తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బాలికల గురుకుల పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేపట్టారు.
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బాలికల గురుకుల పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరాదేవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు వాహనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
గురుకులంలో శనివారం కలుషితమైన ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై మంత్రి రావెల కిషోర్బాబు స్పందించారు. తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత గురైన చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.