జగ్గంపేట :నూతన సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆకాంక్షించారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో నెహ్రూ దంపతులు నిర్మించిన వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద గురువారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఉదయం స్వామివారికి లక్షబిల్వార్చన, సాయంత్రం శ్రీనివాస కళ్యాణ వేడుకల్లో నెహ్రూ, మణి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా నెహ్రూ, నవీన్‌కుమార్‌ను అభిమానులు తీసుకొచ్చిన గజ మాలలతో ముంచెత్తారు. జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి, అవినాష్ నెహ్రూ, తోట బబ్బి, సునీత, జ్యోతుల సుబ్బారావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు కర్రి పాపారాయుడు, గిరిజాల స్వామినాయుడు, మిండగుదిటి మోహన్, చిట్టిబాబు, వేణుగోపాలరావు, రామసత్యనారాయణ, మాకినీడి గాంధీ తదితరులు హాజరై జ్యోతులకు శుభాకాంక్షలు తెలిపారు.
గోపాలపురంలో..
రావులపాలెం : నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్వగ్రామైన రావులపాలెం మండలం గోపాలపురానికి గురువారం నియోజకవర్గంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూ రు మండలాల నుంచే కాక జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆయన అప్యాయంగా పలకరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎల్లవరంలో..
అడ్డతీగల : నూతన సంవత్సరంలో ఏజెన్సీలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆకాంక్షించారు. అడ్డతీగల మండలం ఎల్లవరంలో గురువారం నూతన సంవత్సరం వేడుకల్లో ఎమ్మెల్యే రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల నుంచి అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రంపచోడవరం ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, పార్టీ మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, జగ్గారావుదొర, ఆదివాసీ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బోండ్ల వరప్రసాదరావు తదితరులు ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తునిలో..
తుని : తుని పట్టణంలో శాంతినగర్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఎమ్మెల్యే రాజాకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలు శాఖల అధికారులు పాల్గొని ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందజేశారు.
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
Published Fri, Jan 2 2015 12:55 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement