నీట మునిగిన పొలాలను పరిశీలించిన విజయమ్మ | YS Vijayamma visits flood effected areas in East godavari district | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 29 2013 10:23 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన మంగళవారం జగ్గంపేట నుంచి ప్రారంభమైంది. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆమె అనంతరం సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టిన సర్పంచుల సంఘం శిబిరాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా కాట్రామల పల్లి చేరుకున్నారు. భారీ వర్షాల దాటికి నీట మునిగిన వరి చేళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి..వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ నుంచి బిక్కవోలు, కాకినాడలో పర్యటించనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement