జగన్ సారథ్యంలోనే మళ్లీ సువర్ణయుగం | development on the state in ys jagan hands | Sakshi
Sakshi News home page

జగన్ సారథ్యంలోనే మళ్లీ సువర్ణయుగం

Published Sat, Apr 5 2014 12:04 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్ సారథ్యంలోనే  మళ్లీ సువర్ణయుగం - Sakshi

జగన్ సారథ్యంలోనే మళ్లీ సువర్ణయుగం

తాళ్లూరు (గండేపల్లి), న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యమే సంక్షేమరాజ్యాన్ని, మహానేత వైఎస్సార్ నాటి సువర్ణయుగాన్ని తిరిగి తెస్తుందని పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. తాళ్లూరు గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఒబిణ్ణి సత్యనారాయణ శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరారు.

అలాగే తాళ్లూరు గ్రామస్తులు పలువురు పార్టీలో చేరారు. నెహ్రూ వీరికిపార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆశయాల సాధనకు జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశం శ్రమిస్తున్నారన్నారు. మెట్ట ప్రాంతమైన జగ్గంపేటలో 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని జ్యోతుల హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రజల కోసం తమ పార్టీ అనేక సంక్షేమ పథకాల అమలుకు రూపకల్పన చేసిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు రైతాంగానికి ప్రత్యేక వనరులు, రాయితీలను అందిస్తుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి ఆదుకుంటారన్నారు. వైఎస్సార్ సీపీ ఆశయాలకు, జ్యోతుల నెహ్రూ నాయకత్వానికి ఆకర్షితుడనై పార్టీలో చేరానని ఒబిణ్ణి సత్యనారాయణ చెప్పారు. గ్రామానికి చెందిన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అంకి అప్పారావు, జెడ్పీటీసీ అభ్యర్థి గొల్లవిల్లి వెంకటలక్ష్మి, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి జ్యోతుల నవీన్‌లను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

సుగర్ ఫ్యాక్టరీ బోర్డు డైరక్టర్ ఒబిణ్ణి కృష్ణ, పైన్ని సత్యన్నారాయణ, ఒబిణ్ణి వెంకట్రావు, పుట్టా రాంబాబు, మార్ని సూర్యనారాయణ తదితరులు 250 మంది కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలచర్ల సత్యన్నారాయణ, అత్తులూరి నాగబాబు, సాయిబాబు, కొత్త కొండబాబు, మంతిన నీలాద్రిరాజు, ఒమ్మి రఘురామ్, పోకల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement