రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన సమర శంఖారావ సభకు హాజరైన అశేష జనసముహాన్ని ఉద్దేశించి జననేత వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నారు. సమర శంఖారావం వేదికపై నుంచి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.