వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధిర నియోజకవర్గంతోని కలకోటలో భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మిర్చి, జొన్న పంటలను ఆమె పరిశీలించారు. రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఈ సందర్భంగా దెబ్బతిన్న పత్తి మొక్కలను విజయమ్మకు చూపించి తమ గోడు వెలిబుచ్చారు. వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయమైన పరిహారం అందేవరకూ రైతుల పక్షాన పోరాడతామని విజయమ్మ వారికి హామీ ఇచ్చారు. అనంతరం విజయమ్మ వైరా బయల్దేరారు. అక్కడ నుంచి కొణిజర్ల మండలం పల్లిపాడు చేరుకుంటారు. అక్కడ నుంచి ఖమ్మం అర్భన్ మండలం వి.వెంకటాయపాలెం ...ఖమ్మం మీదగా ముదిగొండ మండలం వెంకటాపురం చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అనంతరం నేలకొండపల్లిలో పంటలను పరిశీలించి మధ్యాహ్నం నల్గొండ జిల్ఆ కోదాడ చేరుకుంటారు.
Published Thu, Oct 31 2013 9:42 AM | Last Updated on Wed, Mar 20 2024 3:59 PM
Advertisement
Advertisement
Advertisement