దశాబ్దం తరువాత జగ్గంపేటలో జ్యోతుల పాగా | jyothula nehru win in jaggampeta | Sakshi
Sakshi News home page

దశాబ్దం తరువాత జగ్గంపేటలో జ్యోతుల పాగా

Published Sat, May 17 2014 12:33 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

దశాబ్దం తరువాత జగ్గంపేటలో జ్యోతుల పాగా - Sakshi

దశాబ్దం తరువాత జగ్గంపేటలో జ్యోతుల పాగా

 జగ్గంపేట, న్యూస్‌లైన్ : మెట్టలోని జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. మోడీ హవా ఉన్నప్పటికీ జగ్గంపేట  నియోజకవర్గ ప్రజలు  నెహ్రూకే పట్టం కట్టారు. తెలుగేదశం పార్టీతో హోరా హోరీగా జరిగిన పోరులో నెహ్రూ 15,932 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం  1,66,343 ఓట్లకు గాను నెహ్రూకు 88,146 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుకు 72, 214 ఓట్లు  లభించాయి. రెండుసార్లు  ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన నెహ్రూ రెండు దఫాలుగా పదవి లేకున్నప్పటికీ నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూ పాలకపక్షంపై పోరాటాన్ని సాగించారు.
 
 ఆయన కృషిని గుర్తించిన ప్రజలు దశాబ్ద కాలం తరువాత ఆయనను గెలిపించారు. రెండోస్థానంలో టీడీపీ అభ్యర్థి చంటిబాబు నిలువగా మూడోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి తోట రవి 1900 ఓట్లతో నిలిచారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి మేడుబోయిన గోవిందరాజులుకు 823 ఓట్లు, ఆర్‌పీఐ అభ్యర్థి పులి ప్రసాద్‌కు 754 ఓట్లు, బీఎస్‌పీ అభ్యర్థి అనసూరి నాగేశ్వరరావుకు 420 ఓట్లు, సంగీత వెంకటరావుకు 235 ఓట్లు, కొప్పిశెట్టి భాస్కరరావుకు 181 ఓట్లు, గునిపే ఏసయ్యకు 249 ఓట్లు, మరుకుర్తి ఏసుబాబుకు 236 ఓట్లు, మురారి రవికుమార్‌కు 259 ఓట్లు లభించాయి. 796 మంది ఎవరికి ఓటు వేసేందుకు ఇష్ట పడకుండా నోటా ద్వారా తీర్పునిచ్చారు. 130 పోస్టల్ బ్యాలట్ ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితాలు వెల్లడి అనంతరం జ్యోతుల నెహ్రూకు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి రాధాకృష్ణమూర్తి అందజేశారు.
 
 అభివృద్ధి బాటలో నడిపిస్తా : జ్యోతుల
 జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని శాసనసభ్యునిగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ తెలిపారు. జేఎన్‌టీయూకే ప్రాంగణంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధానంగా ఐదు సమస్యలను అజెండాగా  చేసుకుని ఎన్నికల బరిలోకి వెళ్లానని, వాటిని విశ్వసించిన ప్రజలు తనకు విజయాన్ని అందించారన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి నివేశన స్థలం ఇస్తానని, పోలవరం కాలువకు ఇరువైపులా ఉన్నా ఖాళీ స్థలంలో  పటిష్ట భద్రతతో ఇళ్ల నిర్మాణం చేపడతానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement