాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. రాజకీయ వ్యభిచారం చేసేవారు రాసిచ్చిన స్క్రిప్టు చదివేటప్పుడు చంద్రబాబు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. రూ.35 కోట్లు తీసుకుని పార్టీ ఫిరాయించిన వ్యక్తుల వల్లే జగ్గంపేటలో టీడీపీ నాశనమైందని పరోక్షంగా జ్యోతుల నెహ్రూను, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ను విమర్శించారు. చంద్రబాబుకు విలువలు లేవని, పార్టీని నమ్ముకున్నవారిని ముంచేసి సర్వనాశనం చేస్తారని, దానికి తానే నిదర్శనమని చెప్పారు. రెండుసార్లు టీడీపీ నుంచి పోటీచేసి ఆర్థికంగా నష్టపోయానన్నారు. విలువ, చిత్తశుద్ధిలేని రాజకీయాలను భరించలేక.. ఆత్మాభిమానం చంపుకోలేక 2017లో టీడీపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అన్నమాటకు కట్టుబడి విలువలతో కూడిన రాజకీయం చేయడం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లక్షణమని, సీఎం జగన్‌ది అదే లక్షణమని తెలిపారు. అందుకే ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మార్చే నైజం చంద్రబాబుదని విమర్శించారు. జిల్లాలో చాలామంది టీడీపీ నేతలు చంద్రబాబు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. చంద్రబాబును నమ్ముకుంటే నష్టపోతారని పేర్కొన్నారు. -
బిగ్ క్వశ్చన్: బాబు రోడ్డెక్కినా ఫలితం లేదని జగ్గంపేటలో తేలిపోయిందా?
-
చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయం: ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
-
జగ్గంపేటలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్
-
విడదీయాలని చూస్తున్న జ్యోతుల నెహ్రు: ప్రేమజంట
-
'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట ఆరోపిస్తోంది. తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వివరాల్లోకెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అపర్ణ తల్లిదండ్రులకు తెలపగా వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారు కూకట్పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. అపర్ణ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు తూర్పుగోదావరి గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను సంప్రదించగా, తాను సురక్షితంగా ఉన్నానని తెలిపింది. అయితే విచారణలో భాగంగా గండేపల్లి రావాలని పోలీసులు కోరారు. చదవండి: (అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?) తల్లిదండ్రులనుంచి ఇబ్బంది కలుగుతోందని భావించిన ప్రేమజంట విశాఖలోని మహిళా చేతన ప్రతినిధులను సంప్రదించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లాకు పంపాలని చేతన కన్వినర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మహిళా చేతన కన్వినర్ కత్తి పద్మ మాట్లాడుతూ.. 'ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని జగ్గంపేట రావాలని జ్యోతుల నెహ్రూ ఒత్తిడి చేయడం సరికాదు. నిజంగా ఆయనకు చట్టంఐ గౌరవం ఉంటే విశాఖపట్నం రావచ్చు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడితే అంగీకరించే పరిస్థితి లేదు' అని కన్వినర్ కత్తి పద్మ అన్నారు. ఈ విషయంపై అపర్ణను సంప్రదించగా.. 'వివాహం విషయంలో మా బంధువులు బ్లాక్ మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా కుటుంబానికి బంధువులు. ఆయన మాపై ఒత్తిడి తెస్తున్నారు. జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే మాకు ప్రమాదం ఉంది' అని అపర్ణ తెలిపింది. -
అదిగో అరుదైన ‘అతిథి’ ఎర్ర బొరవ!
సాక్షి, అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్ గ్రిఫన్)గా పిలిచే దీనిని పర్యావరణవేత్త, బర్డ్ వాచర్ జిమ్మీ కార్టర్ గుర్తించి తన కెమేరాలో బంధించారు. ఆఫ్రికా, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాలు, మన దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ జాతి రాబందులు ఎక్కువగా కనిపిస్తాయి. దీని రెండు ఉప జాతుల్లో ఒకటి యూరోప్‌లో, రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొండల్లో గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తాయి. పశువుల కళేబరాల్లో డైక్లోఫినాక్ వంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తినడం వల్ల మన దేశంలో 95 శాతం ఈ రాబందులు అంతరించిపోయాయి. ఎప్పుడో ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ జాతి రాబందులు దక్షిణ భారత దేశంలోకి చాలా అరుదుగా వస్తాయి. రికార్డుల ప్రకారం ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి వచ్చినట్టు నమోదైంది. పదేళ్ల కిందట మొదటిసారిగా శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద కనిపించగా, నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద రెండోసారి కనబడినట్టు రికార్డుల్లో నమోదైంది. -
అదిగో అరుదైన ‘అతిథి’
సాక్షి, అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్ గ్రిఫిన్)గా పిలిచే దీనిని పర్యావరణవేత్త, బర్డ్ వాచర్ జిమ్మీ కార్టర్ గుర్తించి తన కెమేరాలో బంధించారు. ఆఫ్రికా, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాలు, మన దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ జాతి రాబందులు ఎక్కువగా కనిపిస్తాయి. దీని రెండు ఉప జాతుల్లో ఒకటి యూరోప్‌లో, రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొండల్లో గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తాయి. పశువుల కళేబరాల్లో డైక్లోఫినాక్ వంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తినడం వల్ల మన దేశంలో 95 శాతం అంతరించిపోయాయి. ఎప్పుడో ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ జాతి రాబందులు దక్షిణ భారత దేశంలోకి చాలా అరుదుగా వస్తాయి. రికార్డుల ప్రకారం ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి వచ్చినట్టు నమోదైంది. పదేళ్ల కిందట మొదటిసారిగా శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద కనిపించగా, నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద రెండోసారి కనబడినట్టు రికార్డుల్లో నమోదైంది. -
అయ్యో! కొడుకా..
ఆ కుటుంబాలకు ఆ యువకులే ఆధారం.. తల్లిదండ్రుల ఆశలన్నీ వారిపైనే.. ఓ యువకుడు తన స్నేహితుడితో కలసి శుభకార్యానికి వెళుతుండగా కారు అదుపుతప్పి పంట కాలువలో పడి మృత్యువాత పడితే.. మరో యువకుడు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం వద్ద, జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. 25 ఏళ్ల యువకుల జీవితాలను చిదిమేశాయి. శుభకార్యానికి వెళ్లి.. మలికిపురం: సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన నక్కా హరీష్(25) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నక్కా హరీష్ స్నేహితుడితో కలసి కారులో ఆదివారం రాత్రి సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గ్రామంలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో టేకిశెట్టిపాలెం వచ్చే సరికి కారు అదుపు తప్పి పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న గుర్రం జాన్ వెస్లీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పట్టాడు. హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. (చదవండి: ఉరితాడు కోసి.. ఊపిరి పోసి ) ఒక్కగానొక్క కొడుకు.. గుడిమెళ్లంక గ్రామానికి చెందిన నక్కా తులసీరావు, నాగమణికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు హరీష్ ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితమే భర్త తులసీరావు చనిపోవడంతో నాగమణి విదేశాలకు వెళ్లి ఉపాధి పొందుతూ కుటుంబ పోషణ చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. కుమారుడు హరీష్‌ను ఎంసీఏ చదివించింది. భర్త చని పోయినా కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశ పడిన ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. కుమారుడు మరణ వార్త తెలుసుకున్న నాగమణి కువైట్ నుంచి దుఃఖంతో స్వస్థలం బయల్దేరింది. కాలువలో పడిన కారు మృతుడు నక్కా హరీష్ రామవరంలో కారు ఢీకొని.. జగ్గంపేట: జాతీయ రహదారి–16పై జగ్గంపేట శివారు భగత్‌సింగ్ నగర్ వద్ద కారు ఢీ కొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళుతున్న కియో కారు జగ్గంపేట శివారు భగత్ సింగ్ నగర్ వద్దకు వచ్చేసరికి మోటారు సైకిల్‌పై రోడ్డు దాటుతున్న రామవరానికి చెందిన ఏడాకుల మధుబాబు(25)ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ నుజ్జునుజ్జుయ్యి, కారు ముందుభాగం కూడా బాగా దెబ్బతింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై కేసు నమోదు చేశారు. కుటుంబానికి అతడే ఆధారం మధుబాబు ట్రాక్టర్ డ్రైవర్. కుటుంబానికి అతడే ఆధారం. టవర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మధుబాబు తల్లితోపాటు టవర్ కాలనీలో నివాస ముంటున్నాడు. అతడి తండ్రి హైదరాబాద్‌లో చిన్న కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి మధుబాబే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహం చేయాలని భావిస్తున్న తరుణంలో మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు బోరున విలపించడం అందరిని కలిచివేసింది. రోజు ట్రాక్టర్ పై వెళ్లే వాడని, ఈ రోజు పనిలేదని తిరిగి వచ్చి జగ్గంపేట వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు విలపించారు. -
చదివింది ఎంబీఏ.. చేసేది పార్ట్‌టైమ్ చోరీలు
సాక్షి, జగ్గంపేట: తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన, జల్సాలకు అలవాటు పడి, చదువుకున్న చదువును కాదని నేర ప్రవృత్తిని ఎంచుకున్న యువకుడు చోరీలకు పాల్పడతూ పోలీసులకు చిక్కాడు. ఇతడి వద్ద నుంచి పోలీసులు రూ.రెండు లక్షల విలువైన 52 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు జగ్గంపేట పోలీసుస్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. జగ్గంపేటకు చెందిన మేడిశెట్టి మణికంఠ అనే యువకుడు పాత నేరస్తుడు. ఇతను ఎంబీఏ వరకు విశాఖపట్టణంలో చదివి పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ నేరాలు కూడా పార్ట్‌టైమ్‌గా ప్రారంభించాడు. 2016లో విశాఖలోని మువ్వలపాలెం పోలీసుస్టేషన్లో మొదటి కేసు నమోదైంది. 2018లో మరో మూడు కేసుల్లో మణికంఠ ముద్దాయిగా ఉన్నాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్ పారిపోయాడు. గత జూలైలో జగ్గంపేటలో జరిగిన పలు నేరాలు, చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేటలో ఈనెల రెండో తేదీ సోమవారం పాత నేరస్తుడు మణికంఠ కానిస్టేబుళ్ల కంటపడడంతో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ బృందం పట్టుకున్నారు. జగ్గంపేటలో జరిగిన రెండు నేరాలతో పాటు మరికొన్ని నేరాలకు సంబంధించిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. పాతనేరస్తుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో చొరవ చూపిన జగ్గంపేట హోంగార్డు కొండబాబుకు రూ.రెండు వేల రివార్డు అందించారు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్‌సీసీలోకి భారీగా చేరికలు
సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైఎస్సార్సీసీలో చేరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిస్తాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. విజయవాడలో 13 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు దొరికిందంటే అది స్పందన కార్యక్రమం వల్లనే అని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. -
కొడుకును చంపిన తండ్రి
చుట్ట ఇవ్వలేదన్న కోపంతో బిక్కవోలు మండలం కొంకుదురులో ఓ తండ్రి క్షణికావేశంలో తన తయుడుని హతమార్చగా.., కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురంలో మరో తండ్రి కుమారుడి వేధింపులు భరించలేక అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో సంచలనమయ్యాయి. సాక్షి బిక్కవోలు (తూర్పుగోదావరి): ఓ చుట్ట కోసం కొడుకుతో తగాదా పెట్టుకున్న తండ్రి క్షణికావేశంలో కర్రతో తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయిన ఘటన బిక్కవోలు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ శివారులో ఉన్న ఇటుక బట్టిలో పని చేయడానికి నాలుగు నెలల కిందట జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పాక చంటి, అతని రెండో భార్య అర్జమ్మ వచ్చారు. గురువారం రాత్రి తండ్రి చుట్ట ఇమ్మని కొడుకుని అడిగితే ఇంట్లో బియ్యం పెట్టె మీద ఉంది తీసుకోమన్నాడు. అది కనిపించలేదు. దీంతో కొడుకు మీద కొప్పడ్డాడు. ఇలా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో తండ్రి కోపంతో కర్ర తీసుకువచ్చి కొడుకు నాగు (24)తలపై కొట్టాడు. ఆ దెబ్బకు తల పగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసికెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి సమాచారం మేరకు బిక్కవోలు పోలీసులు శుక్రవారం ఉదయం అనపర్తి సీఐ ఎన్వీ భాస్కరరావు, ఎస్త్సె పి.వాసు, వీఆర్వో రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు చంటి పరారీలో ఉన్నాడని ఎస్త్సె పి.వాసు తెలిపారు. కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం కిర్లంపూడి (జగ్గంపేట): కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మండలంలోని ఎస్ తిమ్మాపురం గ్రామంలో జరిగింది. కిర్లంపూడి ఎస్సై జి అప్పలరాజు కథనం ప్రకారం.. ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన నక్కా పెదఅప్పారావుకి నలుగురు కుమారులు ఉన్నారు. ఇతడు ప్రతినెలా వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్నాడు. ప్రతినెలా పెద్ద కొడుకు నక్కా పెద సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు తండ్రి వద్ద నుంచి బలవంతంగా పింఛను డబ్బులు గుంజుకుంటున్నాడు. ఈ నెలలో అలా చేయడంతో పెదఅప్పారావు కొడుకు సత్తిబాబుపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడి ముఖంపై బలమైన గాయమవ్వడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగో కుమారుడు నక్కా శివ ఫిర్యాదు మేరకు తండ్రి నక్కా పెదఅప్పారావుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.అప్పలరాజు తెలిపారు. -
అమ్మా.. నేనే ఎందుకిలా..!
చిరుప్రాయంలోనే కేన్సర్ కాటు బడికెళ్లే వయసులో బతుకంటే భయం భయం భవిత వైపు అడుగులు పడుతున్న వేళ... విధి లీల కన్నకూతురి కోసం తల్లడిల్లుతున్న కన్నపేగులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు చెంగుచెంగున లేడిపిల్లలా గంతులేయాల్సిన...వీధుల్లోనూ, క్రీడా మైదానంలోనూ ఆటలాడాలి్సన వయసుబడి గంట మోగగానే ఇంటికి పరుగులు తీసి,అమ్మకు తోడుగా పనిలో సాయం చేసే మంచి మనసు చదువుపైనే ధ్యాస పెట్టి... ఉన్నతస్థానాలు అధిరోహించి భవితకు బంగారు బాటలేసుకొనే తరుణం కానీ...ఎందుకిలా...నాతో కలిసి తిరిగే నా స్నేహితులు దూరమవుతున్నారునా చుట్టూ ఉండేవారంతా జాలి చూపులు చూస్తున్నారుఆటకు వెళ్తే వద్దంటూ వారిస్తున్నారు.పుస్తకాల సంచి భుజాన వేసుకుంటే ఇంకొకరు సాయంఆయాసం వస్తే అందరిలో అదిరిపాటుఅమ్మా...ఏమవుతోందమ్మా నాలో...!స్కూల్‌కు టైం అయింది...ఇంకా లేవవేమే అని రుసరుసలాడే అమ్మ రెడీ అవమ్మా...సూ్కల్లో దింపేస్తాననే నాన్నఆ మాటే అనడం లేదు...సూ్కల్‌కు వెళ్తానంటేఈ రోజు వద్దులేమ్మా...కాసేపు పడుకో అనిసలహాలెందుకు ఇస్తున్నారో..! సాక్షి, తూర్పుగోదావరి: ఆమెకు చదువంటే ప్రాణం.. ఆటలన్నా అంతే ఇష్టం.. అందుకే రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే విధి ఆడిన ఆటలో ప్రస్తుతం నలిగిపోతోంది. థైరాయిడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిని చూసి కన్నతల్లిదండ్రులు కుంగిపోతున్నారు. దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. మరోవైపు తమ తోటి విద్యార్థి శస్త్రచికిత్స కోసం ఆ పాఠశాల విద్యార్థులు కదిలారు. తమకు తోచిన సాయం చేసే పనిలో పడ్డారు. అలాగే భవాని చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థి ఆరోగ్యం కుదుటపడేందుకు తాము కూడా సహకరిస్తామని చెబుతున్నారు అమ్మా, నాన్నా ఏమైంది నాకు? ఆ బాలిక మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు పధ్నాలుగేళ్లకే వచ్చింది పెద్ద కష్టం ఏదో నొప్పి అని వైద్యుల చెంతకు వెళ్తేకేన్సర్ కాటేయబోతోందంటూ పిడుగులాంటి వార్తశస్త్ర చికిత్స, రేడియేషన్లతో నరకం తగ్గుతుందేమోననుకుంటే మరో శస్త్రచికిత్స అవసరమనే మాట ఆ చిన్నారి ఎదపై మరో పేలిన తూటానేస్తమా మేమున్నామంటూ అందించినసహ విద్యార్థుల చిరు వితరణఎక్కడ సరిపోతుందంటూ పూటగడవని ఆ కుటుంబం అర్థిస్తోంది ఆర్థిక సాయం గండేపల్లి మండలంలోని తాళ్లూరు జెడ్పీ స్కూల్లో యన్నమరెడ్డి భవాని తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎంతో చలాకీగా ఉండేది. చదువు కూడా బాగా చదివేది. సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా గత ఏడాది స్కూల్లో కరాటే నేర్చుకునేది. ఈ తరుణంలో గొంతు, మెడ నొప్పి రావడంతో జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తల్లిదండ్రులు వైద్యం చేయించారు. అయినా తగ్గకపోవడంతో రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో పిల్లల వైద్యులను సంప్రదించారు. వారి సూచనల మేరకు పరీక్షలు చేయించడంతో థైరాయిడ్ కేన్సర్ అని తేలింది. రాజమహేంద్రవరంలో ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఎన్టీఆర్ వైద్యసేవ (ప్రస్తుత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ) ద్వారా శస్త్ర చికిత్స చేయించారు. అది జరిగి ప్రస్తుతం 8 నెలలవుతోందని నాటి నుంచి భవానికి రేడియేషన్ ఇవాల్సి వస్తోందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. గొంతు నొప్పి వస్తోందని వైద్యులను సంప్రదించడంతో వైద్యులు మరోసారి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని అంటున్నారని దీనికి సుమారు రూ. ఐదు లక్షలు ఖర్చవుతాయంటున్నారని భవాని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వారు దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కుమార్తె కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటోందని, కళ్లెదుటే కన్నబిడ్డ బాధను చూడలేకపోతున్నామని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అనారోగ్యం ప్రారంభం నుంచి కూతురి కోసం తమ వద్ద ఉన్నదంతా ఖర్చు చేశామని అయినా ఆరోగ్యం కుదుట పడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీ.. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజుగోపాలపురానికి చెందిన భవానీ తల్లి దండ్రులు అర్జున్‌రెడ్డి, అపర్ణలు సుమారు 17 ఏళ్లుగా తాళ్లూరులో నివాసం ఉంటున్నారు. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ వచ్చే సొమ్ములతో వీరి జీవనం సాగుతోంది. వారి కష్టార్జితంతోనే కొడుకు మణికంఠను, కూతురు భవానీని చదివించుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు ఇంటి స్థలమైన ఇవ్వలేదని అప్పటి నుంచి అద్దె ఇంటిలో ఉంటున్నామని వాపోయారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం చదువు, ఆటల్లో ఉత్సాహంగా ఉండే భవానీ ఉపాధ్యాయుల మనస్సుల్లో మంచితనాన్ని సంపాదించింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఇట్టే బట్టీపట్టి అడిగిన వెంటనే ప్రశ్నలకు బదులు చెప్పేదని స్కూల్ హెచ్ఎం నాగమణి, కె.శేషారత్నం, టి.మోహిని, ఎ.సత్యనారాయణ, తదితర ఉపాధ్యాయులు చెబుతున్నారు. భవానికి అనారోగ్యమని తెలిసి వారందరూ ఆమె శస్త్ర చికిత్సకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. నేస్తమా మేమున్నాం నేస్తమా మేమున్నాం అంటూ తమ స్నేహితురాలి అనారోగ్యానికి తమ వంతుగా విద్యార్థులు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఉపాధ్యాయిని శ్రీవాణి సహకారంతో విద్యార్థులు ఫుడ్ కేంటిన్ ద్వారా ఆహార పదార్థాలను విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ములు రూ.7,800 అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల సహకారంతో పలువురు ఆమెకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. -
భూ వివాదం నిండు ప్రాణం బలి
సాక్షి, జగ్గంపేట: భూ వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య తరఫు భూమికి సంబంధించి గోనేడ గ్రామానికి చెందిన వారితో నెలకొన్న వివాదం హత్యకు దారితీసినట్టు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేట మండలం రామవరం శివారులో పిఠాపురం మండలం మంగుతుర్తికి చెందిన పేకేటి పేర్రాజు అనే రాజా (56) మృతదేహాన్ని పంట కాల్వలో పోలీసులు బుధవారం గుర్తించారు. పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ, సిబ్బంది మృతదేహాన్ని బయటకు వెలికి తీయించడంతో ఒంటి నిండా తీవ్ర గాయాలు గుర్తించారు. హత్య చేసి కాల్వలో పడేసి ఉంటారని ప్రాథమికం అంచనాకు వచ్చారు. పేర్రాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాకినాడలో మకాం ఉంటున్నారు. గతంలో ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో పనిచేసి ఉద్యోగం మానేశాడు. మాజీ ఎంపీ దివంగత తోట సుబ్బారావుకు వరసకు మేనల్లుడయ్యే పేర్రాజుకు భార్య తరఫున భూమి జగ్గంపేట మండలం రామవరంలో ఉంది. ఈ భూమిపై కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన వారితో వివాదం నెలకొంది. బుధవారం ఉదయం కాకినాడ నుంచి తన కారులో రామవరం పొలం వద్దకు వచ్చారు. కారు రోడ్డు పక్కన పెట్టి పొలం వద్ద లోపలకు వెళ్లగా అక్కడ చోటు చేసుకున్న వివాదంలో పేర్రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి పంట కాల్వలో విడిచిపెట్టి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులకు పొలం సమీపంలో ఉదయం పూట ఉన్న వారిని విచారిస్తున్నారు. దివంగత మాజీ ఎంపీ తోట సుబ్బారావు కుమారుడు సర్వారాయుడు సంఘటన స్థలం వద్దకు చేరుకుని భూ వివాదం గురించి పోలీసులకు వివరించారు. ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, హంతకులు పరారీలో ఉన్నట్టు సీఐ రాంబాబు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. -
‘గెలిపించండి.. మీ రుణం తీర్చుకుంటా’
సాక్షి, జగ్గంపేట: ‘‘ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించండి మీ రుణం తీర్చుకుంటాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేటలో మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రావులమ్మతల్లి గుడి వద్ద భార్య వేణితో కలిసి పూజలు అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాదయాత్రకు వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వేలాది మందిని ఉద్దేశించి చంటిబాబు మాట్లాడారు. ‘‘రెండు సార్లు పోటీ చేశాను.. మరోసారి మీ ముందుకు వస్తున్నాను. నన్ను గెలిపించండి’’ అని కోరారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామన్నారు. చంటిబాబుతో పాటు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిని వంగా గీతా పాల్గొని ప్రసంగించారు. అత్తులూరి నాగబాబు, బండారు రాజా, ఒమ్మి రఘురామ్, బుర్రి చక్రబాబు, వరుపుల రంగనాయకులు, మండపాక చిన్న, రాయి సాయి, పెద్దాడ రాజబాబు, రావుల రాజా, ఎంపీటీసీ అబ్బు, బూసాల బాబూరావు, సర్వసిద్ధి లక్ష్మణ్, ఇళ్ల అప్పారావు, తులా రాము, చిట్టిమాని సత్యనారాయణ, గండపల్లి మండలానికి చెందిన చలగళ్ల దొరబాబు, ఒబిణ్ణి సత్యనారాయణ, రామకృష్ణ, ఉప్పలపాటి సాయి, అడబాల ఆంజనేయులు, రామకుర్తి మూర్తి, పరిమి వెంకటేశ్వరరావు, పాపారావు చౌదరి, గోకవరం మండలానికి చెందిన సుంకర రమణ, సూరారెడ్డి, వరసాల ప్రసాద్, జనపరెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, సతీష్, రఫీ, అల్లు విజయ్‌కుమార్, తోట రవి, అయ్యన్న, పలికల గంగరాజు, చదలాడ బాబీ, దోమాల గంగాధర్, సూది శ్రీను, పాఠంశెట్టి విశ్వనాథం, గోపి, పాల్గొన్నారు. చంటిబాబు నామినేషన్‌కు తరలివెళ్లిన కార్యకర్తలు కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు నామినేషన్ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. పలు గ్రామాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీగా జగ్గంపేట వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల చంటిబాబును అఖండ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. కిర్లంపూడి, ముక్కొలు, గోనేడ, బూరుగుపూడి, గెద్దనాపల్లి, సింహాద్రిపురం, వీరవరం, తామరాడ, తదితర గ్రామాల నుంచి తరలివెళ్లి జ్యోతుల నామినేషన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో చదలవాడ బాబి, అల్లు విజయకుమార్, విశ్వనాథం చక్రరరావు, దోమాల గంగాధర్, వెంకటజాన్బాబు, పెనగంటి రాజేష్, ఎం రాంబాబు, వి.సాంబశివ, డి అప్పలరాజు, ఎస్.శివకుమార్, ఎ.గంగబాబు, బి వెంకటరమణ, పి శ్రీను, వై పాము, మల్లేష్, పి రాజుగోపాల్, సూరిబాబు, గోపి, తదితరులు పాల్గొన్నారు. చంటిబాబు నామినేషన్‌కు తరలిన జనసందోహం గండేపల్లి: జ్యోతుల చంటిబాబు నామినేషన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించడంతో గండేపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలపై భారీగా జగ్గంపేట చేరుకున్నారు. దీంతో జాతీయ రహదారి జనసందోహంగా మారింది. -
అడవి దున్న హల్చల్
సాక్షి, గండేపల్లి: మండలంలోని సింగరంపాలెం పరిధి పొలాల్లో మగ అడవి దున్న హల్చల్ చేస్తోంది. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామాయిల్ తోటలో దున్న సంచారాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఫారెస్ట్ అధికారి నూకాసాహెబ్కు సమాచారం అందజేశారు. దున్న నోటికి గాయమై ఏమీ తినలేక నీరసించి ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. దున్నను బంధించి బోను సహాయంతో విశాఖ జూకు లేదా మారేడుమిల్లికి గానీ తరలిస్తామని ఆ అధికారి చెప్పారు. విశాఖ నుంచి మత్తుమందు ఇచ్చే వైద్యులు రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో కె.గోపాలపురం అడవికి సమీపంలో ఒక దున్న మృత్యువాతకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి దున్నను సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
‘నిర్భయంగా ఓటు వేయండి’
సాక్షి, జగ్గంపేట: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన కాట్రావులపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు పాత కేసులు, నాన్ బైయిలబుల్ వారెంట్లు ఉన్న నిందితులు ఐదు వేల మందిని బైండోవరు చేశామన్నారు. 22 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు రూ.కోటి స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు వచ్చాయని, అదనంగా మరో ఆరు వేల ఫోర్సును కోరామన్నారు. ఏజన్సీలో 372 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఎన్నికలు జరిగేలా చూస్తున్నామన్నారు. చత్తీస్ఘడ్, ఒడిశా సరిహద్దులో నిఘా ఉంచామన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన, అసాంఘిక కార్యక్రమాలను ఎక్కడైనా జరిగితే వెంటనే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సీ విజల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయాలని కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు. -
అనారోగ్యానికి గురైనా పట్టించుకోలేదు ..అందుకే రాజీనామా..
సాక్షి, జగ్గంపేట: అజాత శత్రువుగా పేరొందిన మెట్ట ప్రాంత రాజకీయ దిగ్గజం తోట నరసింహం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, కాకినాడ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కిర్లంపూడి మండలంలోని స్వగ్రామం వీరవరంలో మంగళవారం సాయంత్రం కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘2004లో రాజకీయ ప్రవేశం చేసి, కాంగ్రెస్ తరఫున తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేను అయ్యాను. 2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాను. 2014లో టీడీపీలో చేరి, 21 రోజుల వ్యవధిలోనే కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఎంపీగా, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా సమర్థవంతంగా పని చేసి రాష్ట్రం తరఫున ప్రత్యేక హోదా కోసం పోరాడాను. మూడు నెలలు చేపట్టిన హోదా ఉద్యమంలో అనారోగ్యానికి గురయ్యాను. అందువల్లనే ఎన్నికలు సమీపించినా నన్ను చంద్రబాబు పట్టించుకోలేదు. నేను పోటీ చేయనని, నా భార్యకు సీటు ఇవ్వాలని కోరినా పరిగణనలోకి తీసుకోలేదు. కష్టపడి పని చేసేవారికి ఆ పార్టీ ఇచ్చే గుర్తింపు ఇదేనా? కార్యకర్తల అభీష్టం మేరకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బుధవారం మధ్యాహ్నం నా కుటుంబం సహా వెళ్తున్నాను. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నా భార్య వాణి పెద్దాపురం నుంచి పోటీ చేస్తారు. వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబుకు నా కార్యకర్తలను అప్పగిస్తున్నాను. వారికి సముచిత స్థానం ఇవ్వాలని కోరుతున్నా. నా కేడర్‌ను అణచివేస్తూ వచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు నా అనుచరులందరూ చంటిబాబుకు సహకరించాలి’’ అని నరసింహం చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, నరసింహం విలువలున్న నాయకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. నరసింహం సతీమణి వాణి మాట్లాడుతూ, తన తండ్రి మెట్ల సత్యనారాయణరావుకు కోనసీమలోను, తన భర్త నరసింహానికి మెట్టలోనూ రాజకీయంగా పేరుందన్నారు. తన తండ్రికి గతంలో అన్యాయం చేసిన టీడీపీ, ఇప్పుడు తన భర్తకూ అన్యాయం చేసిందన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త గురిం చి చంద్రబాబు కనీసం పట్టించుకోలేదని, సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని, జిల్లా టీడీపీ పెద్దలు కుట్రలు చేశారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీలో చేరుతున్న తమకు అందరూ అండగా ఉండాలని కోరారు. తన తండ్రిని అవమానించినవారికి గుణపాఠం చెప్పేందుకే పెద్దా పురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నానన్నారు. అం తకుముందు అనుచరులు తుమ్మల శ్రీనివాస్, గఫూర్, దోమా గంగాధర్, తొట్టిపూడి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ, టీడీపీ అన్యాయం చేసిందని, ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోరారు. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధి నుంచి భారీగా కార్యకర్తలు రావడంతో తోట నివాసం కిక్కిరిసింది. అనంతరం ఎంపీ తోట కుటుంబం, అనుచరులతో కలిసి విశాఖ పయనమైంది. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లి, బుధవారం వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. -
తాడోపేడో..
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): కాకినాడ ఎంపీ తోట నరసింహం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై తాడోపేడో తేల్చుకోవడానికి ఎంపీ తోట వర్గం సిద్ధమవుతోంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం కలిసి జగ్గంపేట అసెంబ్లీ సీటు సాధించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంపీ తోట వర్గం గట్టిగా పట్టుబడుతోంది. దీంతో ఆరు నూరైనా నూరు ఆరైనా అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంపీ తోట ఒక నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు శనివారం రాత్రి నియోజకవర్గం నలుమూలల నుంచీ వచ్చిన తన అనుచరులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గోకవరం మండలాలకు చెందిన ఆయన వర్గీయులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆదివారం కూడా అధిక సంఖ్యలో తోట వర్గీయులు వీరవరం చేరుకుని తమ మనోగతం చెప్పారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో జగ్గంపేట నియోజకవర్గంలోని అసలైన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చినవారు ఈ నియోజకవర్గాన్ని శాసిస్తున్నారని, నిజమైన కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివ్వడం లేదని, పైగా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఎంపీ తోట వద్ద వాపోయారు. ఇప్పటికైనా మేల్కోకపోతే 2014 ఎన్నికల సమయంలో టీడీపీ జెండా మోసిన అసలైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తోటపై వారు ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఎంపీ తోట స్పందిస్తూ ప్రాణం ఉన్నంత వరకూ జగ్గంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, తన ఆరోగ్యం సహకరించకపోతే తన భార్య వాణి పోటీ చేస్తుందని కార్యకర్తలకు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకు అపార నమ్మ కం ఉందని, జగ్గంపేట టీడీపీ టిక్కెట్టు తమ కుటుంబానికే కేటాయిస్తారని ఆశిస్తున్నానని, ఈమేరకు అసలైన కార్యకర్తలందరూ విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవ్వాలని సూచించా రు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారు. -
పార్టీ గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలి
-
రాజ్యాంగా హక్కులను తిరగరాసే విధంగా బాబు తీరు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్స్
-
వైఎస్ జగన్‌ను కలిసిన జగ్గంపేట పంచాయితీ సిబ్బంది
-
222వ రోజు ప్రజాసంకల్పయాత్ర విశేషాలు
-
చేయగలిగిందే చెబుతా..
ఎన్నికలకు ముందు కొత్తగా ఈ ఏడాది 19 లక్షల ఇళ్లు కడుతున్నట్లు చెబుతున్నారు. ‘ఈనాడు’ పేపరులో కథనాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండబోతున్నారని కథ. కనీసం ఊరికి 10 ఇళ్లు కూడా కట్టని ఈ మనిషి 19 లక్షల ఇళ్లు కడుతున్నారని చెబుతాడు. దానిని ‘ఈనాడు’లో పతాక శీర్షికలో పెడతారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను.. మోసాలు చేయలేను.. చేయగలిగిందే చెబుతాను.. చేయలేనిది చెప్పను.. నేను ఇచ్చిన మాట మీద నిలబడతా.. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ పెద్దమనిషి చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా మంచి పని జరిగిందా? అవినీతి, అక్రమాలు, అరాచకాలు, జన్మభూమి కమిటీల మాఫియా, రాజ్యాంగానికి తూట్లు పొడిచే పాలన సాగుతోంది. ఇసుక, మట్టి మొదలు దేన్నీ వదిలి పెట్టడం లేదు. అవినీతి సొమ్ముతో రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి వేరే పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇవన్నీ ఇదే నియోజకవర్గంలో చూస్తున్నాం. ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను.. మోసాలు చేయలేను.. చేయగలిగిందే చెబుతాను.. చేయలేనిది చెప్పను..’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్ కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేశారని, తాము అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు కన్నా రెట్టింపు నిధులు ఇస్తానని భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం 222వ రోజు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబుది దద్దమ్మపాలన అని నిప్పులు చెరిగారు. బాబు నాలుగున్నర ఏళ్ల పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. చంద్రబాబు ఇటీవల కాలంలో కొత్త సినిమా మొదలు పెట్టారని, దానిపేరు.. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అని ధ్వజమెత్తారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని తాను మరువలేనని, యాదృచ్చికమే అయినా ఇది పాదయాత్ర సాగుతున్న 100వ నియోజకవర్గమన్నారు. ఈ నియోజకవర్గంలోనే తన పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని, ఈ నియోజకవర్గంలోనే తమ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే.. కాపు సోదరులకు నా వినతి ‘‘ఇదే నియోజకవర్గంలో కాపు సోదరులు ఉన్నారు. నా ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిల్చొని ఉన్నారు. పక్కనే కిర్లంపూడి కనిపిస్తోంది. అక్కడే ముద్రగడ పద్మనాభం గారు కనిపిస్తారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగితే జరిగిందేమిటి? పలానాది చేస్తాను.. అని చెప్పిన మాటను ఎందుకు చేయడం లేదని ముద్రగడ పద్మనాభం చంద్రబాబును నిలదీసినందుకు ఇదే ముద్రగడ గారికి జరిగిందేమిటి? ఇదే ముద్రగడ పద్మనాభం గారిని నిర్బంధించారు. నేరుగా పోలీసులను ఇంటికి పంపించారు. ఇంట్లో ఆడవాళ్లని కూడా చూడకుండా దౌర్జన్యం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు పాలనలో చూశాం. నువ్వు చెప్పిందే కదా మేము అడుగుతున్నానని చెప్పినా చంద్రబాబు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించారు. ఎన్నికలకు ముందు ప్రతి కులానికి ఒక పేజీని కేటాయిస్తూ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశాడు. తాను చెయ్యలేనని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని తెలిసి కూడా ప్రతి కులానికీ ఒక హామీ ఇచ్చాడు చంద్రబాబు. బోయలను ఎస్టీలుగా చేస్తానన్నారు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానన్నాడు, రజకులను ఎస్సీలుగా చేస్తానన్నాడు. ఇదే పెద్దమనిషి కాపులను బీసీలుగా చేస్తానని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలలో ఏం చేశారో మీరు చూశారు.. మీకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించమని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పే వాళ్లు.. మోసం చేసే వాళ్లు నాయకుడిగా కావాలా? ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని ఉన్న కాపు సోదరులకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నా. పోలవరంను అవినీతిమయం చేసిన చంద్రబాబును ఏమనాలి? జగ్గంపేట నియోజకవర్గంలో 2,600 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్నాం. ఇందుకు గుర్తుగా మొక్కను కూడా నాటాను. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు.. అన్నా మేమంతా నీకు తోడుగా ఉన్నామంటూ అండగా నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే నియోజకవర్గంలోనే పుట్టింది. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే నిజంగా చాలా బాధనిపిస్తోంది. మీలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఈ నియోజకవర్గంలో రైతులు నన్ను కలిసి ఏమి చెప్పారంటే.. ఈ ప్రాంతంలోని జగ్గంపేట, కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో రైతులకు ఏలేరు రిజర్వాయర్ ఆధారం. ఏలేశ్వరం రిజర్వాయర్ కింద 67 వేల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 50 వేల ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి. నాన్నగారి హయాంలో 2009 ఫిబ్రవరిలో రూ.138 కోట్లతో ఆధునికీకరణ పనులు పనులు ప్రారంభిస్తే ఆయన వెళ్లిపోయాక ఈ నాలుగేళ్లలో 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదని రైతులు చెబుతున్నారు. సకాలంలో పోలవరం పనులు పూర్తి చేయకపోవడం వల్ల విశాఖపట్నంలో పారిశ్రామిక అవసరాలకు భారీగా ఏలేరు నీటిని తరలిస్తున్నారు. అదే పోలవరం పనులు పూర్తి చేసి ఉంటే ఈ నీటిని తరలించాల్సిన అవసరం ఉండేది కాదు. దాంతోపాటు ఈ ప్రాంత సాగునీటి అవసరాలు తీరి ఉండేవి. బాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులు పునాదుల స్థాయిని కూడా దాటలేదు. పోలవరం ప్రాజెక్టు ఎంతో అవసరం అని తెలిసి కూడా పూర్తి చేయకపోగా పూర్తిగా అవినీతి మయం చేసి నత్తనడకన పనులు చేస్తున్న ఈ చంద్రబాబును ఏమనాలి? నాన్నగారు ఇక్కడి రైతుల మేలు కోసం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 13 ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించారు. రాజానగరం, రాజమహేంద్రవరం , అనపర్తి, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, తుని నియోజకవర్గాలలో రైతులు ఆనందంగా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితమేనని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇదే నియోజకవర్గంలోని ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా గోకవరం మండలంలో సుమారు 5 వేల ఎకరాలకు వైఎస్సార్ పెట్టిన 13 లిఫ్టులే కాకుండా మరొక లిఫ్ట్ పెట్టాలని దానివల్ల గుండేపల్లి, రామయపాలెం, కే గోపాలపురం తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుందని చెప్పినా చంద్రబాబు గత నాలుగున్నర ఏళ్లలో పట్టించుకోవట్లేదు. కనీసం ఒక్క లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయలేని దద్దమ్మ పరిపాలన ఇది. చంద్రబాబునాయుడు ఎక్కడ? ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడ? గోకవరం మండలంలోని మల్లవరం, తిరుమలాయపాలెం తదితర గ్రామాలకు ఏలేరు నుంచి పంపుల ద్వారా నీటిని అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నా.. ఇవ్వాల్టికీ పట్టించుకోవడం లేదన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు ఎక్కడ? వైఎస్ ఎక్కడ? వీరిని పోల్చిచూసినప్పుడు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుందని చెబుతున్నారు. చంద్రబాబు.. వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్ ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోవడంతో గత ఏడాది గండేపల్లి రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? రైతన్నలు అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1550 ఉంటే రైతులకు రూ.1130 కూడా రావడం లేదు. ఇదే నియోజకవర్గంలో చెరకు రైతులదీ ఇదే పరిస్థితి. కర్రపెండలం సాగు చేస్తున్న రైతులకు గతేడాది పుట్టికి అంటే 225 కిలోలకు రూ.1600 ధర వస్తే ఈ ఏడాది మాత్రం రూ.1000, రూ.1100కు కూడా అమ్ముకోలేని పరిస్థితి. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి హెరిటేజ్ ఫ్రెష్ అని షాపులున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరలకు పంటలను కొనుగోలు చేసి నాలుగైదు రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దళారులను కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రే దళారిగా మారిపోయి లాభాలను పిండుకుంటుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి? ఈ నియోజకవర్గంలో దాదాపు 90 చెరువుల నుంచి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారన్నా అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. చెరువుల్లో మట్టిని తవ్వి ప్రభుత్వం నుంచి రూ.9 కోట్లు బిల్లులు తీసుకున్నారు. మరోపక్క ఆ మట్టిని అమ్ముకుంటున్నారు. చెరువులను తాటిచెట్టు లోతున ఎవరైనా తవ్వుతారా? అని రైతులు అడుగుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయంలో 18,600 ఇళ్లు కట్టిస్తే చంద్రబాబు.. ఊరికి కనీసం పది ఇళ్లను కూడా నిర్మించని అధ్వానపు పాలన. జగ్గంపేటలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి పట్టించుకోలేదు. ఇక్కడి ఆస్పత్రిలో ఇప్పుడు 30 పడకలు ఉండాల్సి ఉంటే కేవలం 15 మాత్రమే ఉన్నాయి. నాన్నగారి హయాంలో జగ్గంపేట డిగ్రీ కళాశాల ఇస్తే నాలుగున్నరేళ్లుగా భవనాలు కూడా నిర్మించలేకపోయారు. మరి అభివృద్ధి ఎక్కడ? అంతటా అన్యాయమే.. ఈ నాలుగేళ్ల పాలనలో అబద్ధాలు, మోసం, అన్యాయం, అవినీతి, రాజ్యాంగానికి తూట్లు, అధిక ధరలతో ప్రజల్ని బాద డం. అందుకే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలని చెబుతున్నా. మోసం చేసే వారిని, అబద్ధాలు చెప్పే వారిని ఈ వ్యవస్థ నుంచి బయటకు పంపించాలి. అది ఒక్క జగన్ వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, ఆశీస్సులు కావాలి. పొరపాటున చంద్రబాబును క్షమిస్తే.. రేపు మీ వద్దకు వచ్చి మైకు పట్టుకుని.. ఎన్నికల ప్రణాళికలో తాను చెప్పినవన్నీ 98 శాతం పూర్తి చేశానని మీ చెవ్వుల్లో క్యాలీఫ్లవర్ పెడతారు. కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. దాన్నీ మీరు నమ్మరని.. ప్రతి ఇంటికి సాధికార మిత్రలను పంపించి ప్రతి చేతిలో రూ.3 వేలు పెడతారు. వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని అడగండి. ఆ డబ్బంతా మనదే. మనజేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం. మన ప్రభుత్వంలో అవ్వాతాతల పింఛన్ వయసును 65 నుంచి 60 ఏళ్లకే తగ్గించడమే కాక పింఛన్ నెలకు రూ.2 వేలకు పెంచుతా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇచ్చి ఆదుకుంటాం’’ అని జగన్ అన్నారు. నేను మాట ఇస్తే అదే మాట మీద నిలబడతా. చేయగలిగింది మాత్రమే చెబుతా. చేయలేనిది చేస్తానని చెప్పే అలవాటు నాకు లేదని ఇక్కడ కాపు సోదరులు అందరికీ చెబుతున్నా. కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు ఉంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్ల అంశం. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు. ఇది నేను చేయగలిగిన అంశం కాదు కాబట్టి నేను ఇది చేయలేకపోతున్నానని మీ అందరికీ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నాను. మొట్టమొదటిగా కాపులకు అన్యాయం జరిగిందని స్వరం వినిపించిందీ, చెప్పిందీ ఎవరైనా ఉంటే అది జగన్ అని చెప్పడానికి వెనుకాడను. ఇదే కాపు సోదరులకు నేను మాట ఇస్తున్నా.. చంద్రబాబు నాయుడు కాపు సోదరులకు కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.5000 కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేశారు. నేను ఆ నిధుల్ని రెట్టింపు చేసి ఇస్తా.. అని మాట ఇస్తున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉంటానని చెబుతున్నా. చంద్రబాబు కొత్త సినిమా.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరో కొత్త సినిమాకు తెరతీశారు. ఆ సినిమా పేరు ‘ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం’. ఈ కొత్త సినిమాలో ఆయన డ్రామాలు ఎలా ఉన్నాయంటే.. ఎన్నికలకు ముందు రూ.87,612 కోట్ల రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. చంద్రబాబు సీఎం అయ్యి నాలుగున్నరేళ్లు అయింది. చివరికి ఆయన చేసిన రుణమాఫీ పథకం రైతుల రుణంపై వడ్డీలకు కూడా సరిపోని విధంగా మారింది. ఇలా మోసం చేసిన చంద్రబాబుకు వంతపాడే ఎల్లోమీడియా సిగ్గు లేకుండా మొత్తం రుణమాఫీ అయ్యిందని, ఇది దేశంలో కనీవినీ ఎరుగనిదని, ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడకు అధ్యయనం చేయడానికి వస్తున్నారని చెబుతోంది. పొదుపు సంఘాల మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ కాలేదు. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలలకోసం పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశామని చెబుతున్నారు. అందుకు పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు సన్మానాలు కూడా చేశారని ఎల్లో మీడియా రాయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇంటింటికీ ఉద్యోగం లేదా ఉపాధి అన్నాడు. ఈ రెండూ లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉండగా కేవలం 10 లక్షల మందికి మాత్రమే అదీ రూ.2 వేలు కాకుండా కేవలం రూ.వెయ్యి మాత్రమే భృతి ఇస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన 50 నెలల కాలానికి నెలకు రూ.2 వేలు చొప్పున ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.లక్ష చొప్పున బాకీ ఉన్నాడు. ఇవాళ గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయో లేదో కానీ మద్యం షాపులు మాత్రం అడగడుగునా కనిపిస్తాయి. ఇప్పుడు నాలుగు నెలల కోసం చంద్రబాబు మద్యం షాపులపై ఉక్కుపాదం మోపుతాడని, మద్యం లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాడని ఈనాడులో రాస్తారు. ఎన్నికలొస్తున్నాయని.. మరో ఆరు నెలల్లో తనను పదవి నుంచి తప్పించి పంపిస్తారని తెలుసుకొని హోంగార్డులకు, వీఆర్ఏలకు, అంగన్వాడీలకు, ఆశావర్కర్లకు జీతాలు పెంచామని చెబుతున్నారు. ఆ పెంచేది కూడా మానవత్వం లేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం పెంచేలా కూడా లేదు. అదీ ఈ నాలుగు నెలల కోసమే చేస్తాడట. తర్వాత ఎలాగూ జగన్ అంతకన్నా ఎక్కువ చేస్తానన్నారని చేస్తున్నాడు. నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసినప్పుడు ఈ పెద్దమనిషికి ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. ఎన్నికల కోసం బీజేపీ నుంచి విడిపోయాక ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేస్తున్నానని ఫోజులిస్తున్నాడు. ఉద్యోగులకు పదో పీఆర్సీ ఇవ్వలేదు. ఉద్యోగులకు మూడు డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు చేయాలన్నా పట్టించుకోడు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని సన్మానాలు చేయించుకొని ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. నాలుగేళ్లుగా అమరావతి.. అమరావతి.. అని మనకు భ్రమరావతిని చూపిస్తున్నాడు. శాశ్వత నిర్మాణం పేరిట ఒక్క ఇటుక కూడా వేయలేదు. అలాంటి సీఎం ఎన్నికలకు ముందు ఈనాడు దినపత్రికలో మనకు అమరావతి గురించి బాహుబలి సెట్టింగులు, సింగపూర్, జపాన్‌లోని బిల్డింగ్లు కనిపిస్తాయి. అదిగో బుల్లెట్ ట్రైన్, ఇదిగో మెట్రో రైలు, ఇదిగో మైక్రోసాఫ్టŠట్ హైపర్‌లూప్ అంటాడు. కానీ ఏదీ లేదు. ఈ నాలుగేళ్లలో అమరావతి రాజసం ఏ స్థాయిలో ఉందంటే.. ఉద్యోగులు వారు పనిచేసే స్థలానికి 15 నిమిషాల్లో నడచుకుంటూ వెళ్లిపోతారట. అంతటితో సీన్ కట్‌చేస్తే ఇంటర్వెల్. తర్వాత ఈనాడులో వార్తలు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆస్పత్రులను అత్యుత్తమ ఆస్పత్రులుగా మారుస్తారట. పక్కనే జగ్గంపేట ఆస్పత్రి కనిపిస్తుంది. కనీసం ఎక్స్‌రే యంత్రం కూడా లేదు. అంబులెన్సులు 2 కూడా లేవు. ఆస్పత్రిలోకి పోతే చంటిపిల్లలను ఎలుకలు కొరుకుతూ కనిపిస్తాయి. జనరేటర్లు లేక సెల్ ఫోన్ల వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు. కేన్సర్ చికిత్స కోసం రోగి హైదరాబాద్‌కు వెళ్తే అక్కడ ఆరోగ్య శ్రీ ఇవ్వరట. ఏదైనా పెద్దరోగమొస్తే ఆరోగ్య శ్రీ కింద వైద్యం దొరకని పరిస్థితి. ఇవన్నీ పట్టించుకోని ఈ పెద్దమనిషి.. ఎన్నికలకు ఆరు నెలల ముందు నాలుగు నెలల కోసం ఆస్పత్రులను బాగా బాగుపరుస్తారట. పెట్రోలు, డీజిల్, ఆర్టీసీ బస్సు చార్జీలు, నీటిపన్నులు, కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. పిల్లలను బడికి పంపిస్తే ఫీజుల బాదుడు. ప్రభుత్వ పాఠశాలలకు ఏప్రిల్‌లో రావలసిన పాఠ్యపుస్తకాలు జూలై వచ్చినా 20 శాతం కూడా ఇవ్వలేదు. యూనిఫాంలు కూడా లేవు. ఇలా చేసి పిల్లలను నారాయణ, చైతన్య స్కూళ్లకు పంపించేలా చేస్తాడు. ఆ స్కూళ్లన్నీ చంద్రబాబు బినామీయే. ఆ స్కూళ్లలో ఫీజులు బాదుడే బాదుడు. -
నాలుగేళ్ల బాబు పాలనను చూస్తే ప్రజలు భయపడుతున్నారు
-
కాపులకు అండగా నిలుస్తా : వైఎస్ జగన్
తూర్పు గోదావరి/ జగ్గంపేట : చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను ఇచ్చి అన్ని కులాలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రిజర్వేషన్ కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కాపులకు అన్యాయం జరిగిందని, వారికి తాను అండగా ఉంటానని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాను ఏదైనా మాట ఇస్తే.. దానికి కట్టుబడి ఉంటానని, చేయగలిగిందే తాను చెబుతానని, అబద్ధపు హామీలను ఇవ్వనని అన్నారు. 222వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిలా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని కాదని, అది కేంద్రం పరిధిలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50శాతం దాటరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భాలను ఆయన గుర్తుచేశారు. తాను మాట ఇస్తే నిలబెట్టుకొనితీరుతానని, చేయగలిగినదే చెప్తానని, కాపులకు అండగా ఉంటానని ఆయన తేల్చిచెప్పారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అరాచాకాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన గడ్డ జగ్గంపేట అని గుర్తుచేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూస్తే ప్రజలు భయపడుతున్నారని, జన్మభూమి కమిటీలతో మాఫీయా గుండాలకు తయారు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్లు కొన్నారని అన్నారు. ఇసుక, మట్టిని దేనిని వదలకుండా 20నుంచి 30 కోట్లుకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అభివృద్ధిని చూసి పార్టీ మారుతున్నామని చెప్పారని, నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. ‘కాపు రిజర్వేషన్లు కావాలని ప్రశ్నిస్తే. ముద్రగడ పద్మనాభంను నిర్భందించారు. ఆడవాళ్లని కూడా చూడకుండా పోలీసులు ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం చేశారు. చంద్రబాబు ఒక్కో కులానికి ఒక్కో పేపరు పెట్టుకుని అన్ని కులాలను మోసం చేశారు. బోయలను ఎస్టీలుగా, మత్స్యకారులను ఎస్టీలుగా, రజకులను ఎస్సీలుగా, కాపులను బీసీలుగా మారుస్తాం అని అబద్దపు హామీలను ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం ఒక్క పంటకైనా మద్దతు ధరును ప్రకటించారా. రైతుల దగ్గర పంటను చంద్రబాబు తక్కువ ధరకు కొని తన హెరిటేజ్ ఫ్రెష్‌లో మూడు రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. దళారీ వ్యవస్థను కట్టడిచేయాల్సిన ముఖ్యమంత్రే పెద్ద దళారీగా మారి ప్రజలను దోచుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబు లాభాలు సంపాదించుకుంటుంటే, పంటలకు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది. జగ్గంపేట నియోజవర్గంలోని 90 చెరువుల నుంచి మట్టిని తవ్వి ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులను తీసుకుంటున్నారు. ఒక్కొ చెరువును తాటిచెట్టులోతు తవ్వి మట్టి మఫీయా చేస్తున్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు 19 వేల ఇళ్లలను కట్టించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనీసం ఊరికి ఒక్క ఇళ్లు అయిన కట్టించారా?. ఇంత దారుణమైన పాలన ఎక్కడాలేదు. జగ్గంపేటలో ప్రధాన ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మారుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిన కనీసం బెడ్లు కూడా లేని పరిస్థితి. 30 పడకల ఆసుపత్రిలో కేవలం 15 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రిలో కనీసం ఎక్స్‌రే, ల్యాబ్ టెక్నిషీయన్, అంబులెన్స్ కూడా లేదు. గతంలో జగ్గంపేట ప్రభుత్వ డిగ్రి కళాశాలకు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. చంద్రబాబు సీఎం అయి నాలుగేళ్లు అయినా కూడా ఇంకా పూర్తి కాలేదు. చంద్రబాబు అధికారంలోని వచ్చాక అన్నింటిపై రేట్లను విపరీతంగా పెంచారు. కరెంట్‌పై, పెట్రోల్, డీజిల్, స్కూల్ ఫీజులపై బాదుడే బాదుడే. వైఎస్సార్ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యంతో సహా, కిరోసిన్, కందిపప్పు, వంటివి ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
ప్రజాసంకల్పయాత్ర 222 రోజులు 100 నియోజకవర్గాలు
-
వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలురాయి
సాక్షి, జగ్గంపేట(తూర్పు గోదావరి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మరో మైలురాయిని చేరుకుంది. అశేష జనవాహిని వెంటనడువగా.. ప్రజాసంకల్పయాత్ర శనివారం 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. జగ్గంపేటలో పాదయాత్ర ప్రవేశించడంతో 100 నియోజక వర్గాలు పూర్తయ్యాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్6, 2017న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 222 రోజుల్లో ప్రజాసంకల్పయాత్ర 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని జగ్గంపేట నియోజక వర్గంలోకి అడుగుపెట్టారు. వణికే చలిలోనూ, మండే ఎండల్లోనూ, హోరు వానలోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగించారు. వైఎస్ జగన్ వేసే ప్రతి అడుగులో ప్రభుత్వ వైఫల్యాలు కనిపించాయి. లక్షల మంది జగన్ అడుగులో అడుగు వేశారు. వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాయలసీమలో గ్రామీణ ప్రాంతాల వరకే కొనసాగిన ప్రజాసంకల్పయాత్ర, కోస్తాలో అడుగుపెట్టినప్పటి నుంచి పట్టణ ప్రాంతాల్లో కూడా కొనసాగింది. ప్రజాసంకల్పయాత్ర మొదలైనప్పటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువత నినదిస్తూ జగన్ వెంట నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ జగన్‌కు లక్షల్లో విజ్ఞప్తులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మి మోసపోయామని రైతులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు.. ఇలా చాలా మంది వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. రైతులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పెట్టుబడి పెరిగి, మద్దతు ధరలేకుండా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని తెలిపారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వైఎస్ జగన్‌తో వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే తమ బాధలు తీరతాయని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ పనులను సైతం పక్కన బెట్టి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. -
నేటితొ 100 నియోజకవర్గాలు పూర్తి చేసుకున్న ప్రజాసంకల్పయాత్ర
-
జగ్గంపేటలో ఆదివారం వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం
-
వైఎస్ఆర్సీపీలో చేరిన జ్యోతుల చంటిబాబు
-
వైఎస్ఆర్ సీపీలోకి జ్యోతుల చంటిబాబు
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన జ్యోతుల చంటిబాబు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా టీడీపీ జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు ఉన్న జ్యోతుల చంటిబాబు కొంతకాలం క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. అంతేకాకుండా టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి అనంతరం జ్యోతుల నెహ్రు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే జ్యోతుల నెహ్రు పునరాగమనంపై అసంతృప్తిగా ఉండటమే కాకుండా, చంద్రబాబు అవలంభించిన వైఖరి, టీడీపీలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో ఆ పార్టీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు తన మద్దతుదారుల నిర్ణయం మేరకే వైఎస్ఆర్ సీపీలో చేరినట్లు జ్యోతుల చంటిబాబు తెలిపారు. -
టీడీపీకి జ్యోతుల గుడ్ బై
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తన మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. టీడీపీలోకి జ్యోతుల నెహ్రు పునరాగమనంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రు, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ పెత్తనం పెరగడంతో ఆయన పార్టీలో ఇమడలేకపోయారని వార్తలు వస్తున్నాయి. తన పట్ల పార్టీ అధినేత చంద్రబాబు అవలంభిస్తున్న వైఖరి, గత కొంతకాలంగా తనను పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తన తండ్రి చనిపోయినా టీడీపీ నేతలెవరూ కనీసం సానుభూతి తెలపకపోవడం ఆయనను ఆవేదనకు గురిచేసింది. పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పనులను సీఎం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభకు తనను ఆహ్వానించకపోవడంతో ఆయన కలత చెందినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో టీడీపీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం పట్ల చంద్రబాబు సర్కారు అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా కాపు నేతలు టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో తాజా పరిణామాలు అధికార పార్టీ నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయి. -
టీడీపీకి జ్యోతుల గుడ్ బై
-
జగ్గంపేటలో జగదీశ్వరి ఆత్మహత్యాయత్నం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జగదీశ్వరి అనే యువతి మంగళవారం ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఆ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు మోసం చేశాడని... ఆరోపిస్తూ... 10 రోజుల క్రితం సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె విషయాన్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో జగదీశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది. దాంతో మంగళవారం తెల్లవారుజామున జగదీశ్వరి ఆత్మహత్యకు యత్నించింది. -
అర్థరాత్రి యువకుడిపై దాడి
తూర్పు గోదావరి జిల్లా : జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో అర్థరాత్రి జగ్గంపేటకు చెందిన యువకుడు కేశినీడి వీరబాబుపై హత్యాయత్నం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం రామవరం హైవేను ఆనుకుని వీరబాబు దాబా హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో హోటల్లో పనులు ముగించుకుని రామవరంలో ఉంటున్న నివాసం వద్దకు వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వీరబాబు కేకలకు సమీపంలో ఉన్నవారు మేల్కోవడంతో నిందితులు పరారయ్యారు. సంఘటనా స్థలం వద్ద బురదగా ఉండడంతో వీరబాబు ఒంటి నిండా బురదతో నిండిపోవడంతో కడిగి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుమారు పది మంది మూకుమ్మడిగా వచ్చిన వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న తనను కొట్టి కింద పడేసి కాళ్లు, చేతులతో దాడి చేశారని, తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తీవ్రంగా గాయపడిన వీరబాబు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎసై్స అలీఖాన్ బాధితుడి నుంచి ఆస్పత్రిలో స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. జగ్గంపేటలో స్థల వివాదమే వీరబాబుపై హత్యాయత్నానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. -
ఆమె ఎవరు..?
జగ్గంపేట : వయస్సు సుమారు 35 సంవత్సరాలు. ఆమె ఒంటిపై తెలుపురంగు చీరపై ఆకుపచ్చని చుక్కలు, నీలం, ఎరుపు కాషాయ రంగు పువ్వులు, ఆకుపచ్చ జాకెట్టు ఉన్నాయి. కుడికంటిపై రాయితో గట్టిగా మోదినట్టుగా రక్తపు గాయంతో ఓ మహిళ మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా జగ్గం పేట మండలంలోని ఇర్రిపాక సమీపంలో సోమవారం పోలీసులు కనుగొన్నారు. మర్రిపాక నుంచి ఇర్రిపాకకు వెళ్లే మార్గాన్ని ఆనుకుని సరుగుడు తోటలో బయటపడిన మృతదేహాంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో హత్యచేసి మధ్యాహ్న సమయంలో తీసుకువచ్చి విడిచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. తల, ముఖం, కుడికన్నుపై గాయాలను బట్టి చూస్తే.. ఎవరో ఆమెను చెరిచి, హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన నుంచి సమాచారం అందుకున్న ఎస్సై అలీఖాన్ అక్కడికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. విషయాన్ని ఇన్చార్జి సీఐ, పెద్దాపురం డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. డీఎస్పీ రాజశేఖరరావు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మహిళ మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆరాతీస్తున్నారు. హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు వివాహేతరం సంబంధం కూడా కారణం ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేత మారినా కదలని కేడర్
జగ్గంపేట : ఒక నేత పోతే... వంద మంది పుట్టుకు వస్తారు. తమ స్వార్థం కోసం ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నాయకులపై ప్రజాగ్రహం ఎన్నికల్లోనే తేటతెల్లమవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను టీడీపీలో చేర్చుకోవడంతో జగ్గంపేటలో ఆ పార్టీ పని అయిపోయిందని ప్రచారాన్ని సాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ జగ్గంపేట నియోజకవర్గంలో సంక్షోభంలో ఉందని చెప్పేవారికి సరైన సమాధానంగా ఆదివారం నియోజకవర్గ స్థాయిలో జగ్గంపేటలో జరిగిన సమావేశం బదులిచ్చింది. పార్టీ సేవాదళ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం స్థానిక కొత్త కొండబాబు కాంప్లెక్స్‌లోని సమావేశపు హాలులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, జగన్మోహన్రెడ్డి మద్దతుదారులతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి తొలుత పూలమాల వేసి దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశపు హాలు సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సమావేశం అనంతరం గ్రామంలో ప్రదర్శన నిర్వహించి మెయిన్ రోడ్డు సెంటర్లోని రాజశే ఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై సమావేశంలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘురామ్ మాట్లాడుతూ పార్టీ మారిన నేత తనకు జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యం ఇవ్వలేదనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవితోపాటు కీలకమైన సీజీసీ సభ్యత్వం, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పదవిని కట్టబెట్టారన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు చెబుతున్న ఆయన రానున్న మూడేళ్లలో ఎంత మందికి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇస్తారో చూస్తామన్నారు.పార్టీ పురోభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముత్యాల శ్రీనివాస్, వరసాల ప్రసాద్, కర్రి సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దారుణ భారం
చిన జగ్గంపేట (గొల్లప్రోలు) : పంట చేతికి దక్కకపోగా.. సాగు చేయడానికి చేసిన అప్పులు వడ్డీతో పెరిగి ఉరితాడై ఆ కౌలు రైతు పీకను చుట్టుకున్నాయి. అప్పులు తీర్చే దారిలేకపోవడంతో చినజగ్గంపేట గ్రామానికి చెందిన కౌలు రైతు మొగలి సుబ్బారావు ఉరి వేసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అప్పారావు పత్తి పంట సాగు చేయడంతో పాటు జీడిమామిడి తోటల్లో దిగుబడిని కొనుగోలు చేస్తుంటాడు. ఈ ఏడాది 4 ఎకరాల పొలాన్ని రూ.60 వేలకు కౌలుకు తీసుకుని, పత్తి సాగు చేశాడు. సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు, నాసిరకం విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో చే తికందిన పంటతో కనీసం పెట్టుబడి కూడా దక్కలేదు. సాగుకు చేసిన అప్పులు పేరుకుపోయాయి. కాగా గతేడాది శ్రీకాకుళం జిల్లాలో జీడిమామిడితోట ఫలసాయాన్ని కొనుగోలు చేశాడు. హుద్‌హుద్ తుపాను కారణంగా తోటలు తుడుచుపెట్టుకుపోవడంతో రూ.1.50 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. పత్తి, జీడిమామిడి పంటలకు సుమారు రూ.3.5 లక్షల మేర అప్పులు పేరుకుపోయాయి. వారం రోజులుగా మనోవేదన అప్పులు ఎలాతీర్చాలో తెలియక వారం రోజులుగా అప్పారావు మనోవేదనకు గురైనట్టు స్థానికులు పేర్కొన్నారు. అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తేవని తెలిపారు. కొన్ని సందర్భాల్లో భోజనం చేయకుండా ఇంటి వద్దే నీరసంగా కనిపించేవాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెడలో ఉన్న తువాలుతో ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం భార్య వెంకటలక్ష్మి లేచి చూసేసరికి అప్పారావు విగతజీవుడై కనిపించడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. రెక్కల కష్టంపైనే.. ఇలాఉండగా అప్పారావుకు భార్య వెంకటలక్ష్మితో పాటు కుమార్తెలు నాలుగో తరగతి చదువుతున్న కృష్ణవేణి, ఒకటో తరగతి చదువుతున్న దుర్గారేవతి ఉన్నారు. మేనత్త అచ్చమ్మ, అన్నయ్య కుమారుడు వెంకటరమణను అతడే రెక్కల కష్టంపై పోషిస్తున్నాడు. అతడి మరణంతో ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది. తండ్రి మృతదేహాన్ని అమాయకంగా చూస్తూ చిన్నారులు.. ‘నాన్న.. నాన్న’ అంటూ కన్నీరుపెట్టుకోవడం చూపరుల హృదయాలను కలచివేసింది. తనను ఎవరు చూస్తారంటూ మేనత్త అయిన 70 ఏళ్ల అచ్చమ్మ కన్నీరుమున్నీరైంది. కనీసం పక్కా ఇల్లు కూడా లేకుండా, తాటాకింట్లో ఉంటున్న అప్పారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ గాది వెంకన్న, ఎంపీటీసీ సభ్యుడు గుర్రం సుబ్బారావు కోరారు. -
ఉన్నవాళ్లు పోతేనే కొత్త పింఛన్ ఇచ్చారు
జగ్గంపేట : ‘తొమ్మిదిన్నర ఏళ్ల మీ తండ్రి పాలనలో పింఛన్ రూ.75 ఇచ్చేవారు... కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఒక పింఛన్‌దారు చనిపోవలసిందే. వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా అర్హులందరికి రూ.200 పింఛన్ ప్రతినెలా 1న జీతం మాదిరిగా ఇచ్చా రు. ఇది మరచి ప్రస్తుతం రూ.1000 పింఛన్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తగదు’ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు జిల్లా పరిషత్ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ హితవు పలికారు. మంగళవారం జగ్గంపేట బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లోకల్ ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించడంపై బుధవారం నవీన్ విలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు. స్థానిక జేవీఆర్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో నవీన్ మాట్లాడుతూ ఎన్నికల్లో డ్వాక్రా, రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలపైనే నెహ్రూ ప్రశ్నించారన్నారు. 18 నెలల పాలనలో రూ.1.15 లక్షల కోట్లకు గాను ఎంత రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. తన తండ్రి జ్యోతుల నెహ్రూ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అధికారంతో నిమిత్తం లేకుండానే నియోజకవర్గ అభివృద్ధికి పోరాడి నిధులు సాధించారని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజ మెత్తారు. పార్టీ నాయకులు బుర్రి సత్తిబాబు, రేకా బులిరాజు, జేమ్స్, గోపి పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసమే జగన్ నిరవధిక దీక్ష
అందరూ అండగా నిలవాలి 27 నుంచి జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలి వైఎస్సార్సీపీ శ్రేణులకు జ్యోతుల నెహ్రూ పిలుపు జగ్గంపేట :రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని, ఇందులో భాగంగానే తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో గురువారం జరిగిన గ్రామ, మండల కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా జగన్ గుంటూరులో శనివారం నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్నారన్నారు. దీనికి మద్దతుగా గ్రామ, నియోజవర్గ నాయకులు సమన్వయంతో జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాలన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతోందని, ఆర్థిక వనరులు లేక ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిశ్రమలు రాకుంటే నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందని, యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని జ్యోతుల ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాబు వస్తే జాబు’ అన్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదర్శ రైతులను తొలగించారని, ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 2600 ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ముఖ్య కారకుడైన చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని రాజ్యసభలో చేసిన ప్రకటన, వెంకయ్యనాయుడు హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలని ప్రజలకు జ్యోతుల విజ్ఞప్తి చేశారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్పేలా చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందని, ప్రజాపక్షాన నిలచి పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్, జెడ్పీటీసీ సభ్యులు వీరంరెడ్డి కాశీబాబు, పాలూరి బోస్‌బాబు, ఎంపీపీలు గుడేల రాణి, కంచుమర్తి రామలక్ష్మి, అత్తులూరి సాయిబాబు, మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల సామగ్రి భద్రతకు లాకర్లు
జగ్గంపేట : గోదావరి పుష్కరాలకు భక్తుల రద్దీ అధికంగా ఉన్న ఘాట్ల వద్ద లాకర్ సదుపాయం కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ లాకర్లను జగ్గంపేట పార్టీ కార్యాలయం వద్ద తయారుచేయించే పనిలో జ్యోతుల నిమగ్నమయ్యారు. సుమారు రూ.8 లక్షలతో వంద లాకర్లు తయారు చేయిస్తున్నారు. రెండు రోజులు గా పెద్దాపురం, జగ్గంపేట మండలాల్లోని కార్పెంటర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. భక్తులు లగేజిని లాకర్లలో ఉచితంగా భద్రపర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నా రు. భక్తులకు తాగునీరు, పాలు, మజ్జిగ సదుపాయాలతోపాటు సమాచారం, ఇత ర సదుపాయాలను పార్టీ శ్రేణులు అందజేయనున్నాయి. శనివారం పార్టీ కార్యాల యం వద్ద తయారవుతున్న లాకర్లను పరిశీ లించిన జ్యోతుల నెహ్రూ రాత్రి పగలు తేడా లేకుండా రెండు రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని అక్కడ కార్పెంటర్లకు సూ చించి పలు సలహాలు, సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారని, ప్రభుత్వపరం గా కాకుండా తమ పరంగా వైఎస్సార్ కాం గ్రెస్ తరఫున సదుపాయాలు కల్పించేం దుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే ఘాట్ల వద్ద లాకర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్నానమాచరించేందుకు వచ్చే భక్తులు త మ లగేజిని లాకర్ల వద్ద భద్రంగా ఉంచుకోవచ్చన్నారు. లాకర్ల తాళాలను కూడా భక్తులకు అందజేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, జంపన సీతారామచంద్రవర్మ, భూపాలపట్నం ప్రసాద్, కెంగం రమణ, తాతాజీ ఉన్నారు. -
కష్టజీవుల్ని కాటేసిన..కల్తీ కోర
జగ్గంపేట / గోకవరం :కష్టంతో పులిసే ఒళ్లు కాస్త తేలిక పడాలని తాగిన మత్తుపానీయమే వారి పాలిట మృత్యుఘాతమైంది. ఎప్పుడూ తాగే కల్లే వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. ఇద్దరిని బలి తీసుకుని, నలుగురిని ఆస్పత్రుల పాల్జేసింది. పేద కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గోకవరం మండలం రంపయర్రంపాలెంలో కల్తీ కల్లు సృష్టించిన దారుణానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దాకారపు శ్రీను (39), నాగులపల్లి దుర్గారావు (32) శుక్రవారం ఉదయం గ్రామంలోని కల్లు వ్యాపారి కాళ్ల చంద్రరావు వద్ద కల్లు తాగిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. అదే దుకాణంలో కల్లు తాగిన అదే గ్రామానికి చెందిన కోశెట్టి గంగరాజు, కాళ్ల వెంకటేశ్వరరావు, పెబ్బిలి శివ, సుంకర శ్రీను, గేదెల వీర్రాజు, రాజానగరం మండలం కానవరానికి చెందిన పితాని సత్తిబాబులకూ వాంతులయ్యూరుు. వీరంతా వ్యవసాయ కూలీలే. దాకారపు శ్రీను, దుర్గారావులను కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే దుర్గారావు మృతి చెందాడు. శ్రీను చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. దుర్గారావుకు మూడేళ్ల క్రితం వివాహం కాగా ప్రస్తుతం భార్య గర్భవతి. శ్రీనుకు భార్య, కుమార్తె ఉన్నారు. అస్వస్థతకు గురైనవారిలో గంగరాజు రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో, పితాని సత్తిబాబు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివ, సుంకర శ్రీనులను గోకవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు, వీర్రాజుల ఆరోగ్యం కుదుటపడింది. అంత్యక్రియలకు తరలిస్తుంటే అడ్డుకున్న అధికారులు కల్తీ కల్లుతో జరిగిన దారుణం విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా శనివారం ఉదయం పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు. దుర్గారావు మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకువెళుతుండగా అడ్డుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజమండ్రి అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్ మృతదేహాలను పరిశీలించి, రంపయర్రంపాలెంలో విచారణ నిర్వహించారు. కల్లు అమ్మిన చంద్రరావును గోకవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎస్సై ఆర్.శివాజీ కేసు నమోదు చేసి, రాజమండ్రి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. చంద్రరావు దుకాణంలోని కల్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాంబాబు, రంపచోడవరం ఎక్సైజ్ సీఐ చిట్టిబాబు సంఘటనపై విచారణ నిర్వహించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శివాజీ తెలిపారు. కల్తీ కల్లు సంఘటన గోకవరం మండలంలో ఇదే ప్రథమం. కాగా గుమ్మళ్లదొడ్డిలో నాలుగేళ్ల క్రితం కల్తీ సారా తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. కలిపింది క్లోరల్ హైడ్రేడా? మరొకటా? కల్తీ కల్లు సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తాటి గెలలు వాడిపోతూ కల్లు దిగుబడి తగ్గడంతో, దానిలో నిషా తగ్గకుండా ఎక్కువ కల్లుగా మార్చేందుకు క్లోరల్ హైడ్రేడ్ కలిపారన్న అనుమానం వ్యక్తమవుతోంది. క్లోరల్ హైడ్రేడ్‌ను కలపడం వల్ల లీటరు కల్లునే నాలుగులీటర్లుగా తయారు చేయవచ్చని అంటున్నారు. కల్లులో తాగిన వారికి చేటు కలిగించే ఏ పదార్థం కలిసిందన్నది ల్యాబ్ పరీక్షల్లో తేలాల్సి ఉంది. కాగా కల్లు వ్యాపారి చంద్రరావుకు వేరొకరితో కల్లు తీసుకునే తోట లీజు సొమ్ము విషయమై వివాదం నేపథ్యంలో అతడి దుకాణంలోని కల్లును కావాలనే విషపూరితం చేశారా అన్న అనుమానమూ వ్యక్తమవుతోంది. క్లోరల్ హైడ్రేడ్ విషంతో సమానం.. కల్లులో కల్తీకి వినియోగించే క్లోరల్ హైడ్రేడ్ విషంతో సమానమని జగ్గంపేట ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ జి.ఎస్.చార్లెస్ చెప్పారు. అది చిన్నమెదడు పనిచేయకుండా మొద్దుబారుస్తుందని, గ్యాస్ట్రైటిస్ (కడుపులో పుండ్లు) వచ్చి విపరీతంగా వాంతులు అవుతాయని చెప్పారు. కొన్ని సార్లు ప్రాణాలు పోతాయన్నారు. -
కబళించిన మృత్యువు
వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ జగ్గంపేట వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం 12 మందికి గాయాలు జగ్గంపేట :పొట్ట కూటి కోసం వేకువజామునే చెరువులో చేపలు పట్టేందుకు వచ్చి ఇళ్లకు తిరిగి వెళ్లకుండానే జట్టులో ఇద్దరిని జగ్గంపేట వద్ద రోడ్డు ప్రమాదం శనివారం రాత్రి మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై స్థానిక కృష్ణవేణి థియేటర్ సెంటర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలేరా వ్యాన్‌ను రాజమండ్రి వైపు వెళుతున్న లారీ వేగంగా ఢీకొంది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సుమారు 15 మందిలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శంఖవరానికి చెందిన పులి కృష్ణ (40) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన పులి నాగేశ్వరరావు (45) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలో మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి వివరాలిలా వున్నాయి. మండలంలోని కాండ్రేగుల గ్రామంలో గడివారి చెరువులో చేపలు పట్టేందుకు శంఖవరం మండలం నుంచి వ్యాన్‌పై శనివారం ఉదయమే సుమారు 15 మంది జట్టు సభ్యులు వచ్చారు. వీరంతా చేపలు పట్టి వాటిని లోడు చేసిన తరువాత తిరిగి ఇంటికి వె ళ్లాల్సి ఉంది. లోడు పూర్తయ్యేందుకు రాత్రి ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో భోజనం కోసం జగ్గంపేట వచ్చారు. హైవే కూడలిని దాటి వస్తున్న వీరి వాహనాన్ని తమిళనాడు వెళ్లే లారీ బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్‌లో ఉన్న కృష్ణ కింద పడిపోగా తలపై నుంచి చక్రాలు వెళ్లిపోయాయి. వ్యాన్ పల్టీలు కొట్టి తుని వైపు మార్గం మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంతో వాహనంలో ఉన్న నాగేశ్వరరావు ఎడమ కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. జట్టు కూలీలు ఒకరి తరువాత ఒకరు అన్నట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై సురేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నిలుపుదల చేసి క్షతగాత్రులను 108, హైవే పెట్రోలింగ్ వాహనం, ప్రైవేటు ఆటోలోనూ పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని జగ్గంపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. 108లో తరలిస్తుండగా కాలు నుజ్జయిన నాగేశ్వరరావు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చిట్టుమూరి నాగేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. పెద్దాపురంలో ప్రథమ చికిత్స అనంతరం కొందరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో మాతా సూరిబాబు, మేడిపాము కన్నారావు, మాకిరెడ్డి రాజబాబు, మేడిపాము సింహాచలం, కృష్ణ, సంగాడ వీరబాబు, ప్రవీణ్, పాదాలయ్య, సత్తిబాబు తదితరులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ కాకుండా వేరే వ్యక్తి వ్యాన్ నడుపుతున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు జ్యోతుల రాక
జగ్గంపేట : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారం జిల్లాకు రానున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో పర్యటించిన ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేశారు. విమానాశ్రయం నుంచి జ్యోతుల నరేంద్రపురం, రాజానగరం, గండేపల్లి, జగ్గంపేటల మీదుగా స్వగ్రామమైన ఇర్రిపాక వెళతారు. -
సినిమాకి బయలుదేరి... మృత్యుఒడికి చేరాడు
జగ్గంపేట : పండగ రోజు సినిమాకి వెళ్లాలని ఇంటినుంచి ఉత్సాహంగా బయలుదేరిన ఇద్దరు యువకులు కొద్ది దూరంలోనే ప్రమాదానికి గురయ్యారు. వారిలో కుంచా నగేష్ (19) మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో యువకుడు రంపా మణికంఠ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని జె. కొత్తూరు- జగ్గంపేట రోడ్లో పెట్రోల్‌బంక్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాజపూడికి చెందిన మణికంఠ, నగేష్‌లు సినిమాకు వెళ్లాలని మధ్యాహ్నం 2-30 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై జగ్గంపేట బయలుదేరారు. జగ్గంపేట సమీపంలోని పెట్రోల్ బంక్ మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు తగిలాయి. నగేష్‌కు పొట్ట కింది అవయవాలు బాగా దెబ్బతినడంతో పరిస్థితి విషమించింది. తొలుత పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి 108 వాహనం రావడం ఆలస్యం కావడంతో పోలీస్జీప్లోనే క్షతగాత్రులను తరలించారు. వీరి బైక్‌ను ఢీకొన్న మరో మోటార్‌సైకిల్ చోదకుడు ఆగకుండా వెళ్లిపోయాడని, అతడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. -
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
జగ్గంపేట :నూతన సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆకాంక్షించారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో నెహ్రూ దంపతులు నిర్మించిన వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద గురువారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం స్వామివారికి లక్షబిల్వార్చన, సాయంత్రం శ్రీనివాస కళ్యాణ వేడుకల్లో నెహ్రూ, మణి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా నెహ్రూ, నవీన్‌కుమార్‌ను అభిమానులు తీసుకొచ్చిన గజ మాలలతో ముంచెత్తారు. జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి, అవినాష్ నెహ్రూ, తోట బబ్బి, సునీత, జ్యోతుల సుబ్బారావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు కర్రి పాపారాయుడు, గిరిజాల స్వామినాయుడు, మిండగుదిటి మోహన్, చిట్టిబాబు, వేణుగోపాలరావు, రామసత్యనారాయణ, మాకినీడి గాంధీ తదితరులు హాజరై జ్యోతులకు శుభాకాంక్షలు తెలిపారు. గోపాలపురంలో.. రావులపాలెం : నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్వగ్రామైన రావులపాలెం మండలం గోపాలపురానికి గురువారం నియోజకవర్గంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూ రు మండలాల నుంచే కాక జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆయన అప్యాయంగా పలకరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లవరంలో.. అడ్డతీగల : నూతన సంవత్సరంలో ఏజెన్సీలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆకాంక్షించారు. అడ్డతీగల మండలం ఎల్లవరంలో గురువారం నూతన సంవత్సరం వేడుకల్లో ఎమ్మెల్యే రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల నుంచి అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రంపచోడవరం ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, పార్టీ మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, జగ్గారావుదొర, ఆదివాసీ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బోండ్ల వరప్రసాదరావు తదితరులు ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తునిలో.. తుని : తుని పట్టణంలో శాంతినగర్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఎమ్మెల్యే రాజాకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలు శాఖల అధికారులు పాల్గొని ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందజేశారు. -
ఉసురు తగలరాదంటే వాగ్దానం నెరవేర్చాలి
జగ్గంపేట : ‘ఆకలి మంటలతో ఉన్న రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా మలచుకున్నావు. అధికారంలోకి వచ్చి అడుగడుగునా వంచన చేశావు. అతికీలకమైన వ్యవసాయాన్ని సర్వనాశనం చేశావు. అన్నదాత ఉసురు తగలకుండా ఉండేందుకు సంపూర్ణ రుణమాఫీని చేపట్టి మాట నిలుపుకో!’- ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పిన మాటలివి. రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సిద్ధమవుతుండగా చంద్రబాబు హడావుడిగా గురువారం రుణమాఫీపై ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై జ్యోతుల స్పందించారు. జగ్గంపేటలో రాత్రి పార్టీ నాయకుడు జీను మణిబాబు నివాసంలో జ్యోతుల మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటన తీరు చూస్తే రైతులను ఎంత చక్కగా మోసం చేయాలో అంత చక్కగా చేశారని అర్థమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి రైతులతో ఆయన మైండ్ గేమ్ ఆడుకున్నారని, తొలి సంతకం పేరుతో మాఫీకి కాకుండా కేవలం విధివిధానాలకు కోటయ్య కమిటీ వేసి సరిపెట్టారన్నారు. పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన ఆయన మాట మార్చి పంట రుణాలకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. తరువాత రూ.1.5 లక్షల షరతు పెట్టారని, రూ.87 వేల కోట్లకు గాను కేవలం బడ్జెట్‌ను రూ.5 వేల కోట్లకు కుదించారని, ఇలా ప్రతి అంశంలో రైతులను మోసం చేస్తూ వచ్చారని ధ్వజమెత్తారు. రైతాంగం రుణాలన్నింటినీ రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తిగా రద్దు చేయాలని, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణ మాఫీ హామీని నెరవేర్చాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. డిమాండ్ల సాధనకు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, మంతెన నీలాద్రిరాజు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ స్థాయిలో హాస్టళ్ల అభివృద్ధి
జగ్గంపేట : పేద, బలహీనవర్గాల విద్యార్థులు చదువుకునే వసతిగృహాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. జగ్గంపేటలోని వెలుగు గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వసతిగృహ ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. ఆమె నిర్లక్ష్యం వల్లే ఇటీవల కలుషితాహారం తిని విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని, వారికి భద్రత కరువైందని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు పులి ప్రసాద్, పీడీఎస్‌యూ విజృంభణ నాయకులు రమేష్, సతీష్ మంత్రికి వివరించారు. ఆమెను సస్పెండ్ చేయాలని వినతిపత్రాన్ని అందించారు. ఆ ఫిర్యాదులను ఆలకించిన మంత్రి వసతి గృహంలో విద్యార్థినుల సంఖ్యపై ఆరా తీశారు. సాంఘిక సంక్షేమ శాఖ కన్వీనర్‌తో ఫోన్లో మాట్లాడి ఎంత మంది విద్యార్థినులు ఉండాలో తెలుసుకున్న రావెల ప్రిన్సిపాల్ ఇందిరా దేవిని విద్యార్థినుల సంఖ్య గురించి అడిగారు. 470 మంది విద్యార్థినులు ఉండాల్సి ఉండగా 407 మంది చదువుతున్నారని, ప్రస్తుతం 293 మందే ఉన్నారని ఆమె తెలిపారు. దీంతో వసతులు, బోధనా తీరు, సిబ్బంది గురించి ఆమెను మంత్రి ప్రశ్నించారు. ఆమె నుంచి సరైన సమాధానం రాలేదు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వసతి గృహంలో విద్యార్థినులు కలుషితాహారం తిని 50 మందికిపైగా అస్వస్థతకు గురైనట్టు తెలిసిందని, ఇందుకు బియ్యం కానీ, నీటి తేడా కానీ కారణం అయి ఉండవచ్చని ఎమ్మెల్యే నెహ్రూ చెప్పారని, ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదులు వచ్చినందున జోనల్ కన్వీనర్‌తో విచారణ చేయించి లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. నేను తెలుసా అని వారిని ప్రశ్నించగా.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అని విద్యార్థినులు బదులిచ్చారు. డయల్ యువర్ మినిస్టర్ పేరుతో టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని, సమస్యలేమైనా ఉంటే దానికి ఫోన్ చేయాలని సూచించారు. నోటీసు బోర్డులో టోల్ఫ్రీనంబరు1800-4251-352 ఉంటుందని వివరించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జనవరి నుంచి వసతిగృహాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేందుకు క్లస్టర్ అప్రోచ్ పేరుతో మూడు స్కూళ్లను కలిపి సుమారు 2,000 మంది విద్యార్థులతో ఒకచోట ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ఇంగ్లిషు మీడియంతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే చర్యలు చేపడతామన్నారు. జగ్గంపేట గురుకుల పాఠశాల మేడపై నుంచి ఇటీవల పడి గాయపడిన విద్యార్థినిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తానూ వసతి గృహంలోనే చదువుకున్నానని, 1987లో ఐఏఎస్ పాసయ్యానని మంత్రి కిశోర్‌బాబు వివరించగా, స్థానిక ఎమ్మెల్యే నెహ్రూ కలగజేసుకుని జగ్గంపేట ఎస్సీ బాలుర వసతి గృహాలకు చెందిన వార్డెన్ స్వామి విద్యార్థులను తండ్రిలా చూసుకుంటారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ గుడేల రాణి, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, వైఎస్సార్ సీపీ నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
జగ్గంపేటలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బాలికల గురుకుల పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరాదేవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు వాహనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గురుకులంలో శనివారం కలుషితమైన ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై మంత్రి రావెల కిషోర్‌బాబు స్పందించారు. తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత గురైన చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. -
ముప్పు ‘కప్పు’రంబు!
జగ్గంపేటలో శిథిలమైన పశువైద్యశాల నాలుగేళ్లుగా బిక్కుబిక్కుమంటూ సిబ్బంది సేవలు ప్రారంభం కాని నూతన భవనం జగ్గంపేట (తూర్పుగోదావరి జిల్లా): గతమెంతో ఘనం... ప్రస్తుతం హీనం... ఇదీ జగ్గంపేట పశువుల ఆస్పత్రి పరిస్థితి. భవనం నిర్మించినా అది ప్రారంభం కాకపోవడం, సిబ్బంది అంతంతమాత్రంగా ఉండడంతో ఇక్కడ పశు వైద్యసేవలు అందడం లేదు. దీంతో పాడి రైతులు నానాఅవస్థలు పడుతున్నారు. పెంకుల భవనంలో... నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట పశువులాస్పత్రి భవనం భయపెడుతోంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పెంకుల భవనంలోనే వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. పెంకులు ఒక్కొక్కటిగా కిందకి జారిపోయి, పైకప్పు ఊడిపోయి, గోడలు బీటలు వారాయి. సుమా రు నాలుగేళ్ల క్రితం ప్రస్తుత కాకినాడ ఎంపీ, అప్పట్లో ఎమ్మెల్యే హోదాలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే భవన నిర్మాణ పనులు పలు సార్లు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టగా నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. దీంతో ఎస్టిమేషన్ రేట్లతో సంబంధిత కాంట్రాక్టర్ నిర్మాణం పనులను ఉపసంహరించుకున్నారు. సుమారు నాలుగేళ్లు సాగిన నూతన భవనం నిర్మాణ పనులు మరో కాంట్రాక్టర్ ద్వారా రివైజ్డ్ ఎస్టిమేషన్లతో చేపట్టారు. ఇంతా చేస్తే ఆ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. గత వైభవం కోల్పోయి... గతంలో జగ్గంపేట పశువులాస్పత్రికి పెద్ద పేరుండేది. గ్రామంలోని రైతులుతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలను తీసుకువచ్చి వైద్యం చేయించేవారు. ముఖ్యంగా చూడి పశువులకు వైద్య సేవలతో పాటు ఎదకు రాని గేదెలకు పరీక్షలు చేశారు. అలాగే గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందులు వేసేవారు. ఇక్కడ పనిచేసే వైద్యుడికి బదిలీ కావడం.. ఆయన స్థానంలో వైద్యుడు చాలా కాలం రాకపోవడంతో కేవలం కాంపౌండర్ మాత్రమే సేవలందించేవాడు. ఇటీవల అతడు కూడా బదిలీ అయ్యాడు. రెండు రోజుల క్రితం సత్యనారాయణ అనే వైద్యుడు విధుల్లోకి చేరారు. పూర్వ వైభవం తీసుకురావలసిన బాధ్యత ఆయనపైనే ఉందని రైతులు పేర్కొంటున్నారు. -
బాధితుల దరికి ‘ఆపన్న హస్తం’
జగ్గంపేట : గూడు చెదిరి, గుండె చెదిరిన హుదూద్ తుపాను బాధితులకు లక్ష కిలోల బియ్యం పంపిణీ చేయాలని కంకణం కట్టుకున్న ‘వైఎస్ జగన్ ఆపన్న హస్తం’ స్వచ్ఛంద సేవాసంస్థ లక్ష్యాన్ని సాధించింది. విశాఖ జిల్లాలో తుపాను బాధితుల కడగండ్లకు చలించిన సంస్థ అధ్యక్షుడు, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ వారి కోసం తలపెట్టిన ఈ బృహత్కార్యానికి అనేకులు సహకరించారు. అనుకున్న మేరకు లక్ష కిలోల బియ్యం సేకరణ పూర్తి కావడంతో 20 కిలోల చొప్పున 5 వేల కుటుంబాలకు అందించేందుకు ప్యాకెట్లలో నింపారు. వాటితో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట నుంచి గురువారం విశాఖ జిల్లాకు బయల్దేరిన పది లారీలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జెండా ఊపారు. వాటిని యలమంచిలి, అరకు, పాడేరు తదితర ప్రాంతాలలో బాధితులకు అందజేస్తామని సంస్థ అధ్యక్షుడు నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవాలన్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు భారీ ఎత్తున సేకరించిన బియ్యాన్ని గిరిజన బాధితులకు ఎక్కువగా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు, అభిమానులు, దాతలు బియ్యం సమకూర్చారని, ఒక్క జగ్గంపేట నియోజకవర్గం నుంచే నాలుగు లారీల బియ్యం వచ్చిందని చెప్పారు. డ్వాక్రా మహిళల కన్నీటి ఫలితమే ‘హుదూద్’ విధ్వంసం ఆడపడుచు కన్నీరు పెట్టుకుంటే అనర్థమని హైందవ ధర్మం చెబుతుందని, రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఇది మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి నెహ్రూ అన్నారు. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం హుదూద్ తుపానుకు దెబ్బ తినడానికి ఆడపడుచుల కన్నీరే కారణన్నారు. డ్వాక్రా, రైతు రుణాలు తక్షణమే మాఫీ చేయాలని తాము నిర్వహించిన ధర్నాలకు అనూహ్య స్పందన లభిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, సుంకర చిన్ని, అల్లు రాజబాబు, కత్తిపూడి శ్రీను, సీల రమణ, సోమవారం రాజు, రమణారెడ్డి, జనపరెడ్డి బాబు, జీను మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, ఒమ్మి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. అచ్యుతాపురంలో బియ్యం పంచిన నవీన్ అచ్యుతాపురం(విశాఖ జిల్లా) : ‘వైఎస్ జగన్ ఆపన్న హస్తం’ స్వచ్ఛంద సంస్థ తరఫున తూర్పు గోదావరి జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో సేకరించిన లక్ష కిలోల బియ్యం గురువారం విశాఖ జిల్లాకు చేరింది. అందు లో 30 టన్నుల బియ్యం యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున విశాఖ జిల్లాలో పలు ప్రాంతాలకు సహాయం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రకటనలు చేయడం మినహా నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రగడ మాట్లాడుతూ గ్రామాల్లో బాధితులను గుర్తించి సాయం అందిస్తామన్నారు. అచ్యుతాపురానికి చెందిన కొందరు బాధితులకు నవీన్ చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు జమీల్, జంగారెడ్డి జేమ్స్, జంపన రవివర్మ, మండల వైఎస్సార్ సీపీ నాయకులు లాలం రాంబాబు, శ్రీనుబాబు, కోన లచ్చన్నాయుడు, పిన్నంరాజు వాసు, నర్మాల కుమార్, ద్వారపురెడ్డి బాపు, కొరుప్రోలు చిన్నారావు, దాసరి లక్ష్మణరావు పాల్గొన్నారు. -
5 నెలల పాలనలో 50 వంచనలు
జగ్గంపేట :ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలకు గుప్పించి అధికారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఐదు నెలల పాలనలో 50 మోసాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. బాబు దగాని నిరసిస్తూ ఈ నెల 5న మండల కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘ఐదు నెలలు-యాభై మోసాలు, బాబు దగాలు... జనం దిగాలు’ పేరిట చేపట్టే ధర్నా పోస్టర్లను ఆదివారం రాత్రి జగ్గంపేటలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రుణాల మాఫీపై పూటకో కట్టుకథ అల్లుతూ చంద్రబాబు కాలం గడపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రుణ మాఫీ అవుతుందో లేదో తెలియని అయోమయంతో పాటు ప్రస్తుతం పెట్టుబడులకు కూడా రుణాలు పొందలేని గడ్డు స్థితిలో ఉన్నారన్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించీ అదే తరహా పిట్టకథలు చెబుతున్నారని, పేదల పింఛన్ల మీద పగ పట్టారని, రేషన్ కార్డులను తీసివేశారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దగా, మోసం, దుర్మార్గాలకు వ్యతిరేకంగా చేపట్టే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, తమ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్, సర్పంచ్ కొలిపే ప్రసన్నరాణి, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, పార్టీ నాయకులు నీలాద్రిరాజు, జీను మణిబాబు, సోమవరం రాజు, ఒమ్మి రఘురామ్, తోలుగంటి గోవిందరెడ్డి, కింగం రమణ, రాంబాబు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
క్షుధార్తుల కోసం లక్ష కిలోల బియ్యం
జగ్గంపేట : కడలి తీరంలో కళకళలాడిన మహానగరం విశాఖపట్నం.. ఆ కడలిలోనే పుట్టిన ముప్పుతో కళా విహీనమైంది. ఏకకాలంలో జల, వాయుఖడ్గాలతో విరుచుకుపడి, హుదూద్ జరిపిన దాడితో.. ఇప్పుడా నగరంలో ఎక్కడ చూసినా శోకం, చీకటి, ఆకలి తాండవిస్తున్నాయి. మానవత్వం కలిగిన వారి హృదయాల్ని కదిస్తున్నాయి. చేయూతనిచ్చేందుకు కదిలి వచ్చేలా చేస్తున్నాయి. అదిగో.. ఆ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, జిల్లా పరిషత్‌లో ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ చలించిపోయారు. విశాఖలో లక్షలమంది ప్రజల క్షుద్బాధను తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని సంకల్పించారు. తాను నిర్వహిస్తున్న ‘వైఎస్ జగన్ ఆపన్నహస్తం’ స్వచ్ఛంద సంస్థ తరఫున లక్ష కిలోల బియ్యం సేకరించి, విశాఖలో పేదలు నివసించే ఒక ప్రాంతంలో అయిదువేల కుటుంబాలకు 20 కిలోల చొప్పున పంచాలని నిశ్చయించుకున్నారు. మూడు, నాలుగురోజుల్లోనే బియ్యం వారికి అందజేయాలన్న ధ్యేయంతో ఆదివారం సాయంత్రం జగ్గంపేటలో బియ్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని జీతాలు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగో తరగతి ఉద్యోగుల్లో సుమారు 1400 మందికి బియ్యం, నిత్యావసర సరుకులను ‘వైఎస్ జగన్ ఆపన్నహస్తం’ తరఫున గతంలో అందజేసినట్టు చెప్పారు. ఇప్పుడు విశాఖలో హూదూద్ బాధితులకు లక్ష కిలోల బియ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మానవతావాదులు తన సంకల్పం సాకారమయ్యేందుకు సహకరించాలని కోరారు. బియ్యం సేకరణకు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తామని, దాతలు తన మొబైల్ నం: 98662 58888లో సంప్రదించాలని చెప్పారు. నవీన్‌కుమార్ సంకల్పాన్ని అభినందిస్తూ గ్రామానికి చెందిన కొత్త కొండబాబు 500 కిలోల బియ్యం అందజేశారు. కార్యకమంలో వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, కొండబాబు, ఒమ్మి రఘురామ్, నీలాద్రిరాజు, వెలిశెల్లి శ్రీను, డ్రిల్ మాస్టారు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై షరతులు సరికాదు
జగ్గంపేట :అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రుణమాఫీపై షరతులు విధించడం సమంజసం కాదని అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పార్టీ పిలుపు మేరకు జగ్గంపేటలో ఆదివారం నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ. 1 లక్షా 2వేల కోట్ల రుణాలున్నాయని వీటిలో రూ. 87వేల కోట్లు రైతులవి కాగా రూ. 14 వేల కోట్లు డ్వాక్రా సంఘాల వారివన్నారు. ఈ రుణాలన్నింటిని మాఫీ చేస్తానని నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చారని ఆరోపించారు. రైతులను దొంగలుగా చిత్రీకరించి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీని ప్రకటించాలని, లేని పక్షంలో ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందన్నారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్, వైస్ ఎంపీపీ, పార్టీ మండల కన్వీనర్ మారిశెట్టి భద్రం, ఒమ్మి రఘురామ్, నాలుగు మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మూడేళ్లలో పోలవరం పూర్తి చేయాలి
జగ్గంపేట : పోలవరం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున మూడేళ్లలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు బాధ్యత తీసుకోవాలని వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. స్థానిక జేవీఆర్ కాంప్లెక్స్‌లో సోమవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఆమోదించడం హర్షణీయమన్నారు. సభలో జరిగిన చర్చలో హోం మంత్రి సమర్థంగా వివరణ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ పున్వర్విభజన బిల్లులో పోలవరం ప్రాజెక్టును ఉంచడం, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం ఉభయ రాష్ట్రాలకు మంచిదన్నారు. దేశంలో నదుల అనుసంధానికి పోలవరం ద్వారా నాంది పలికనట్టవుతుందన్నారు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణ బేసిన్‌కు నీరు మళ్లించడం ఇదే మొట్టమొదటిది అవుతుందన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు పబ్బంగడుపుకొనేందుకు, ఉనికి కాపాడుకునేందుకు పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులు పోలవరం డిజైన్ మార్చకపోతే అమలాపురం మునిగిపోతుందని చెబుతున్నారు, అసలు పోలవరం నైసర్గిక స్వరూపాన్ని తెలుకుని ఆయన మాట్లాడాలన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించవద్దని కోరారు. ఇటీవల జరిగిన బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్ల నిధులు అరకొరగా కేటాయించారన్నారు. తమ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిధులను కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపే ఆర్డినెన్స్ ఆమోదంపై రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ తరఫు సభ్యులను అభినందిస్తున్నామన్నారు. -
రైతు రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వండి
జగ్గంపేట : ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నందున రైతులను ఆదుకునేందుకు రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కోరారు. ప్రతిపక్షం తరఫున ఆయన మంగళవారం అసెంబ్లీలో తన వాణి వినిపించారు. మెట్ట ప్రాంతానికి చెందిన తాను వ్యవసాయంతోనే జీవనోపాధిని పొందుతున్నానని, రైతు సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. రైతుల వద్ద పెట్టుబడులు పెట్టేందుకు సొమ్ములు లేవని, బ్యాంకర్లు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులకు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే రుణ మాఫీపై స్పష్టత ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ఆర్థిక సంస్కరణలను గురించి ప్రస్తావిస్తూ గత టీడీపీ హయాంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుప్పకులిందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సు కోసం సూచనలు, సలహాలు ఇస్తుందని, వాటిని ఆచరించాల్సిన బాధ్యత పాలక పక్షంపై ఉందన్నారు. -
ట్యాంకర్‌ను ఢీకొన్న టిప్పర్
జగ్గంపేట : ఎన్‌హెచ్‌పై రామవరం గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ఆగివున్న మిథనాల్ ట్యాంకర్‌ను హెవీ టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏలేశ్వరం మండలం సిరి పురం గ్రామానికి చెంది న టిప్పర్ క్లీనర్ దొడ్డి రమేష్ (20) క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెందాడు. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ రమణ, ట్యాంకర్ క్లీనర్ అనకాపల్లి మండలానికి చెందిన రమణలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం నుంచి మిథనాల్ లోడుతో వస్తున్న ట్యాంకర్ రామవరం వద్దకు వచ్చే సరికి వెనక టైరు గాలి తగ్గింది. దీంతో పెట్రోల్ బంక్ సమీపంలో ట్యాంకర్‌ను రోడ్డు పక్కనే ఉంచి డ్రైవర్ మధు, క్లీనర్ రమణలు టైరు మార్చుకుంటున్నారు. ఆ లారీని ఏలేశ్వరం నుంచి క్వారీ డస్ట్ లోడుతో జగ్గంపేట వైపు వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొంది. టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కుని క్లీనర్ రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ రమణ, ట్యాంకర్ క్లీనర్ రమణ తీవ్రంగా గాయపడ్డాడు. ట్యాంకర్ డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. కాగా, క్లీనర్ రమేష్ తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదస్థలాన్ని ఎస్సై సురేష్‌బాబు, సిబ్బంది పరిశీలించారు. -
మెట్ట, గిరిసీమల్లో ఫ్యాన్ హోరు
సాక్షి, కాకినాడ :హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్సీపీ ఆశించిన స్థాయిలో కాకపోయినా మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాపై పట్టు సాధించింది. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేటతో పాటు ఏజెన్సీలోని రంపచోడవరం, కోనసీమలోని కొత్తపేట స్థానాలను దక్కించుకొంది. స్వయంగా తోడల్లుళ్ల్లయిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు మంచి మెజార్టీలతో గెలుపొందారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ 15,932 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుపై విజయం సాధించారు. నెహ్రూకు 88,146 ఓట్లు పోలవగా, చంటిబాబుకు 72,214 ఓట్లు దక్కాయి. ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు 3,413 ఓట్ల మెజార్టీతో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబుపై గెలుపొందారు. సుబ్బారావుకు63,693 ఓట్లు, లభించగా, చిట్టిబాబుకు 60,280 ఓట్లు దక్కాయి. గతంలో ఇక్కడ నుంచి సుబ్బారావుపై పోటీ చేసి గెలుపొందిన ముద్రగడ పద్మనాభం ఈసారి ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమయ్యారు. కుప్పకూలిన యనమల కోట టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కంచుకోటను వైఎస్సార్సీపీ నుంచి తొలిసారి బరిలోకి దిగిన దాడిశెట్టి రాజా బద్దలుగొట్టారు. పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేని రాజా.. మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన యనమల సామ్రాజ్యాన్ని కుప్పకూల్చారు. యనమల సోదరుడు కృష్ణుడిపై 18,575 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. రాజాకు 84,755 ఓట్లు పోలవగా, కృష్ణుడుకి 66,182 ఓట్లు దక్కాయి.ఏజెన్సీలోని రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఫ్యాన్ గాలి హోరెత్తింది. ఇక్కడ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంతల రాజేశ్వరి.. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావును, తాజా మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్‌లపై విజయం సాధించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్‌కు ఈ టికెట్ ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన రాజేశ్వరి ఈ సంచలన విజయాన్ని అందుకున్నారు. ఉదయ భాస్కర్ రాజకీయ చతురత, వ్యూహ రచనలు రాజేశ్వరి విజయానికి బాటలు వేశాయి. ఆమె తన సమీప ప్రత్యర్ధి వెంకటేశ్వరరావుపై 8,221 ఓట్ల ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేశారు. ఆమెకు 52,155 ఓట్లు పోలవగా, వెంకటేశ్వరరావుకు 43,934 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన తాజా మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్ అతి తక్కువగా 3,782 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ పోగొట్టుకున్నారు.ఇక కోనసీమలో సైకిల్ దూకుడును తట్టుకొని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సత్తా చాటారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై 713 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. జగ్గిరెడ్డికి 88,357, బండారుకు 87,644 ఓట్లు పోలయ్యాయి. స్వల్ప తేడాతో సునీల్ ఓటమి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో ఐదుచోట్ల విజయం సాధించిన వైఎస్సార్సీపీ స్వల్ప తేడాతో కాకినాడ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. 17వ రౌండ్ వరకూ స్పష్టమైన ఆధిక్యతను కనపర్చిన సునీల్‌పై టీడీపీ అభ్యర్థి తోట నరసింహం కేవలం 3,431 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. -
దశాబ్దం తరువాత జగ్గంపేటలో జ్యోతుల పాగా
జగ్గంపేట, న్యూస్‌లైన్ : మెట్టలోని జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. మోడీ హవా ఉన్నప్పటికీ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నెహ్రూకే పట్టం కట్టారు. తెలుగేదశం పార్టీతో హోరా హోరీగా జరిగిన పోరులో నెహ్రూ 15,932 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం 1,66,343 ఓట్లకు గాను నెహ్రూకు 88,146 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుకు 72, 214 ఓట్లు లభించాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన నెహ్రూ రెండు దఫాలుగా పదవి లేకున్నప్పటికీ నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూ పాలకపక్షంపై పోరాటాన్ని సాగించారు. ఆయన కృషిని గుర్తించిన ప్రజలు దశాబ్ద కాలం తరువాత ఆయనను గెలిపించారు. రెండోస్థానంలో టీడీపీ అభ్యర్థి చంటిబాబు నిలువగా మూడోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి తోట రవి 1900 ఓట్లతో నిలిచారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి మేడుబోయిన గోవిందరాజులుకు 823 ఓట్లు, ఆర్పీఐ అభ్యర్థి పులి ప్రసాద్‌కు 754 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి అనసూరి నాగేశ్వరరావుకు 420 ఓట్లు, సంగీత వెంకటరావుకు 235 ఓట్లు, కొప్పిశెట్టి భాస్కరరావుకు 181 ఓట్లు, గునిపే ఏసయ్యకు 249 ఓట్లు, మరుకుర్తి ఏసుబాబుకు 236 ఓట్లు, మురారి రవికుమార్‌కు 259 ఓట్లు లభించాయి. 796 మంది ఎవరికి ఓటు వేసేందుకు ఇష్ట పడకుండా నోటా ద్వారా తీర్పునిచ్చారు. 130 పోస్టల్ బ్యాలట్ ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితాలు వెల్లడి అనంతరం జ్యోతుల నెహ్రూకు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి రాధాకృష్ణమూర్తి అందజేశారు. అభివృద్ధి బాటలో నడిపిస్తా : జ్యోతుల జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని శాసనసభ్యునిగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ తెలిపారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధానంగా ఐదు సమస్యలను అజెండాగా చేసుకుని ఎన్నికల బరిలోకి వెళ్లానని, వాటిని విశ్వసించిన ప్రజలు తనకు విజయాన్ని అందించారన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి నివేశన స్థలం ఇస్తానని, పోలవరం కాలువకు ఇరువైపులా ఉన్నా ఖాళీ స్థలంలో పటిష్ట భద్రతతో ఇళ్ల నిర్మాణం చేపడతానన్నారు. -
మెట్టలో ప్రతి ఎకరాకు సాగునీరు
జగ్గంపేట/గోకవరం, న్యూస్‌లైన్ :వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్టలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇస్తామని పార్టీ సీజీసీ సభ్యుడు, జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గోకవరం ఆంజనేయస్వామి గుడి సెంటర్లో సోమవారం రాత్రి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన జనభేరి కార్యక్రమంలో జ్యోతుల ప్రసంగించారు. గోకవరం మండలంతో పాటు నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనంతో ప్రధాన రహదారి సుమారు అర కిలోమీటరు మేర కిక్కిరిసింది. ఈ సందర్భంగా జనాన్ని ఉద్ధేశించి జ్యోతుల ప్రసంగించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు ముఖ్యమైన పనులను చేపడతానన్నారు. సాగునీటి సమస్య పరిష్కారంతో పాటు, విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం విశ్వవిద్యాలయం, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి నిర్మాణం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతానన్నారు. ఏలేరును పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. జగ్గంపేటలో 144 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తానన్నారు. ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనతో పాటు కాకినాడ పార్లమెంటు అభ్యర్థి సునీల్‌ను గెలిపించాలన్నారు. వైఎస్సార్ ఆలోచ నలు కలిగి ఉన్న జగన్మోహన్రెడ్డిని ప్రజలు మనసారా కోరుకుంటున్నారని, వైఎస్ చేపట్టిన పనులను పూర్తి చేసే అవకాశం జగన్‌కే సాధ్యమన్నారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ అధికారం కోసం ప్రజలను మభ్యమట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అప్పట్లో సీఎంగా ఉండగా తాను, మరికొందరు ఎమ్మెల్యేలు కలిసి రైతుల అప్పులు మాఫీ చేయమంటే మైండ్ సెట్ మార్చుకోమని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు. అయితే లక్షా 20 వేల కోట్ల రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న చంద్రబాబు నేడు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని ఏ విధంగా అంటున్నారని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల మన్ననలు పొందాలనే స్వార్థంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెబుతున్నాడని, ఇప్పుడు అదే హైదరాబాద్ రాష్ట్ర విభజనకు కారణమయిందన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎన్నికలకు ఎంతో గడువు లేదని ఈ 15 రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక శక్తిగా మారి పార్టీని గెలిపించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, స్వర్ణయుగం రావాలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి జ్యోతుల నవీన్, పార్టీ గోకవరం మండల కన్వీనర్ మంగరౌతు రామకృష్ణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గాజింగం సత్తిబాబు, గోకవరం సొసైటీ అధ్యక్షుడు దాసరి తమ్మన్నదొర, సీనియర్ నాయకులు వరసాల ప్రసాద్, జనపరెడ్డి బాబు, సుంకర వెంకటరమణ, దాసరి దత్తుడు, జిల్లా యూత్ కమిటీ సభ్యుడు దాసరి రమేష్, గోకవరం జెడ్పీటీసీ అభ్యర్థి పాలూరి బోసు, సాలపు నలమహారాజు, ముమ్మన అర్జునరావు, ఇడుదుల అర్జునరావు, మోపర్తి వెంకటకృష్ణారావు, ఆదిరెడ్డి ముత్యం, జగ్గంపేట నాయకులు మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జగ్గంపేట సర్పంచ్ కొలిపే ప్రసన్నరాణి, అత్తులూరి నాగబాబు, సాయిబాబు, బస్వా వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో 150 మంది చేరిక
జె.కొత్తూరు (జగ్గంపేట), న్యూస్‌లైన్ : మండలంలోని జె.కొత్తూరు గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు శనివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వైఎస్సార్ సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ర్టంలో సుస్థిర పాలన సాధ్యమవుతుందన్నారు. పిల్లలకు ఉన్నత చదువులకు అమ్మఒడి, వికలాంగ, వితంతు పింఛన్ల పెంపు తదితర పథకాలను అధికారంలోకి రా గానే అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఏకమై తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. గ్రామంలోని చిన్నయ్యపేట, దళితవాడ, ఈబీసీ కాలనీ వా సులు అధికసంఖ్యలో వైఎస్సా ర్ సీపీలో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ కందికట్ల సింగరమ్మ, కందికట్ల వెంకటరావు, అడపా పుల్లారావు, రాంబాబు, వనెం సుబ్బారావు, నొక్కు చంద్రరావు, నకిరెడ్డి వీర్రాజు, సూరన్న, రాజు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జంపన సీతారామ స్వామి, జనపరెడ్డి సుబ్బారావు, అత్తులూరి నాగబాబు, జీను మణిబాబు, పైడిపాల సూరిబాబు, భూపాలపట్నం ప్రసాద్, వెలిశెట్టి శ్రీను, చల్లా రామ్మూ ర్తి, అడపా నాయుడు, చింతల తాతబ్బాయి, గంటా పకీర్, కేసుబోయిన లోవరాజు పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృతి
జగ్గంపేట, న్యూస్‌లైన్ :కాట్రావులపల్లి మాజీ సర్పంచ్ సుంకర నారాయణ (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. జగ్గంపేట- పెద్దాపురం రోడ్డు మార్గంలో సీతానగరం సమీపంలో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో ఆయన మృతదేహం మంగళవారం పోలీసులకు లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆయన చనిపోయి ఉండవచ్చని, దీంతో మృతదేహం పూర్తిగా పాడైపోయి, దుర్గంధం వెదజల్లుతోంది. సీతానగరం వీఆర్ఓ ఎన్.వెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సీఐ సుంకర మురళీమోహన్, ఎస్సై సురేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి బహిర్భూమికి వెళుతుండగా పక్షవాతం కానీ, గుండెపోటు కానీ, రక్తపోటు వల్ల కానీ ప్రాణం కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విష పురుగు కాటు వల్ల కూడా చనిపోయి ఉండవచ్చంటున్నారు. మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం లేకపోవడంతో, పెద్దాపురం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు సంఘటన స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఉప సర్పంచ్‌గా వ్యవహరించిన నారాయణ అప్పట్లో సర్పంచ్ మరణించడంతో ఇన్చార్జి బాధ్యతలను చేపట్టారు. ఆయనకు భార్య నాగరత్నం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా, 40 ఏళ్ల క్రితమే వారికి దూరమై గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఓ కుమారుడు మరణించగా, భార్య నాగరత్నం, మరో కుమారుడు శ్రీను రాజమండ్రిలో నివసిస్తున్నారు. కుమారుడు రాజమండ్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కుమార్తె లక్ష్మీకుమారి జగ్గంపేటలో ఉంటోంది. ఆస్తిని దుబారా చేయడం వల్లే ఆయన కుటుంబానికి దూరమైనట్టు తెలిసింది. అనుమానాస్పద మృతిగా ఎస్సై సురేష్‌బాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో, అంతిమ సంస్కారాల కోసం రాజమండ్రికి తీసుకువెళ్లారు. -
మంచి పేరు తెచ్చుకోండి
జగ్గంపేట, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలను జగ్గంపేటలో కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌లు మంగళవారంనాటి దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఉదయం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సందర్శించారు. ఆమె తొలుత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ విజయమ్మకు సర్పంచ్‌లను పరిచయం చేశారు. అనంతరం మహిళా సర్పంచ్ల దీక్షను విజయమ్మ ప్రారంభించారు. గ్రామస్తులకు మెరుగైన పాలన అందిస్తూ మంచి సర్పంచ్‌లుగా పేరు తెచ్చుకోండని ఆమె ఈ సందర్భంగా వారికి సూచించారు. దీక్షలో సర్పంచ్‌లు కొలిపే ప్రసన్నరాణి, దేవరకొండ నాగు, కడారి లక్ష్మి, బండారు వరలక్ష్మి, గొల్లవిల్లి సింగారలక్ష్మి, గంధం గంగాభవాని, వేపల్లి వరలక్ష్మి, కుందేటి అప్పయ్యమ్మ, కొండేపూడి అప్పలకొండ, బత్తిన శ్యామల, సాలాపు పైడమ్మ, బస్వా పద్మావతి, బోయిడి మహాలక్ష్మి, మళ్ల సారద, సాలాపు గంగాభవానీ, చాగంటి పూర్ణ, కేసీనీడి అచ్యుతపద్మ పాల్గొన్నారు. అలాగే సర్పంచ్‌లు కుంచే రాజా, కూండ్రపు సూర్యారావు, పడాల ధర్మరాజు, టేకుమూడి సూర్యచంద్ర, సుంకర సీతారామయ్య, పల్లపు విష్ణుచక్రం తదితరులు పాల్గొన్నారు. -
నీట మునిగిన పొలాలను పరిశీలించిన విజయమ్మ
-
నీట మునిగిన పొలాలను పరిశీలించిన విజయమ్మ
జగ్గంపేట : తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన మంగళవారం జగ్గంపేట నుంచి ప్రారంభమైంది. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆమె అనంతరం సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టిన సర్పంచుల సంఘం శిబిరాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా కాట్రామల పల్లి చేరుకున్నారు. భారీ వర్షాల దాటికి నీట మునిగిన వరి చేళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి..వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ నుంచి బిక్కవోలు, కాకినాడలో పర్యటించనున్నారు.