‘ఇదే కాకినాడ నియోజకవర్గం గుండా నా మూడు వేల ఆరు వందల 48 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఇదే కాకినాడను చంద్రబాబు స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. స్మార్ట్ సిటీ సంగతి దేవుడెరుగు కనీసం ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా నిర్మించలేదు. ఇదే తూర్పు గోదావరి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని మాటలు చెప్పారు. 19 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. ఇవి సరిపోవన్నట్టుగా చంద్రబాబు కుట్ర చేసి.. ప్రలోభాలు పెట్టి.. సంతలో పశువులను కొన్నట్టుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలలో 17 మందిని సంకలో పెట్టుకొని ఈ జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటి? ఇక్కడ లార్జ్ పరిశ్రమ సంగతి దేవుడెరుగు.. కనీసం చిన్నస్థాయి పరిశ్రమను కూడా ఆయన తీసుకురాలేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు