వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మరో మైలురాయిని చేరుకుంది. అశేష జనవాహిని వెంటనడువగా.. ప్రజాసంకల్పయాత్ర శనివారం 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. జగ్గంపేటలో పాదయాత్ర ప్రవేశించడంతో 100 నియోజక వర్గాలు పూర్తయ్యాయి.