మంచి పేరు తెచ్చుకోండి
Published Wed, Oct 30 2013 2:59 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
జగ్గంపేట, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలను జగ్గంపేటలో కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌లు మంగళవారంనాటి దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఉదయం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సందర్శించారు. ఆమె తొలుత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ విజయమ్మకు సర్పంచ్‌లను పరిచయం చేశారు. అనంతరం మహిళా సర్పంచ్‌ల దీక్షను విజయమ్మ ప్రారంభించారు.
గ్రామస్తులకు మెరుగైన పాలన అందిస్తూ మంచి సర్పంచ్‌లుగా పేరు తెచ్చుకోండని ఆమె ఈ సందర్భంగా వారికి సూచించారు. దీక్షలో సర్పంచ్‌లు కొలిపే ప్రసన్నరాణి, దేవరకొండ నాగు, కడారి లక్ష్మి, బండారు వరలక్ష్మి, గొల్లవిల్లి సింగారలక్ష్మి, గంధం గంగాభవాని, వేపల్లి వరలక్ష్మి, కుందేటి అప్పయ్యమ్మ, కొండేపూడి అప్పలకొండ, బత్తిన శ్యామల, సాలాపు పైడమ్మ, బస్వా పద్మావతి, బోయిడి మహాలక్ష్మి, మళ్ల సారద, సాలాపు గంగాభవానీ, చాగంటి పూర్ణ, కేసీనీడి అచ్యుతపద్మ పాల్గొన్నారు. అలాగే సర్పంచ్‌లు కుంచే రాజా, కూండ్రపు సూర్యారావు, పడాల ధర్మరాజు, టేకుమూడి సూర్యచంద్ర, సుంకర సీతారామయ్య, పల్లపు విష్ణుచక్రం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement