
సాక్షి, వైఎస్సార్: రేపు కడపలో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావంను విజయవంతం చేయాలని కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ పాషా పిలుపునిచ్చారు. సభ ద్వారా జిల్లాలోని బూత్‌స్థాయి సభ్యులకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని వారు తెలిపారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నిపేందుకునే సమర శంఖారావంను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలపై గతంలో విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అవే పథకాలను కాపీ కొట్టారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.