వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారం జిల్లాకు రానున్నారు.
జగ్గంపేట : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారం జిల్లాకు రానున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో పర్యటించిన ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేశారు. విమానాశ్రయం నుంచి జ్యోతుల నరేంద్రపురం, రాజానగరం, గండేపల్లి, జగ్గంపేటల మీదుగా స్వగ్రామమైన ఇర్రిపాక వెళతారు.