5 నెలల పాలనలో 50 వంచనలు | Five months during the 50 scams chandrababu naidu | Sakshi
Sakshi News home page

5 నెలల పాలనలో 50 వంచనలు

Published Mon, Nov 3 2014 12:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

5 నెలల పాలనలో 50 వంచనలు - Sakshi

5 నెలల పాలనలో 50 వంచనలు

జగ్గంపేట :ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలకు గుప్పించి అధికారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఐదు నెలల పాలనలో 50 మోసాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత  జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. బాబు దగాని నిరసిస్తూ ఈ నెల 5న మండల కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘ఐదు నెలలు-యాభై మోసాలు, బాబు దగాలు... జనం దిగాలు’ పేరిట చేపట్టే ధర్నా పోస్టర్‌లను ఆదివారం రాత్రి జగ్గంపేటలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రుణాల మాఫీపై పూటకో కట్టుకథ అల్లుతూ చంద్రబాబు కాలం గడపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
 
 రుణ మాఫీ అవుతుందో లేదో తెలియని అయోమయంతో పాటు ప్రస్తుతం పెట్టుబడులకు కూడా రుణాలు పొందలేని గడ్డు స్థితిలో ఉన్నారన్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించీ అదే తరహా పిట్టకథలు చెబుతున్నారని, పేదల పింఛన్ల మీద పగ పట్టారని, రేషన్ కార్డులను తీసివేశారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దగా, మోసం, దుర్మార్గాలకు వ్యతిరేకంగా చేపట్టే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, తమ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్, సర్పంచ్ కొలిపే ప్రసన్నరాణి, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, పార్టీ నాయకులు నీలాద్రిరాజు, జీను మణిబాబు, సోమవరం రాజు, ఒమ్మి రఘురామ్, తోలుగంటి గోవిందరెడ్డి, కింగం రమణ, రాంబాబు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement