girls gurukul school
-
రక్షా ‘బంధనాలు’..!
తంగళ్లపల్లి/రామకృష్ణాపూర్: అన్నాచెల్లి..అక్కాతమ్ముడు అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక. కానీ ఇక్కడ బంధనాల నడుమ ఆ వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. కిటికీల సందుల్లో నుంచి అనేక ఇబ్బందులు పడుతూ రాఖీలు కట్టించుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ఉంది. సోమవారం రాఖీ పండుగ కావడంతో అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుందామని సుదూర ప్రాంతాల నుంచి సోదరులు తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చారు. అయితే వారిని ప్రిన్సిపాల్ గురుకులంలోకి అనుమతించలేదు. ఎంత ప్రాథేయపడినా ససేమిరా అన్నాడు. చివరకు చేసేదేమి లేక కిటికీల సందుల్లో నుంచి తమ అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకొని కన్నీళ్లు దిగమింగుకుంటూ తిరిగివెళ్లారు. ఈ విషయంపై గురుకుల పాఠశాల సిబ్బందిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు. తండ్రి భుజాలపై రాఖీ బంధం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో దాసరి అశ్విక, సహస్ర చదువుతున్నారు. రాఖీ పండగకు సోమవారం పాఠశాలకు సెలవు ఇవ్వలేదు. రాఖీలు కట్టేందుకు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో అశ్విక, సహస్రల తమ్ముడు దాసరి జితేంద్ర అక్కలపై ఉన్న ప్రేమతో ఎలాగైనా రాఖీ కట్టించుకోవాలని సాహసం చేశాడు. తండ్రి భుజంపైకి ఎత్తుకోగా హాస్టల్ కిటికీ వద్దకు వచ్చిన అక్కలు జితేంద్రకు రాఖీ కట్టారు. జితేంద్ర రాఖీ కట్టించుకున్న తీరును ఎవరో మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కూడా వైరల్ అయ్యింది. దీనిని అధికారులు తీవ్రంగా పరిగణించారు. గురుకుల జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు విచారణ చేపట్టి కలెక్టర్ కుమార్‌దీపక్‌కు నివేదిక అందజేశారు. రాఖీ పౌర్ణమి సెలవు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గురుకులానికి వచ్చారని, విద్యార్థులందరినీ ఒకేసారి ఉదయం 11గంటలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఓ విద్యారి్థని తండ్రి ఉదయం 9గంటలకే కిటికీలోతన పిల్లలకు రాఖీ కట్టించుకుంటూ సెల్ఫోన్లో వీడియో తీసి గురుకులానికి ఇబ్బంది కలిగేలా చేశారన్నారు. -
నాసిరకం భోజనంతో విద్యార్థులకు అస్వస్థత
సిద్దిపేట అర్బన్: నాసిరకం భోజనం తిని 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా ఉడకని ఆహారం తిన్న విద్యార్థినులు రెండు, మూడు రోజులుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టల్లో ని ఓ గదిలో ఉంచి పుల్లూరు పీహెచ్సీ వైద్యులతో వైద్యం చేయిస్తున్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. పునరావృతం కావొద్దు: కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని సామాజి క మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వారిని అడగ్గా ప్రస్తుతం బాగా నే ఉందని విద్యార్థినులు సమాధానం చెప్పారు. పిల్లలు బాగా నే ఉంటే బయట ప్రచారం మరోలా జరుగుతోందని ఇలా ఎందుకు అని ప్రిన్సిపాల్ లలితను ప్రశ్నించగా హెడ్ కుక్ రాకపోవడంతో మరో వ్యక్తి వంట చేయగా నాణ్యత లోపించి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాధానం ఇచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యం కుదుటపడే వరకు మెడికల్ సిబ్బంది అక్కడే ఉండి వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. -
జగ్గంపేటలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బాలికల గురుకుల పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరాదేవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు వాహనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గురుకులంలో శనివారం కలుషితమైన ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై మంత్రి రావెల కిషోర్‌బాబు స్పందించారు. తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత గురైన చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.