![Teacher Crushed LKG Student: East Godavari district](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/5/Teacher.jpg.webp?itok=TmrRt_Hd)
పెరవలి: ముక్కుపచ్చలారని విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా చితకబాదిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన చేబ్రోలు అనిల్‌కుమార్ కుమారుడు పెరవలి మండలం కానూరు గ్రామంలోని రమా గాయత్రి ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన సమయంలో ఏడుస్తున్న ఆ విద్యార్థి ఆటో నుంచి దిగలేదు. దీంతో ఉపాధ్యాయుడు అశోక్ వచ్చి, ఆ బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు.
ఇంటికి వచ్చిన తరువాత కూడా బాబు ఏడుస్తుండడంతో ఆరా తీయగా మాస్టారు కొట్టారంటూ వీపుపై ఉన్న గాయాలు చూపించాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని శుక్రవారం రాత్రి పెరవలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయమూర్తి అనుమతి తీసుకుని, కేసు నమోదు చేయాల్సి ఉందని, అనుమతి కోసం దరఖాస్తు చేశామని ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment