ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమరశంఖారావం భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన డేటా చోరీ కేసులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఒక సైబర్ క్రిమినల్ అని వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు.